Home Unknown facts ఈ ఆలయం ప్రేమికులకు వరం లాంటిది…

ఈ ఆలయం ప్రేమికులకు వరం లాంటిది…

0
how did parvati devi married shiva

హిందువులు తరచు ఆలయాల దర్శనం చేసుకుంటూ ఉంటారు. తాము కోరిన కోర్కెలు నెరవేరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ ఉంటారు. కొంతమంది వివాహం జరగాలని, కొంతమంది సంతానం కోసం, మరి కొంత మంది ఉద్యోగం రావాలని ఇలా అనేక రకాల కోరికలు కోరుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో మన భారతదేశంలో ఎన్నో ప్రాచీన పురాతన క్షేత్రాలు ఉన్నాయి. ఒక్కో దేవాలయం ఒక విధమైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది.

మన దేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా పురాతన ఆలయాలు ప్రసిద్ధి చెంది ఉన్నాయని చెప్పవచ్చు. ఒక్క తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే దాదాపు 1500 పురాతన ఆలయాలు ఉన్నాయి.

సాధారణంగా ఎవరైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు వారి కోరికలను నెరవేర్చమని ఆ భగవంతుని వేడుకుంటారు. మరి కొందరు మానసిక ప్రశాంతత కోసం ఆ భగవంతుని సన్నిధికి వస్తుంటారు.

అయితే కుంభకోణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నతిరుశక్తిమట్టం అనే గ్రామంలో శక్తివనేశ్వర దేవాలయం ఉంది. శక్తివనేశ్వర దేవాలయంలో శివుడు పార్వతి కలిసి శివలింగాకారంలో చూడటానికి ఎంతో విచిత్రంగా ఉంటుంది.

సాధారణంగా ఏవైనా దేవాలయాలలో ప్రత్యేక పర్వదినాలలో లేదా జాతర సమయంలో భక్తులతో కిటకిటలాడుతుంటాయి. కానీ ఈ శక్తివనేశ్వర దేవాలయంలో మాత్రం ఎప్పుడు భక్తుల తాకిడి ఉంటుంది.

ఇంతకీ ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి అని అనుకుంటున్నారా? అన్ని దేవాలయాలలాగే ఈ ఆలయానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది.
ఎవరైనా ప్రేమించిన వ్యక్తులు తాను ప్రేమించిన వ్యక్తితోనే వివాహం జరగాలని కోరుకుంటారు. అలాంటి వారు ఈ ఆలయాన్ని దర్శిస్తే కచ్చితంగా తాను ప్రేమించిన వారితోనే పెళ్లి జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం.

అందుకోసం ఈ ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. పూర్వం పార్వతీదేవి శివుని చూసి అతని ఇష్ట పడుతుంది. ఎలాగైనా శివుని భర్తగా పొందాలనే ఆలోచనలతో ప్రతిరోజు గడిపేది.

అయితే ఈ స్థలంలో ఆ పరమశివుని కోసం ఘోర తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమె తపస్సుకు మెచ్చిన పరమశివుడు అగ్ని రూపంలో ఆమెకు దర్శనమిస్తాడు. శివుని అలా దర్శించిన పార్వతీదేవి ఏమాత్రం భయపడకుండా వెంటనే వెళ్లి శివుని కౌగిలించుకుంటుంది.

పార్వతి ప్రేమకు మెచ్చిన పరమశివుడు నిజరూపంలో ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటాడు.
ఇప్పటికీ ఈ ఆలయంలో పార్వతీదేవి శివుని కౌగిలించుకున్న రూపంలో కొలువై ఉంటారు. ఈ విధంగా ఆదిశక్తి అయిన పార్వతీదేవి తన ఇష్టపడిన శివుని పతిగా పొందింది. కాబట్టి ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులు భక్తి శ్రద్దలతో స్వామివారిని పూజిస్తే వారు ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడుతారని ప్రగాఢ నమ్మకం.

Exit mobile version