భీముని కోరిక మేరకు శివుడు వెలిసిన ఆలయం… ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటో తెలుసా!!!

శివుడు నిరాకారుడు అని హిందూ మతం చెబుతోంది. కానీ,ఆ నిరాకార రూపుడు భక్తుల పూజలు అందుకోవడానికి శివ లింగం రూపంలో ఆలయాల్లో కొలువై వున్నాడని బావిస్తారు. ఇలా శివుడు కొలువై ఉన్న ఆలయాలు మన భారతదేశంలో ఎన్నో మనకు దర్శనమిస్తున్నాయి. అయితే దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లిన ఎక్కువగా మనకు శివుడి ఆలయాలు కనిపిస్తుంటాయి.

ఎక్కువగా శివుడు లింగరూపంలోనే దర్శనమిస్తుంటాడు. శివుడు తన ఆత్మను లింగ రూపం నింపి మనదేశంలో 12 చోట్ల స్వయంగా వెలిసాడు అని పురాణాలు చెబుతున్నాయి.

templeఈ పన్నెండు లింగాలనే ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలుస్తారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటిగా ప్రాచుర్యం పొందిన భీమా నది పై వెలిసిన ఆలయ విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్ర, పూణే జిల్లాలో భీమా శంకర్ ఉంది. ఇక్కడే భీమనాది జన్మస్థలం అని చెబుతారు.

jyotirlingఒక గుంట లాంటి ఈ ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న గుట్టలాంటి ఒక తొట్టి నుంచి భీమా నది పుట్టిందని చెబుతుంటారు. పురాణాల కథనం ప్రకారం శివుడు తారకాసురుడిని సంహరించి సహ్యాద్రి పర్వతాలపై విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆ ప్రాంతం గుండా వచ్చిన భీమకుడు అనే రాజు స్వామిని చూసి భక్తితో నమస్కరించి, తాను వస్తున్న దారిలో ఇద్దరు మునులను గాయపరిచాను ఆ పాపపరిహారం ప్రసాదించమని శివుడిని ప్రార్దించాడట.

sahyadri hillsఅందుకు శివుడు సరే అని చెప్పాడు. అప్పటికే తారకాసురుని వధించి ఎంతో శ్రమించిన శివుడు చెమట ధారల ప్రవహిస్తుంది. భీముడు స్వామి వారి చెమట నుంచి వచ్చిన ప్రవాహంలో స్నానమాచరించి తనకు కలిగిన పాపం నుంచి విముక్తి పొందుతారు. అదేవిధంగా భీముని కోరిక మేరకు స్వామి వారు అదే ప్రాంతంలో కొలువై ఉన్నాడు.

riverఇలా ఆ ప్రవాహ ధార భీమాకుని పేరు మీదుగా భిమానదిగా మారింది. ఈ ఆలయంలో స్వామి వారు భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తూ ఉంటారు.

అంతేకాకుండా ఆలయంలో స్వామివారికి ఎదురుగా ఓ పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది.ఈ విధంగా స్వామివారి చమట చుక్కల నుంచి వెలసిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

nandi

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,580,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR