పిల్లల్లో ఈ విధమైన లక్షణాలు చూపిస్తున్న కరోనా మూడో వేవ్

ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసేసింది. కొన్ని సంవత్సరాల వరకు కోలుకోలేని విధంగా ఆర్థికస్థితిని దెబ్బతీసింది. కోవిడ్ బారిన పడిన పెద్దవారు దీర్ఘకాలంగా దాని వల్ల వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధపడుతూ ఉంటారు. కొన్ని నెలల వరకు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, అలసటతో పాటు మరికొన్ని లక్షణాలు ఇబ్బంది పెడుతుంటాయి.

The Third Wave Of COVID-19 Affect Kidsకరోనా మొదటి దశలో పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కానీ కరోనా వైరస్ ఇప్పుడు పిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదు. చిన్నారులకు కోవిడ్ సోకుతున్న కేసులు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాది పిల్లలు, టీనేజర్లు కరోనా బారిన పడిన దాఖలాలు చాలా తక్కువగా కనిపించాయి. కానీ ప్రస్తుతం చిన్నారుల్లో కూడా కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి

The Third Wave Of COVID-19 Affect Kidsముఖ్యంగా 18 సంవత్సరాల లోపు వారికి ఇన్ఫెక్షన్ సోకుతున్న కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఏడాది ప్రారంభంలో కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. దాంతో పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోవడం మొదలుపెట్టారు. యువత బయటకు వెళ్లడం, ఆఫీసులకు వెళ్లడం ప్రారంభించారు. ఇంతలోనే కరోనావైరస్‌లో కొత్త మ్యుటేషన్లు పుట్టుకొచ్చాయి.

The Third Wave Of COVID-19 Affect Kidsబహిరంగ ప్రదేశాల్లో రద్దీ పెరగడం, సామాజిక దూరం పాటించకపోవడం, వైరస్ కొత్త మ్యుటేషన్‌‌లకు వేగంగా సోకే లక్షణం ఉండటం.. కేసుల పెరుగుదలకు కొన్ని కారణాలుగా భావిస్తున్నారు. అయితే, కోవిడ్‌-19 పిల్లలను పెద్దగా ఇబ్బందేమీ పెట్టటం లేదు. కానీ కొందరిలో గుండె, రక్తనాళాలు, కళ్లు, చర్మం వంటి అవయవాలను ప్రభావితం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.

The Third Wave Of COVID-19 Affect Kidsదీన్నే మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌ అంటారని వైద్యులు చెబుతున్నారు. అయితే, కోవిడ్‌-19 అనర్థాలు దీంతోనే ఆగటం లేదు. ఇది పిల్లల్లో కాలేయవాపు సైతం తెచ్చిపెడుతున్నట్టు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల కరోనా వైరస్ బారినపడ్డ కొందరు పిల్లల్లో హెపటైటిస్‌ లక్షణాలు కనిపించాయని తమ నివేదికలో వివరించారు. కుటుంబంలో ఎవరికీ కాలేయ జబ్బులు లేకపోయినా ఈ విధమైన లక్షణాలు కనిపించడం ఆందోళనకు గురి చేస్తోంది. పైగా వీరిలో చాలామందిలో కోవిడ్‌ లక్షణాలేవీ లేకపోవటం గమనార్హం. కొందరు పిల్లలో మిస్సీ తరహా లక్షణాలు వెలుగుచూశాయి. మరో అధ్యయనంలో కరోనా వచ్చిన తర్వాత పిల్లల్లో దాదాపు ఆరు రోజులలోపే పూర్తిగా రికవరీ కనిపిస్తుంది.

The Third Wave Of COVID-19 Affect Kidsనాలుగు వారాల తర్వాత కూడా లక్షణాలు కనిపించే పిల్లలు చాలా అరుదు. బాధితుల్లో వీరు కేవలం 4.4 శాతం మంది మాత్రమే ఉన్నారు. చాలామంది దాదాపు నాలుగు వారాల సమయంలోపు తిరిగి మామూలుగా మారిపోయారు. నెలకు మించి లక్షణాలతో బాధపడిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. వారికి కూడా ఒకటి లేదా రెండు లక్షణాలు మాత్రమే అన్ని రోజులు కొనసాగడం విశేషం.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR