నారదుడు విష్ణుమూర్తిని తన సంగీతంతో ఏ విధంగా సంతృప్తి పరిచాడు

హిందూపురాణాల ప్రకారం తుంబురుడు గంధర్వుడు. సంగీతంలో ప్రవీణునిగా సుప్రసిద్ధుడు. పరమశివుని డమరుక నాదం నుంచి జన్మించిన సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరిన వారు నారద తుంబురులు. వివిధ సాంప్రదాయాలకు చెందిన భారతీయ సంగీతంలోని పలువురు వాగ్గేయకారులు, సంగీతవిద్వాంసులు తుంబురుని నారదునితో కలిపి గురువులుగా కీర్తించడమనే పరంపర ఉంది. ఆయన తుంబురుని వీణకు కళావతి అని పేరు. నారదుడి వీణకు మహతి అని పేరు. వీరు ఇద్దరు దేవలోకంలో సంగీత విధ్వంసులుగా ప్రసిద్ధి పొందారు. ఇంద్రాది దేవతలు వీరి గానామృతంలో, వీణానందంలో మునిగితేలేవారు

Narada Tumburప్రతి ఋతువులో సూర్యునికి తోడుగా అతని రథములో ఇద్దరు ఆదిత్యులు, ఇద్దరు ఋషులు, ఇద్దరు గంధర్వులు, ఇద్దరు అప్సరసలు, ఇద్దరు రాక్షసులు, ఇద్దరు నాగులు ప్రయాణం చేస్తారు. మధు మాసము(చైత్రమాసం)లో ధాతా, హేతీ, వాసుకీ, రథకృత్, పులస్త్య, కృతస్థలీ అనేవారితో పాటుగా తుంబురుడు సూర్యరథంలో తిరుగుతారు. ఒకనాడు నారద తుంబురులు కలిసి వైకుంఠానికి వెళ్ళారు. తుంబురుడు గొప్ప గాయకుడు. తన గానామృతం తో విష్ణుమూర్తిని కీర్తించాడు. విష్ణుమూర్తి సంతోషించి తుంబురుని మంచి వస్త్రాభరణాలతో సత్కరించాడు. నారదుడికి విష్ణుమూర్తి మీద ఉన్న భక్తి వల్ల, తన స్వామి తనను కాకుండా తుంబురుని సత్కరించడం వల్ల నారదుడికి తుంబురుడిపై ఈర్ష్య కలిగింది.

Narada Tumbur“తుంబురుడే గొప్ప గాయకుడా? నేను కూడా అలా పాడటం నేర్చుకుని విష్ణుమూర్తి దగ్గర సత్కారం పొందుతాను.” అనుకున్నాడు. అలా నారదుడు కొన్నాళ్ళు సంగీతాన్ని అభ్యసించి విష్ణుమూర్తి దగ్గర గానం చేశాడు. కానీ ఆ గానం తుంబురునిలా శ్రీహరిని సంతృప్తి పరచలేకపోయింది. అయినా నారదుడు తన పట్టు విడువలేదు.

Narada Tumburఎలాగైనా తుంబురుని కన్నా బాగా పాడి విష్ణువును ప్రసన్నం చేసుకోవాలనుకున్నాడు. శివుడు అత్యుత్తమ గాయకుడు కాబట్టి ఆయన అనుగ్రహం సంపాదించి ఆయన దగ్గర సంగీతం నేర్చుకుని మళ్ళీ విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. అయితే ఈసారి కూడా శ్రీహరి ఆయన గానానికి సంతృప్తి చెందలేదు. అయినా సరే నారదుడు తన సాధన మానలేదు. ఎన్నో సంగీతపరికరాలు పాడైపోయాయి. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా విష్ణుమూర్తిని తన గానంతో ఆకట్టుకోలేక పోతున్నాడు.

Narada Tumburచివరికి తానిక విష్ణుభగవానుని సంతృప్తి పరచలేనని అర్థమై ఆఖరి అవకాశంగా తుంబురుల వారి దగ్గరకు వెళ్ళి తన్ను శిష్యుడిగా చేర్చుకోమన్నాడు. తుంబురుడు అందుకు సంతోషంగా అంగీకరించాడు. ఆయన వద్ద శిష్యరికంలో విష్ణువును ఆకట్టుకునేలా ఎలా పాడాలో నేర్చుకున్నాడు. అంతకు మించి నిస్వార్ధంతో, భక్తితో స్వామి మదిని గెలుచుకోవాలని అప్పటికి నారదుడికి అర్ధం అయింది.

Narada Tumburతర్వాత విష్ణువు దగ్గరికి వెళ్ళి అత్యంత భక్తి ప్రపత్తులతో ఆ నారాయణుని కీర్తించాడు. ఆ గానానికి ప్రీతి చెందిన విష్ణువు నారదుని కూడా తుంబురుని లాగే సన్మానించి “ఈ రోజు నీవు నన్ను తుంబురుని కంటే ఆనందింపజేశావు.” అంటూ మెచ్చుకున్నాడు. నారదుడు పరమానంద భరితుడయ్యాడు. కాబట్టి ఈర్ష్య పడితే ప్రయోజనం లేదు. మనకన్నా ప్రతిభావంతుల దగ్గర నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటేనే విజయం సిద్ధిస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR