Home Unknown facts శ్రీకృష్ణుడు చెల్లించిన ఆ గురుదక్షిణ ఏంటో తెలుసా ?

శ్రీకృష్ణుడు చెల్లించిన ఆ గురుదక్షిణ ఏంటో తెలుసా ?

0

శ్రీకృష్ణుడు హిందూ మతంలో అర్చింపబడే దేవుడు. ఈయన విష్ణుమూర్తి యొక్క పది అవతారాలలో తొమ్మిదో అవతారం. చిలిపి బాలునిగా, గోపికల మనసు దోచుకున్న వాడిగా, యాదవ రాజుగా, రుక్మిణీ సత్యభామల ప్రభువుగా, అర్జునిని రథ సారథిగా, దేవదేవునిగా ఇలా బహు విధాలుగా శ్రీకృష్ణుని రూపాలు ఇతిహాసాలలో చెప్పబడ్డాయి. భారతదేశంలో ప్రత్యేకించి వైష్ణవ హిందూ మతంలో కృష్ణుని పూజ ప్రత్యేకం. దాదాపు ప్రతి చోట శ్రీ కృష్ణుని ఆలయాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకృష్ణుని గురించి ఎన్నో విశేషాలు, ఆశ్చర్య కర విషయాలు ఉన్నాయి. ఎవరైనా విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు గురుదక్షిణ సమర్పించుకోవాలి. అలా చేయకపోతే నేర్చుకున్న విద్యకు అర్థం పరమార్థం ఉండదు. అందుకే పురాణాలలో చాలా మంది శ్రేష్టులు గురుదక్షిణ సమర్పించినట్లు మనం కథనాల్లో విని ఉన్నాం.

Guru Dakshina By Krishnaసాక్షాత్తు విష్ణు స్వరూపుడైన శ్రీ కృష్ణుడు సైతం గురువు దగ్గర విద్యనభ్యసించి గురుదక్షిణ సమర్పించుకున్నాడు. విద్యాబుద్ధులు నేర్చుకుని ఉన్నతుడు కావాలని బాలకృష్ణుడు సాందీపుని ఆశ్రమంలో చేరాడు. సాందీపుడు మహర్షులలో పేరెన్నికగన్నవాడు. సాందీపుని ఆశ్రమంలోని ఇతర శిష్యులతో కలిసి ఆశ్రమానికి అవసరమైన సేవలు చేసి గురుశుశ్రూషలో తరించాడు బాలకృష్ణుడు.

సాందీపుని శిక్షణలో బాలకృష్ణుడు సకల శాస్త్ర విద్యా పారంగతుడయ్యాడు. గురు సన్నిధిని వీడి రాజవాసానికి చేరుకునే సమయం ఆసన్నమైంది. విద్యను నేర్పిన గురువుకు ధన్యవాదాలు తెలియచేసుకునే క్రమంలో గురుదక్షిణ చెల్లించుకోవాలని శ్రీకృష్ణుడు నిర్ణయించుకున్నాడు.

గురువుకు సంతృప్తిని కలిగించేది ఏదైనా అందించాలని నిర్ణయించుకున్న బాలకృష్ణుడు, అదే విషయాన్ని సాందీపుని ముందు ఉంచాడు. గురుదక్షిణ ఏది కావాలో అడగండని శ్రీకృష్ణుడు తెలుపగానే గురుపత్ని కన్నీరుమున్నీరు అయ్యింది. ప్రభాస తీర్థంలో తప్పిపోయిన తమ కుమారుడిని తీసుకురమ్మని ఆమె కోరింది. గురుపత్ని కోరిక కష్టసాధ్యమైనప్పటికీ శ్రీకృష్ణుడు వెనుకాడలేదు.

ప్రభాస తీర్ధం వద్ద గల సముద్రంలో స్నానం చేస్తున్న సాందీపుని కుమారుడిని పాంచజన్యమనే పేరు కలిగిన రాక్షసుడు అపహరించుకుపోయాడు. పాంచజన్యునితో పోరాటం జరిపిన శ్రీకృష్ణుడు అతనిని తుదముట్టించాడు. సాందీపుని కుమారుని తీసుకువచ్చి సాందీపునికి అప్పగించి తన గురుభక్తిని చాటుకున్నాడు. ఆ విధంగా వెలకట్టలేని గురుదక్షిణ చెల్లించుకున్నాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడి గురుభక్తి చరిత్రలో మిగిలిపోయింది.

 

Exit mobile version