ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన బాంగ్రా కోట రహస్యం

దేవుళ్లు,దెయ్యాలు,మహిమలు లాంటివి ఏమీ లేవని హేతువాదులు ఎంత వాదిస్తున్నా… దేవుడు ఉన్నాడని అలాగే దెయ్యాలు కూడా ఉన్నాయని బలంగా నమ్మేవాళ్ళూ ఉన్నారు. ఇక భారతదేశంలో అటువంటి ప్రాంతాలకు కొదువేలేదు. వేల సంఖ్యలో ప్రాచుర్యం పొందిన దేవాలయాలు ఉన్న మనదేశంలో అంతే ప్రాచుర్యం పొందిన భయానక ప్రదేశాలూ ఉన్నాయి.

Bangra fortకొన్ని పర్యటక కట్టడాల్లో కూడా దెయ్యాలు ఉన్నాయని ప్రచారం ఉంది. అయినప్పటికీ వాటిని చూసేందుకు, వాటి గురించి తెలుసుకునేందుకు పర్యాటకులు వస్తుంటారు. అలాంటి ఒక ప్రాంతమే రాజస్థాన్ లోని బాంగ్రా కోట.

Bangra fortప్రపంచంలోనే అత్యంత భయానక ప్రాంతంగా ఈ కోటకు పేరుంది. పగటి సమయంలో మాత్రమే దీనిని చూడటానికి పర్యాటకులకు అనుమతి ఇస్తారు. రాత్రి సమయంలో ఈ కోటలో ఒక్కరిని కూడా ఉండనివ్వరు. దీని గురించి గతంలో కథలు కథలుగా చెప్పుకునే వారు. ఈ కోట గురించి సినిమాల్లో కూడా చూపించారు. దీని గురించి తెలియక.. చాలా మంది చూసేందుకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు.

Bangra fortఈ కోటను కచ్వాహా పాలకుడు రాజా భగవత్ సింగ్ తన చిన్నకుమారుడు మాధో సింగ్ కోసం క్రీ.శ. 1573లో నిర్శించారు. పగటివేళ సైతం అత్యంత భయానకంగా దర్శనమిచ్చే బాంగ్రా కోట రాత్రి సమయంలో మరింత భయంకరంగా ఉంటుంది. దీంతో ఈ కోటను చూడడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే సూర్యోదయం నుండి సూర్యస్తమయం వరకు మాత్రమే కోటలోకి అనుమతిస్తారు. సూర్యాస్తయమయం అనంతరం ఈ కోటలోకి ఎవరినీ అనుమతించరు. ఈ నిబంధనను అతిక్రమించిన వారు ప్రాణాలు పోగొట్టు కొన్న సంఘటనలు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వమే అధికారికంగా కోట ఎదుట బోర్డు పెట్టడం గమనార్హం.

Bangra fortఇప్పటికీ ఇక్కడ నన్ను కాపాడు.. నన్ను కాపాడు అనే కేకలు వినిపిస్తూనే ఉంటాయని కొందరు చెబుతుంటారు. అవి నారాయణ రావు అనే వ్యక్తి కేకలు అని అంటుంటారు. రాజకీయ కారణాలతో అతను హత్య చేయించబడ్డాడు. అయితే ఈ కోటపై ఉన్న మమకారంతో అతని ఆత్మ ఇప్పటికే అక్కడే తిరుగుతూ ఉందని చెబుతారు. ఆతని కోపం వల్లే ఈ కోట అగ్నికి ఆహుతి అయ్యిందని చెబుతారు. కోట అగ్నికి ఆహుతైన గుర్తులను అక్కడ ఇప్పటికీ చూడవచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR