ముల్లంగి వ‌ల్ల కలిగే అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు ఏంటో తెలుసా ?

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక కూర‌గాయల్లో ముల్లంగి కూడా ఒక‌టి. ఘాటైన వాస‌న‌, రుచిని క‌లిగి ఉంటుంది కాబట్టి ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ నిజానికి ముల్లంగి వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఈ ముల్లంగి ఆకులను, దుంపలను ఎండబెట్టుకుని మెత్తగా దంచుకోని ఆ మిశ్రమాన్ని తేనెలో కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే శరీరంలోని వాపులు, నొప్పులు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

health benefits of radishముల్లంగి అనేది ఓ కూరగాయ మాత్రమే కాదు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముల్లంగిని ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగిస్తుంటారు. ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ సీ సెల్స్ ని డ్యామేజ్ నుండి కాపాడుతుంది.

విటమిన్లు, పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉండే ముల్లంగి ఆకుల్ని నీటిలో ఉడకబెట్టి అందులో నాలుగైదు నిమ్మరసం చుక్కలు వేసి తాగితే మూత్ర సంబంధ మంట తగ్గుతుంది. పెద్దవాళ్లు చాలా మందికి అర్ష మొలలు, ఉబ్బసం, దగ్గు, ఆస్తమా, ముక్కు, చెవి, గొంతు నొప్పులతో బాధపడుతుంటారు. వాళ్లు ముల్లంగి తింటే ఎంతో మేలు.

health benefits of radishఇండియాలో ముల్లంగిని సలాడ్స్ లో తింటారు, ముల్లంగి పరాథా చేస్తారు, ముల్లంగి సాంబారు, చట్నీ కూడా చేసుకుంటారు. అయితే వీటితో పాటూ ముల్లంగితో జ్యూస్ కూడా చేస్తారని మీకు తెలుసా? ముల్లంగిలో ఉన్న ముఖ్యమైన పోషకాలు అలాగే తీసుకోవాలనుకుంటే జ్యూస్ తీసి తాగడమే మంచి ఉపాయం. జ్యూస్ తీయడం వల్ల ఈ పోషకాలన్నింటినీ శరీరం తేలికగా స్వీకరించగలుగుతుంది కూడా.

ముల్లంగిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేసే కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయి. బాడీలో ఎడిపోనెక్టిన్ ప్రొడక్షన్‌ని ఈ జ్యూస్ పెంచుతుంది. ఈ హార్మోన్ హై లెవెల్స్ లో ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుండి ప్రొటెక్షన్ ఉంటుంది.

health benefits of radishర్యాడిష్ జ్యూస్ లో ఉండే ఎంజైంస్ బాడీలో ఎలాంటి ఫంగల్ ఓవర్ గ్రోత్ నైనా నశింపచేయగలవు. అలాగే ఈ జ్యూస్ శరీరంలోని హానికారకాలని బయటకి పంపేస్తుంది. అలాగే, వైరస్ లనీ, ప్యారసైట్స్ నీ కూడా బాడీలో నుండి బయటకు పంపుతుంది.

ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. కాల్షియం, పొటాషియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి హైబీపీ ని తగ్గించడంలో హెల్ప్ చేసి హార్ట్ డిసీజ్ యొక్క రిస్క్ ని రెడ్యూస్ చేస్తాయి. అలాగే, రక్త ప్రసరణకి ఉపయోగపడే నాచురల్ నైట్రేట్స్ ర్యాడిష్ లో ఉంటాయి.

health benefits of radishజ్వరం తగ్గించడం లో బాగా పని చేసే నాచురల్ రెమెడీస్ లో ర్యాడిష్ జ్యూస్ తాగడం కూడా ఒకటి. ఇది బాడీ టెంపరేచర్ ని తగ్గించి ఫీవర్ వల్ల వచ్చే ఇన్‌ఫ్లమేషన్ ని ఎలీవియేట్ చేస్తుంది.

health benefits of radishఇన్ని బెనిఫిట్స్ ఉన్న ర్యాడిష్ జ్యూస్ ని ఎలా చేయాలో తెలుసుకుందాం

1 ముల్లంగి దుంపల ముక్కలు తీసుకోని జ్యూసర్ లో వేసి బ్లెండ్ చేయాలి.

2. జ్యూస్ ఫార్మ్ లోకి వచ్చాక ఆ జ్యూస్ ని వడకట్టి కావాలనుకుంటే కాసేపు ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు.

3. కాస్త రుచిగా రాగాలనుకునేవారు చిటికెడు రాళ్ళ ఉప్పు కలిపి తాగొచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR