ఈ డ్రై ఫ్రూట్స్ ఇలా తింటేనే ఎక్కువగా ప్రయోజనాలు కలుగుతాయట!

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయి. అందుకే డైట్ పాటించేవారు కూడా డ్రై ఫ్రూట్స్ ని వారి ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే నట్స్, సీడ్స్ లో కొన్ని ఎంజైమ్‌ లు ఉంటాయి. ఈ ఎంజైమ్ లను పచ్చిగా జీర్ణం చేయడం కష్టం. అందువల్ల, వీటిని నానబెట్టడం వల్ల చక్కగా జీర్ణమవుతాయి. అంతేకాదు నానబెట్టడం వల్ల వాటిలోని పోషకవిలువలు తగ్గిపోవని, లక్షణాల్లో ఏమాత్రం తేడా రాదని తేలింది. వాటిని నానబెట్టి తింటే శక్తి మరింత పెరుగుతుంది. ఎక్కువగా అలసట అనిపిస్తే, క్రమం తప్పకుండా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి.

dry fruitsనానబెట్టిన బాదం పప్పులో అద్భుతమైన పోషకవిలువలున్నాయి. బరువు తగ్గడం నించీ రక్తపోటు అదుపులో ఉంచుకోడం వరకూ, గుండె ఆరోగ్యాన్ని కాపాడడం నించీ కాన్సర్ ముప్పుని తగ్గించడం వరకూ బాదం చేసే మేలు అంతా ఇంతా కాదు. దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోడం వల్ల ఎన్నో లాభాలను పొందచ్చు. బాదం పప్పులు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్ధం ఉంటుంది. అది మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. ఎప్పుడైతే బాదం పప్పులని నానబెట్టామో, అప్పుడు ఆ తొక్క ఊడిపోతుంది. కాబట్టి మనం తిన్న బాదం మనకి మేలు చేస్తుంది.

almondsనానబెట్టిన బాదం యాంటీ ఆక్సిడెంట్ల నిధిగా చెప్పొచ్చు. అది శరీరానికి బలాన్ని ఇవ్వడంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బాదంలో విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. నానబెట్టిన బాదం లో ఉండే విటమిన్ 17 కాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. నానబెట్టిన బాదం లో ఉన్న ఫ్లేవనాయిడ్స్ ట్యూమర్ ని పెరగనివ్వవు.

cancerఅంజీర్ వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే నానబెట్టిన అంజీర్ ని తినడం వల్ల మంచి ఫలితాలు కనబడతాయని ఎన్నో సమస్యలకు ఇది పరిష్కారం చూపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. అంజీర్‌ డ్రై ఫ్రూట్‌ లలో జింక్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి బలాన్ని ఇస్తాయి. నానబెడితే వాటి ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. శరీరంలోని హిమోగ్లోబిన్ లోపాన్ని ఈ పండ్లు త్వరగా తీరుస్తాయి. ఎముకలు, గుండెకు సైతం ప్రయోజనకరం.

anjeerఇక వాల్‌నట్స్‌లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఈ, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. వాల్‌నట్‌లను బ్రెయిన్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది కాకుండా వాల్నట్‌లో కాల్షియం, పొటాషియం, ఐరన్, జింక్ అధిక మొత్తంలో ఉంటాయి. రోజూ నానబెట్టిన వాల్‌నట్ తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

walnutరోజూ నానబెట్టిన వాల్‌నట్స్ తినడం వల్ల టైప్ -2 డయాబెటిస్‌ను కంట్రోల్‌లోకి తీసుకురావచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. వాల్‌నట్స్‌లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చక్కర స్థాయిని తగ్గించడమే కాకుండా శరీరం నుంచి బ్లడ్ షుగర్‌ను విడుదల చేస్తుంది. నానబెట్టిన వాల్‌నట్స్ గ్లైసెమిక్ సూచిక కేవలం 15 మాత్రమే. తద్వారా దీనిని మధుమేహ వ్యాధిగ్రస్తులు మధ్యాహ్న వేళ ఆరోగ్యకరమైన స్నాక్‌గా తీసుకోవచ్చు. నానబెట్టిన వాల్ నట్స్ శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. శారీరక అలసటను తొలగిస్తుంది.

tirednessఖర్జూరాలు శరీరానికి బలాన్ని ఇస్తాయి, చాలా శక్తిని ఇస్తాయి. ఖర్జూరాలలో కాల్షియం చాలా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను దృఢంగా చేయడానికి సహాయపడుతుంది. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఖర్జురాలను పాలలో నానబెట్టి తింటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR