తిరుమలలో తీసివేసిన మాలలు,పూలు పూలబావిలో ఎందుకు వేస్తారో తెలుసా

తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి వేసిన పూలదండలు బయట పడేయరు. తీసివేసిన మాలలు,పూలు పూలబావిలో ఎందుకు వేస్తారో తెలుసుకుందాం.. అద్దాల మండపానికి ఉత్తరం దిక్కున ఉంది ఈ పూలబావి. స్వామి వారికి సమర్పించిన తులసీ, పూలదండలు, పువ్వులు ఎవ్వరికి ఇవ్వకుండా ఈ పూలబావిలోనే పడేస్తారు. ఆపదవచ్చినప్పుడు తొండమానుడు ఈ పూలబావి రహస్య సొరంగ మార్గం ద్వారానే ఆ వెంకటేశ్వరస్వామిని శరణువేడాడు.

The secret of Tirumala Poolabaviస్వామి వారు ఏకాంతంలో వుండగా తొండమాన్ చక్రవర్తి రావడంతో సిగ్గుపడిన దేవేరులు హడావుడిపడి శ్రీదేవి (లక్షీ దేవి) శ్రీవారి వక్షస్థలం చేరుకోగా, భూదేవి దగ్గరలో వున్న భావి లోకి వెళ్ళి అంతర్దానమయ్యిందట. ఈ కథను విన్న రామానుజులవారు స్వామివారికి సమర్పించి తీసివేసిన పూలమాలల్ని (మాలిన్యాన్ని) ఈ భావిలో సమర్పించాలని కట్టడి చేసారు.

The secret of Tirumala Poolabaviతీసివేసిన పూలను వేసేవారు కాబట్టి ఈ భావిని పూలబావి అనడం వాడుకలోకి వచ్చింది. ఆనాటినుండి ప్రతిరోజు శ్రీవారి పూలమాలలు, తులసి మాలలు ఈ బావిలోనే సమర్పించడం జరుగుతోంది. అయితే ఇటీవల కాలంలో తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి జరిగే సేవల్లోను విశేషంగా పుష్పాలంకరణ జరుగుతతున్నందు వల్ల విపరీతంగా పేరుకుపోతున్న ఈ నిర్మాల్యాన్ని తిరుమల పర్వత సానువుల్లో ఎవరూ తొక్కని చోట జారవిడవటం జరుగుతోంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR