శ్రీలంక నుండి వేరే లోకానికి నిజంగా వేరే లోకానికి మార్గం ఉందా?

శ్రీలంక రామాయణంలో లంక నగరంగా పిలువబడింది. రాక్షస రాజైన రావణుడు లంక నగరానికి రాజుగా ఉండేవాడు. శ్రీలంక అనేది హిందూమహాసముద్రంలో ఉన్న ఒక ద్విపం. మరి శ్రీలంక నుండి నిజంగా వేరే లోకానికి మార్గం ఉందా? శ్రీలంక నుండి వేరే లోకానికి మార్గం ఉందనడంలో నిజం ఎంతనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Srilanka Dweepamఇతర లోకాలకు వెళ్లే మార్గాలు శ్రీలంక ద్విపం నుండి కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయని, పూర్వం కొందరు సిద్దులు మరియు యోగులు ఆ రహస్య మార్గాల గుండా ఇతర లోకాలకు వెళుతూ ఉండేవారని శ్రీలంకకు చెందిన కొన్ని సాంప్రదాయ కథల్లో చెప్పబడింది. అంతేకాకుండా 20 వ శతాబ్దం అర్ధభాగంలో అధ్భూతా రచయితగా పేర్కొనబడిన ఆర్ధర్.సి.క్లార్క్ కూడా శ్రీలంకలో ఇతర లోకాలకు వెళ్లే మార్గాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని బలపరిచాడు. ఇప్పటికి శ్రీలంక సమాజంలో ఇతర గ్రహాలకు చెందిన బుద్ది జీవులు అజ్ఞాతంలో జీవిస్తున్నారని పాచ్యాత్య దేశాలకు చెందిన అనేకమంది పారా సైకాలజిస్టులు విశ్వసిస్తున్నారు. మధ్యయుగంలో కూడా కొందరు పాశ్చత్య రచయితలు ఇక్కడ ఎన్నో నిగూడ రహస్యాలు ఉన్నాయని విశ్వసించారు.

SriLanka Dweepamఇక క్రీ.శ. 2 వ శతాబ్దానికి చెందిన టోలెమీ తన గ్రంధంలో కతర్ గమ్ అనే పుణ్యక్షేత్రానికి దగ్గరలో ఇతర లోకాలకు వెళ్లే ఒక రహస్య మార్గం ఉందని ఆయన పేర్కొన్నాడు. రామాయణ విషయానికి వస్తే, లంక భూభాగం కింద, అడుగుభాగంలో ఒక లోకం ఉండేదని ఆ లోకాన్ని రావణుడి అన్నగారు అయినా మైల్ రావణ పరిపాలిస్తుండేవాడని కొన్ని పురాతన గ్రంధాలలో ఉంది.

Srilanka Deepamఇది ఇలా ఉంటె, పురాతన కాలంలో శ్రీలంక ద్విపం ఒక పెద్ద ఖండం పరిమాణంలో ఉండేదని దీనినే అప్పట్లో లేమురియా అని పిలిచేవారని తెలుస్తుంది. ఆ కాలంలో శ్రీలంకలో అపారమైన సంపద ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మంత్ర శాస్ర పరిజ్ఞానం ఉండేవని కొందరు పరిశోధకులు చెబుతున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR