The Rise, Fall & Rise Of Vyjayanthi Movies & Swapna Cinema In Tollywood

ప్రతి మనిషి జీవితంలో లాభం-నష్టం, కష్టం సుఖం, అనేవి ఎంత సహజమో సినిమా వాళ్ళకి అందులోను నిర్మాతలకి హిట్-ప్లాప్ అనేవి, హిట్ అయితే వచ్చే లాభాలు, ప్లాప్ అయితే కోలుకోలేని నష్టాలు అంతే సహజం. కాకపోతే ఒక ప్లాప్ నుండి ప్లాపుల నుండి తేరుకుని మంచి కథ చెప్పాలి అనే మళ్ళీ హిట్ కొట్టాలి అనే దృఢ సంకల్పం ఉన్నవారే సినిమా రంగంలో నిలదొక్కుకోగలరు. అందుకు చక్కటి ఉదాహరణ అయితే అయన బ్యానేర్ ‘వైజయంతి మూవీస్’ బ్యానర్లో వచ్చిన సినిమాలు ఓ గొప్ప సాక్ష్యం.

వైజయంతి మూవీస్ – తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఓల్డ్ అండ్ మంచి ప్రొడక్షన్ బ్యానేర్స్ లో ఒకటి. NTR తో మొదలు పెడితే ANR , కృష్ణ తరం తరువాత చిరంజీవి, నాగార్జున, ఆ తరువాత మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, నుండి నాని, నవీన్ పోలిశెట్టి, దుల్కర్ సల్మాన్ ల వరకు వైజయంతి బ్యానర్లో చేసిన సినిమాలు వచ్చిన హిట్స్ కి పెద్ద చరిత్ర ఉంది. ఒకానొక టైములో దత్ గారు చేసిన ప్రతి సినిమా హిట్ కానీ అక్కడక్కడా ఫ్లోప్స్ కూడా ఉన్నాయి. ఫ్లోప్స్ వచ్చిన ప్రతి సారి ఒక మళ్ళీ మంచి కథతో వస్తాను అన్న ప్రయత్నమే ఈరోజు వైజయంతి మూవీస్ బ్యానేర్ కి ఫాన్స్ ని తెచ్చి పెట్టింది.

ఈ నలభై ఏళ్ల సినీ ప్రస్థానంలో వైజయంతి బ్యానర్ చుసిన విరాజాయ-అపజయాలు, మంచి సినిమా ఇవ్వడానికి వాళ్ళు పడ్డ కష్టం ఓసారి చూస్తే…

‘ఓ సీత కథ’ తో మొదటి అడుగు….

1974, నాన్న చేసిన ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కాకుండా ప్రొడ్యూస్ చేయాలని అనేది అశ్వని దత్ గారి ఆలోచన. కానీ చెప్తే ఏమంటారో అయిన్ చిన్న సందేహం కానీ అడిగి చూద్దాం అని అడిగితే అయన సారే సినిమా వ్యాపారమే కాదా…చేసుకో కానీ జాగ్రత్త చెప్పి కొంత డబ్బు ఇచ్చారు. ఆ డబ్బు తీసుకోని దత్మ గారు మద్రాస్ బయలుదేరారు…వచ్చే క్రమంలో ఎలాగైనా పెద్దాయన NTR తో ఎలాగైనా సినిమా చేయాలి అనేది అయన ఆలోచన. కానీ ఆది సులువు కాదు…పెద్దయన డేట్స్ దొరకాలి అంటే కష్టం సారే ఈలోపు ఏదైనా సినిమా చేద్దాం అనుకుంటుండగా K.విశ్వనాధ్ గారి దగ్గరున్న ‘ఓ సీత కథ’ దత్ గారి చెవిన పడింది. శర్మ అనే మరో మిత్రుడి తో కల్సి దత్ గారు ఈ మూవీస్ సావరిన్ ఫిలిమ్స్ బ్యానర్ పైన తీశారు. మూవీ హిట్ అవ్వడం డబ్బులు రావడంతో పాటు నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి.

అన్నగారి ఆశీస్సులతో….వైజయంతి ప్రస్థానం మొదలు

ఓ సీత కథ తరువాత దత్ గారు NTR తో సినిమా చేయడానికి ఓ కథ పట్టుకుని తిరుగుతున్నారు. ఎలాగో ఆలా ఆయనతో మాట్లాడే టైం కుదిరింది కానీ పెద్దాయన ఏమో ఎందుకు ఈ సినిమాలు ఓ సీత కథ డబ్బులు వచ్చాయి కదా? ఇంకా వెళ్ళిపో అన్నారు కానీ కథ విన్నాక ఒకే చెప్పారు. దత్ కి బ్యానర్ పేరు పెట్టాలో అర్ధం కాలేదు పెద్దయనకి అడిగితే అదే రూంలో ఉన్న కృష్ణుడి మెడలో ఉన్న వైజయంతి మలని చూస్తూ అది పెట్టుకో అన్నారు… అలా వైజయంతి మూవీస్ బ్యానర్ కి పునాది పడటమే కాకుండా ఆ బ్యానర్లో మొదటి సినిమా ‘ఎదురులేని మనిషి’ విడుదలయ్యి పెద్ద విజయం సాదించింది. ఆ తరువాత NTR తో యుగ పురుషుడు, ANR-Krishna లతో గురు-శిష్యులు, ANR-వెంకటేష్ లతో బ్రహ్మరుద్రులు చేసారు.

చిరుతో జగదేక వీరుడు అతిలోక సుందరి – దాని తరువాత ప్లాపులు:

NTR-ANR త్రయం తరువాత నాగార్జునతో 1988లో ఆఖరి పోరాటం తీశారు ఇది సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తరువాత చిరంజీవితో కలిసి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ నిర్మించారు ఇది all time క్లాసిక్ హిట్. ఈ సినిమా వైజయంతి బ్యానర్ అల్లటిమే హిట్ ని ఇవ్వడమే ఇవ్వడమే కాదు తెలుగు సినిమా స్థాయిని పెంచింది…అప్పట్లోనే ఆ visuals , కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ తో పాన్–ఇండియా అప్రోచ్ యూనివర్సల్ సబ్జెక్టు తీశారు దత్ గారు.అంత బాగుంది అనుకునేలోపే 1993 లో బాలకృష్ణతో చేసిన అశ్వమేధంతో ప్లాప్…ఒక సంవత్సరం ఆగి ‘గోవిందా గోవిందా’ చేస్తే అది ఇంకా పెద్ద ప్లాప్.

ఐదు సంవత్సరాల విరామం తరువాత హిట్ తో మళ్ళీ తెరపైకి:

గోవింద గోవింద తరువాత తీర్చలేని నష్టాల్లోకి వెళ్లిపోయిన దత్ గారు ఐదు సంవత్సరాల విరామం తరువాత ఎలాగైనా కొట్టాలనే కసితో ఉన్న టైంలో గుణశేఖర్ చెప్పిన చుడాలని వుంది కథ కథ నచ్చడం అది చిరంజీవి వరకు తీసుకెళ్లడం….అయన ఓకే చెప్పడంతో ‘వైజయంతి’ ఖాతాలో మరో విజయం. ఈ సినిమాతో గుణశేఖర్ లాంటి దర్శకుడిని, టెక్నీషియన్ని Limelight లోకి తిస్కరావడమే కాకుండా మణి శర్మ లాంటి ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కి నమ్మి ఛాన్స్ ఇచ్చారు దత్ గారు. ఈ సినిమా తరువాత మహేష్ బాబుని హీరోగా పరిచయం చేసే బాధ్యతని భుజాల మీద వేసుకున్నారు దత్ గారు ప్రయత్నం కాస్త రాజకుమారుడు చిత్రం విజయంతో తీరిపోయింది. అయితే రావోయి చందమామ రూపంలో మళ్ళీ ప్లాప్.

తరువాత మళ్ళీ నాగార్జున కి హిట్ అవ్వాలని పనిగా ఆజాద్ చేసి హిట్ కొట్టారు. దీని తరువాత దత్ గారి పెద్ద కూతురు స్వప్న సినిమా పేరు మీద రాఘవేందర్ రావు తో కలిసి & రాజమౌళి ని పరిచయం చేస్తూ చేసిన స్టూడెంట్ No 1 చేసిన పెద్ద హిట్. ‘తరువాతః హిందీ లో బోనీ కపూర్ తో కలిసి కంపెనీ ప్రొడ్యూస్ చేస్తే అది cult హిట్. తరువాత చిరుతో ముచ్చటగా మూడుసారి జోడి కడితే ఇంద్ర తీస్తే ఇండస్ట్రీ హిట్. అల్లు అరవింద్ తో కలిసి అల్లు అర్జున్ ని హీరోగా పరిచయం చేస్తూ వైజయంతి & గీత్ ఆర్ట్స్ ‘గంగోత్రి’ తీశారు ఇది కూడా హిట్.

వైజయంతికి వరుస ప్లాపులు:

ఇంద్ర, గంగోత్రి, తరువాత 2005 లో, పవన్ కళ్యాణ్ తో మొదటి సినిమా బాలు చేస్తే ఇది పెద్ద ప్లాప్. తరువాత వెంకీతో సుభాష్ చంద్రబోస్ ఇది పెద్ద డిజాస్టర్, తరువాత జై చిరంజీవ కొంచెం ఊరటని ఇచ్చిన మహేష్ బాబుతో చేసిన సైనికుడితో మరో డిజాస్టర్. అయితే ప్లాపుల్లో ఉన్న అశ్వని దత్తుకి చిరు పిలిచి మరి రామ్ చరణ్ ని తెలుగు సినిమాకి పరిచయం చేసే అవకాశం ఇచ్చాడు ఇది హిట్. కానీ ఈ సినిమా మొదలైంది వైజయంతి కి అస్సలు పరీక్ష…రజినీకాంత్ తో చేసిన కథానాయకుడు, కంత్రి & శక్తీ వరుసగా మూడు ప్లాపులు. ఇందులో కథానాయకుడు మలయాళం ప్రొడ్యూసర్ తో కలిసి చేసారు..కాబట్టి నష్టం కొంచమే కానీ కంత్రి, శక్తి సినిమాలు దత్ గారిని వైజయంతి బ్యానర్ ని సినిమాలకి దాదాపు ఏడేళ్ళు దూరం చేసింది.

The Rise Of వైజయంతి -స్వప్న సినిమా:

దత్తు గారికి ముగ్గురు కూతుర్లు… పెద్దమ్మాయి స్వప్న దత్, రెండో అమ్మాయి ప్రియాంక దత్, చివరి అమ్మాయి స్రవంతి దత్ వీళ్ళే వైజయంతికి వారసులు. ఈ ముగ్గురి పేరు మీదే ‘Three Angles Studio’ పెట్టి Baanam, Om Shanti, సారొచ్చారు మూవీస్ చేసారు ప్రియాంక దత్.

అయితే శక్తికి ముందు చేసిన సినిమాలు..శక్తీ తరువాత చేసిన ఈ సినిమాలు కమర్షియల్ ఫెయిల్యూర్స్ కావడంతో Three Angles స్టూడియో బ్యానర్ మీద సినిమాలు ఆపేసారు. ఆ తరువాత మళ్ళీ సినిమాలు చేయాలనే ఆలోచనతో స్వప్న సినిమా బ్యానేర్ స్థాపించి 2015 లో ఎవడే సుబ్రహ్మణ్యం చేసారు ఇది క్రిటిక్స్ సినిమా ఆడియన్స్ నుండి మంచి సినిమా అని పేరు తెచ్చుకోవడం తో పాటు కొంచెం డబ్బులు తెచ్చి పెట్టింది.

ఈ సినిమా హిట్ ఇచ్చిన బూస్ట్ కి మూడేళ్లు గ్యాప్ తీసుకుని మరి సావిత్రి గారి కథతో ‘మహానటి’ లాంటి క్లాసిక్ ని తెలుగు ఆడియన్స్ కి బహుమతిగా ఇచ్చారు. మహేష్ 25th మూవీకి వైజయంతి వాళ్ళు ఒక ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, PVP తో కలిసి తీసి… ఈ సినిమా హిట్ కొట్టారు. తరువాత జాతి రత్నాలుతో మరో హిట్. క్లాసిక్ అనిపించే సినిమా ఎహ్ ప్రొడ్యూసర్ కి అయినా? ఎహ్ బ్యానర్ కి అయినా once in a lifetime’ జరిగే అద్భుతం. అలాంటిది ఒక జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి మళ్ళీ ఇప్పుడు సీత రామం రూపంలో మరో దృశ్య కావ్యం. నాలుగు దశాబ్దాల్లో మూడు క్లాసిక్స్ తీయడం అనేది కేవలం వైజయంతి వాళ్ళకే దక్కింది.

సినిమా మీద ఇష్టంతో, మంచి సినిమా తియ్యాలి అనే అభిలాషతో అశ్వని దత్ గారు మొదలు పెట్టిన ప్రయాణం….ఆ ప్రయాణంని తరువాత తరానికి మేము ఇస్తాము అనే బాధ్యత కూతుళ్లు స్వప్న దత్, ప్రియాంక దత్ తీసుకున్నారు, తీసుకోవడమే కాదు ఈ ప్రయత్నంలో మహానటి,  సీత రామంతో ప్రూవ్ చేసారు తరువాత Project K తో ఇండియన్ సినిమా ని వరల్డ్ సినిమా కి పరిచయం చేసేందుకు కంకణం కట్టుకున్నారు ఈ వైజయంతి వారసులు.

ఒక మంచి కథ చెప్పడం కోసం, అశ్వని దత్ గారు, ప్రియాంక దత్, స్వప్న గారు పడిన కష్టం, వాళ్ళకి ఎదురు వచ్చిన సవాళ్లు, చుసిన హిట్స్, తీసిన క్లాసిక్స్….అన్ని వెరసి వైజయంతిని మూవీస్ బ్యానర్ కి ఒక హీరో-హీరోయిన్ ఉండేలా అభిమానులని తెచ్చి పెట్టింది.

Thank You Vyjayanthi Movies, Swapna Cinema For Making Such Stories & Making Us Proud.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR