ఈ ఆలయంలో శనీశ్వరుడికి గరికను సమర్పించి పూజ చేయటం వల్ల వారి కోరికలు నెరవేరుతాయి!!!

భారతీయుల జ్యోతిషశాస్త్రం ప్రకారం ‘శనీశ్వరుడు’ ,నవగ్రహాలలో ఒక గ్రహం. సూర్యుడు, చంద్రుడు, ఛాయా గ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. గగన మండలంలో ఉన్నగ్రహాలకు భూమితో సంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమి మీద, భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవుల పైన, నిర్జీవ, ఝడ, నిర్లిప్త వస్తువుల మీద వుంటుంది.

shani godనవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ఇందుకు బిన్నం కాదు. శని, శనిగ్రహం, శనేశ్వరుడు, శనీశ్వరుడు, అని పలు నామాలతో పిలువబడి, గ్రహ రూపలో పూజింపబడే ‘శని’ ఒక గ్రహదేవుడు. కానీ సాధారణంగా మన హిందువులు శనీశ్వరుడి పేరు వినగానే కొంత ఆందోళన చెందుతారు.

garikaశని అంటే ఎన్నో కష్టాలు ఉంటాయని అందువల్ల చాలామంది స్వామి ఆలయానికి వెళ్ళడానికి కూడా వెనుకడుగు వేస్తుంటారు. అయితే శని ప్రభావం అందరి పై చూపదని ఎవరి కర్మలకు తగ్గ ఫలితాన్ని శని వారికి ఇస్తాడని, భక్తిశ్రద్ధలతో ఎవరైతే శనీశ్వరుని పూజిస్తారో వారిపై శని అనుగ్రహం కలిగి ఎటువంటి బాధలు లేకుండా కాపాడుతాడు అని చెప్పవచ్చు.

shani godఎంతో భయబ్రాంతులకు గురి చేసే ప్రసిద్ధి చెందిన శనీశ్వరాలయం ఎక్కడ ఉంది ఆలయ విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, తిరునల్లూరు అనే గ్రామంలో శనిగ్రహ దేవాలయం ఉంది. ఇక్కడ వెలసిన ఈ ఆలయం ఎంతో పురాతనమైన, ప్రసిద్ధి చెందిన ఆలయం.

పురాణాల ప్రకారం ఈ ఆలయం వెలసిన ప్రాంతంలోనే నలమహారాజుకు శని పట్టుకొని పీడించడం ప్రారంభమైందని చెబుతారు. ఈ క్రమంలోనే ఈ ఆలయంలో ఉన్న నల్ల తీర్థంలో స్నానమాచరించడం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని చెప్పవచ్చు.
ఈ ఆలయంలో వెలసిన శనీశ్వరునికి మరో పేరు దర్బరణ్యేశ్వరుడు.

shani godఈ ఆలయంలో వెలసిన స్వామి వారికి గరిక అంటే మహాప్రీతి కరం. ఏవైనా కోరికలు కోరేవారు స్వామివారికి గరికను సమర్పించి పూజ చేయటం వల్ల వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. స్వామివారికి గరిక అంటే ఇష్టం కాబట్టి స్వామివారిని దర్బాధిపతి అని కూడా పిలుస్తారు.

garikaఈ ఆలయంలోనే శనీశ్వరునితో పాటు,నలనారాయణ దేవాలయం అనే వైష్ణవ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి వెళ్ళిన భక్తులు శనీశ్వరుని తో పాటు నల్ల నారాయణ స్వామి వారిని పూజించడం వల్ల వారికి ఎటువంటి శని ప్రభావం శని దోషాలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి.

tirunalluru shanishwara alayamఈ ఆలయంలో వెలసిన శనీశ్వరునికి వాహనంగా ఉండే కాకి బంగారంతో తయారు చేయబడినది. ఈ క్రమంలోనే స్వామివారికి ఎంతో ప్రీతికరమైన శనివారం మరియు ఉత్సవాల సమయంలో స్వామివారి మూలవిరాట్ కి బంగారు తొడుగు వేసి ఉత్సవాలను నిర్వహిస్తారు.
ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ ఆలయంలో పెద్ద ఎత్తున శనిపీయేర్చి అనే ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాలలో భాగంగా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR