ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా! అయితే మీ కంటి చూపులో సమస్య ఉన్నట్లే

0
247

ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల దగ్గరి నుండి ముసలివాళ్లు వరకు అందరూ కళ్లజోడుతో కుస్తీ పట్టే వాళ్ళే. ఒకప్పుడు ఏళ్ల ముసలివాళ్ళు కూడా సూదిలో దారం ఎక్కించేవాళ్ళు. కానీ ఇప్పటి పిల్లలు చదివేటప్పుడు పుస్తకాల్లో లైన్స్ కూడా మిస్ చేస్తున్నారు. ఇంకా అక్షరాలు రాయడం కూడా సరిగా రాని పిల్లలకు అద్దాలు వచ్చేస్తున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.

Eye Problemsవిటమిన్ ఏ లోపం అందులో ప్రధానమైన కారణం. దానికి తోడు ల్యాప్‌టాప్స్ మీద గంటల తరబడి వర్క్ చేయడం, మొబైల్ ఫోన్స్ స్క్రీన్స్ చూస్తూ ఉండడం, మిగతా టైమ్ లో టీవీ చూడడం, ప్రస్తుతం ఇదే మన జీవిత విధానం. ఒక స్క్రీన్ కాకపోతే ఒక స్క్రీన్ వైపు మనం రోజంతా చూస్తూనే ఉంటున్నామని కాదనలేని నిజం. ఈరోజుల్లో అందరికి బ్రెయిన్ కంటే కూడా కళ్ళతో వర్క్ ఎక్కువైపోయింది.

eye problemsమనం కూడా రోజులో చాలాసేపు ఏదో ఒక స్క్రీన్ ని చూస్తూనే సమయం గడుపుతాం మరి మనలో ఎంతమందికి ఈ సమస్య ఉందొ తెలుసుకోవాలంటే ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. మసకగా కనిపించడం, డ్రై ఐస్, కన్ను నీరు కారడం, తలనొప్పి, డబుల్ విజన్, కళ్ళు అలిసిపోయినట్లు అనిపించడం, వెలుతురు చూడలేకపోవడం, మెడ, భుజాలు, వీపు నొప్పి గా ఉండడం, వంటివన్నీ విజన్ ప్రాబ్లంస్ యొక్క లక్షణాలు. కళ్ళ ముందు మెరిసినట్లు ఉండడం, బ్రైట్ స్పాట్స్ కళ్ళ ముందు ఫ్లోట్ అవుతున్నట్లుగా కూడా అనిపించవచ్చు.

Vtamin Aఅయితే ఇలా కంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా వచ్చిన సమస్య తీవ్రం కాకుండా ఉండాలన్నా కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. స్క్రీన్ టైమ్ ని వీలున్నంత రెడ్యూస్ చేసుకోవడం తో పాటూ విటమిన్ ఏ పుష్కలం గా ఉన్న పదార్ధాలు తీసుకుంటే ఈ సమస్య నుండి కొంత వరకూ తప్పించుకోవచ్చు. కంటి ఆరోగ్యానికి విటమిన్ ఏ చాలా మేలు చేస్తుందని అంటారు.

విటమిన్ ఏ ఎక్కువగా లభించేవి : 

Vitamin Aపండ్లు: బొప్పాయి, ఆప్రికాట్, పీచ్,

కూరగాయాలు: పాలకూర, మెంతికూర, క్యారెట్స్, ఎర్ర క్యాప్సికం

డైరీ ప్రోడక్ట్స్: చీజ్, పాలు

SHARE