ఏ రకమైన హనుమంతుని ప్రతిమ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలుసా?

మనకు భయం వేస్తే మొదటిగా మనం తలుచుకునేది వాయు పుత్రుడినే…బలవంతుడు, ధైర్యశాలి అయిన హనుమంతునికి రామాయణంలో విశేషమైన స్థానం ఉంది. రాముడికి అత్యంత ఆప్తుడైన ఆంజనేయుడు చిరంజీవిగా వర్ధిల్లిన సంగతి తెలిసిందే.
ఆంజనేయ స్వామి మంగళవారం లేదా శనివారం విశేష పూజలు అందుకుంటాడు.ఆంజనేయుడు సకల భయాలు, ఆందోళనలు, పారద్రోలి శక్తిని కలుగజేస్తాడు. తన భక్తితో సాక్షాత్తు ఆ పరందాముడినే తన గుండెల్లో బంధించి రాముడిపై తన భక్తిని చాటాడు.

3-Rahasyavaani-1094హనుమంతుడిని కొలిచేందుకు ఎన్నో విభిన్న రూపాలున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రూపాల్లో ఉన్న ఆంజనేయుడి ప్రతిమలను పూజించినట్లయితే అన్ని కష్టాలు తొలగడమే కాకుండా మానసిక ప్రశాంతత పొందుతారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయి.

ఆంజనేయుడికి సంబంధించిన ప్రతిమలు ఎన్నో ఉంటాయి. హనుమంతుడిని కొలిస్తే జనుల కష్టాలు ఇట్టే తొలిగిపోతాయి. మీ ఏదైనా ప్రతిజ్ఞను నెరవేర్చాలనకున్నా, ఇంట్లో సమస్యలు తొలిగిపోవాలనుకున్నా ప్రత్యేకమైన ప్రతిమను ఉంచాలి. ఉత్తరాభిముఖం అంటే దక్షిణం వైపున హనుమంతుడిని పూజించాలి.

2-Rahasyavaani-1094ఈ విధంగా చేయడం ద్వారా దేవతల ఆశీర్వాదాలు పొందుతారని ప్రతీతి. అదే విధంగా ఇంట్లో ఆనందంతో పాటు శ్రేయస్సు కూడా ఉంటుంది. మానసిక ఆందోళనలు కూడా తొలుగుతాయి.

ఉద్యోగం, వ్యాపారం లేదా వృత్తుల్లో ఏవైనా సమస్యలున్నట్లయితే మీరు తెలుపు రంగులో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని పూజించాలి. ఇది వృద్ధికి మార్గాలను తెరుస్తుంది. అంతేకాకుండా వ్యాపారాన్ని లాభాల బాట పరుగులెత్తిస్తుంది. ఇంట్లో ఇలాంటి ప్రతిమను పూజించినట్లయితే వారికి ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఇదే సమయంలో పని ప్రదేశంలో ఇబ్బందులున్నట్లయితే అవి తీరిపోతాయి.

6-Rahasyavaani-1094శ్రీరాముడిని సేవిస్తున్నట్లున్న హనుమంతుడి విగ్రహం ఇంట్లో ఉన్నట్లయితే దేనికీ కొరత ఉండదు. ఇంట్లో అందరూ సుఖ-సంతోషాలతో ఉంటారు.
ఎవరైనా వ్యక్తులు ప్రత్యేక కోరికల కోసం హనుమంతుడిని పూజించాలనుకుంటే అందుకు వివిధ రకాల ఆకారంలో పవన సుతుడి ప్రతిమను పూజించాలి. ఇలా చేయడం ద్వారా కోరికలు నెరవేరుతాయి. ఇందు కోసం ప్రార్థనాస్థలంలో పంచముఖ ఆకారంలో ఉన్న ఆంజనేయుడి ఫొటోను ఉంచి కొలిస్తే మంచిది. ఉదయం సాయంత్రం రెండు పూటల కోరిక నెరవేరాలని ప్రార్థించండి. ఈ విధంగా 41 మంగళవారాలు, శనివారాలు క్రమం తప్పకుండా చేసినట్లయితే మీ మనసులో అనుకున్నవన్నీ నెరవేరతాయి.

6-Rahasyavaani-1094ఇంటి సభ్యుల్లో ఎవరికైనా తోబుట్టువులు లేదా తల్లిదండ్రుల నుంచి ప్రేమ కొరవడితే సీతారాములను పవన సుతుడు సేవిస్తున్నట్లు ఉన్న ప్రతిమను పూజించాలి. ఈ ప్రతిమ పెట్టి పూజించినట్లయితే సకల దేవతల ఆశీర్వాదాలు పొందుతారు. అంతేకాకుండా ప్రేమ, స్నేహం లాంటి బంధాలు బలపడతాయి.

1-Rahasyavaani-1094కుటుంబ గౌరవం, పురోగతి కోసం సూర్యుడితో పాటు హనుమంతుడిని కూడా పూజించాలి. ఫలితంగా ఇంట్లో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. అంతేకాకుండా అన్ని పనులు, వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. అయితే మీరు ఏ ప్రతిమను పూజించినా క్రమం తప్పకుండా కొలవడాన్ని అలవర్చుకోండి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR