అంతర్వేదిలోని కూర్మ నాయకుని అవతరణ రహస్యం!

రక్త లోచనుని ఒక్కో రక్తబిందువు నుండి రాక్షసులు పుట్టుకొస్తున్నారు. శ్రీ నరసింహ స్వామి సృష్టించిన మాయాశక్తి, రత్నలోచనుని దేహము నుండి రక్త బిందువులను భూమిపై పడనీక త్రాగుచూ – ఆ దానవుని సంహరించిన తరువాత మహాశక్తి విడిచిన రక్తము మహానదియై “రక్త కుల్యానది” పేరుతో అంతర్వేది క్షేత్రము ఉత్తర భాగంలో, సముద్రంలో కలిసింది.

అంతర్వేదిచాలా కాలం తరువాత ఒక జాలరి చేపలు పట్టడానికి ఈ నదిలో వలవేయగా అందులో చేపలు చిక్కక ఒక శిల వలలో పడింది. జాలరి ఆ శిలను నిర్లక్షంగా నదిలో పడేసాడు. మళ్లీ మళ్లీ అదే శిల చిక్కుతుంది. విసిగి వేసారిన జాలరి ఆ శిలను నేలపై కొట్టి చూర్ణము చేయడానికి ప్రయత్నించాడు. ఆ శిలనుండి రక్తము వచ్చింది, కొద్ది క్షణాల్లో నది మొత్తం రక్తంతో నిండిపోయింది. బెస్తవాడు భయపడి మూర్ఛపోయి పడిపోయాడు.

అంతర్వేదిఅంతలో స్వామి సాక్షాత్కరించి, నేను గండకీ నదిలో సాలగ్రామ రూపుడనై అవతరించిన విధంగా ఈ రక్త కుల్యానదిలో కూడా, కూర్మరూపుడనై అవతరించాను. కాబట్టి ఈ నది పవిత్రమై వర్ధిల్లుతుంది. మాఘమాసంలో ఆదివారము రోజున సూర్యోదయంలో ఈ నదిలో స్నానం చేసేవారికి, చేసిన పాపాలు పోయి, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. అందువల్ల నా శిలా రూపమును, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి నమస్కరించి, స్వామి వారితో పాటు నాకు కూడా నిత్యాభిషేకము జరిపించటం వల్ల శుభం కలుగుతుందని నా ఆజ్ఞగా చెప్పు”అని అంతర్ధానము అయ్యాడు.

అంతర్వేదిబెస్తవాడు మూర్చనుండి మేల్కొని, ఆనంద పరవశుడై ఆ శిలారూపమును శ్రీ స్వామి సన్నిధికి సమర్పించి శ్రీ కూర్మనాధుని ఆజ్ఞ గురించి చెప్పాడు. భక్తితో ప్రజలందరూ శ్రీ కూర్మ నాయకునికి నిత్యపూజలు చేస్తున్నారు.

అంతర్వేదిఈ సంఘటన జరిగి ఎన్నో వేల సంవత్సరాలు అయినా ఇప్పటికీ అంతర్వేదిని దర్శించేవారు, శ్రీ కూర్మనాయకుని సందర్శించి పూజిస్తారు. ఈ పుణ్య క్షేత్రములో సముద్రము, సాగర సంగమము, గోదావరినది, రక్త కుల్యానది, చక్ర తీర్ధము పంచతీర్ధాలుగా ప్రసిద్ధి చెందాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,570,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR