These Heartful Lyrical Quotes Of Athreya Proves Why He Is Called ‘Manasu Kavi’

0
617

మనసుకవిగా పిలుచుకునే ఆత్రేయ గారు దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసారు. ఆత్రేయ గారు తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టువిప్పుతాయి. సెంటిమెంటల్ డైలాగ్స్ రాయడంలో ఆత్రేయ గారిది అందెవేసిన చెయ్యి.
తెలుగు సినిమా పాటలను మామూలు వాడుక మాటలతోనే రాయగలిగిన ఘనాపాటీ ఆత్రేయ. మన మనసు కవి ఆత్రేయ గారు మన మనసులకి హత్తుకొనే అద్భుతమైన పాటలు ఎన్నో రాసారు, ఆలా రాసిన పాటలలోని కొన్ని లిరిక్స్ మీ కోసం….

1) సినిమా: ప్రేమ
పాట: ప్రియతమా… నా హృదయమా

శిలలాంటి నాకు జీవాన్ని పోసి .. కలలాంటి బ్రతుకు కళతోటి నింపి
వలపన్న తీపి తొలిసారి చూపి .. ఎదలోని సెగలు అడుగంట మాపి
నులివెచ్చనైన ఓదార్పు నీవై .. శృతిలయ లాగ జతచేరినావు
నువు లేని నన్ను ఊహించలేనూ .. నావేదనంతా నివేదించలేను
అమరం అఖిలం మన ప్రేమా !

2) సినిమా: ప్రేమ
పాట: ప్రియతమా…. నా హృదయమా

నీ పెదవి పైనా వెలుగారనీకు .. నీ కనులలోన తడి చేరనీకు
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు .. అది వెల్లువల్లే నను ముంచనీకు
ఏ కారుమబ్బు ఎటు కమ్ముకున్నా .. మహా సాగరాలే నిను మింగుతున్నా
ఈ జన్మలోనా ఎడబాటు లేదు..పది జన్మలైన ముడే వీడిపోదు
అమరం అఖిలం మన ప్రేమా !

3) సినిమా: అభినందన
పాట: ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

ప్రేమించుటేనా నా దోషము
పూజించుటేనా నా పాపము
ఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లు కన్నీరుగ ఈ కరిగే కళ్ళు
నాలోని నీ రూపము నా జీవనాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణము
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

4) సినిమా: అభినందన
పాట: ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

నేనోర్వలేను ఈ తేజము
ఆర్పేయరాదా ఈ దీపము
ఆ చీకటిలో కలిసే పోయి
నా రేపటిని మరిచే పోయి
మానాలి నీ ధ్యానము
కావాలి నే శూన్యము
అపుడాగాలి ఈ మూగ గానం

5) సినిమా: అభినందన
పాట: ప్రేమ లేదని ప్రేమించరాదని

మనసు మాసిపోతే మనిషే కాదని
కఠికరాయికైనా కన్నీరుందని
వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని
గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని
ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరీ
ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరి
మోడువారి నీడ తోడు లేకుంటినీ

6) సినిమా: అభినందన
పాట: ప్రేమ లేదని ప్రేమించరాదని

గురుతు చెరిపివేసి జీవించాలని
చెరపలేకపోతే మరణించాలని
తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని
గుండె పగులుపోవు వరకు నన్ను పాడని
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదించనీ

7) సినిమా: అభినందన
పాట: ఎదుట నీవే ఎదలోన నీవే

మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం
గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు
కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు
పిచ్చివాణ్ణీ కానీదు

8) సినిమా: అభినందన
పాట: ఎదుట నీవే ఎదలోన నీవే

కలలకు భయపడిపోయాను నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా
స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నమయ్యేదుందా
ప్రేమకింత బలముందా

9) సినిమా: మరో చరిత్ర
పాట: విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేనని

అనురాగమే నిజమని
మనసొకటి దాని రుజువని
తుది జయము ప్రేమదేయని
బలి అయినవి బ్రతుకులెన్నో

10) సినిమా: మరో చరిత్ర
పాట: విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేనని

వలచి గెలిచి కలలు పండిన
జంట లేదే ఇలలో
కులమో మతమో ధనమో బలమో
గొంతు కోసెను తుదిలో

11) సినిమా: ప్రేమ్ నగర్
పాట: మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే

అంతా మట్టేనని తెలుసు
అదీ ఒక మాయేనని తెలుసు
తెలిసి వలచి
విలపించుటలో
తియ్యదనం ఎవరికి తెలుసు
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే

12) సినిమా: డాక్టర్ చక్రవర్తి
పాట: నీవు లేక వీణా పలుకలేనన్నదీ, నీవు రాక రాధా నిలువలేనన్నది

జాజి పూలు నీకై రోజు రోజు పూచె
చూసి చూసి పాపం సొమ్మసిల్లి పోయె
చందమామ నీకై తొంగి తొంగి చూసి
సరసను లేవని అలుకలుబోయె

13) సినిమా: మూగ మనసులు
పాట: ముద్దబంతి పూవులో _ మూగకళ్ళ ఊసులో

పూలదండలో దారం దాగుందని తెలుసును
పాలగుండెలో ఏదీ దాగుందో తెలుసునా
నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా

14) సినిమా: ఆకలి రాజ్యం
పాట: సాపాటు ఎటు లేదు బ్రదర్

మన తల్లి అన్నపూర్ణ .మన అన్న దాన కర్ణ .మన భూమి వేద భూమిరా. తమ్ముడూ.
మన కీర్తి మంచు కొండరా.ఆ ఆ!!
మన తల్లి అన్నపూర్ణ .మన అన్న దాన కర్ణ .మన భూమి వేద భూమిరా. తమ్ముడూ.
మన కీర్తి మంచు కొండరా.ఆ ఓ ఓ!!
డిగ్రీలు తెచ్చుకుని, చిప్ప చేత పుచ్చుకుని
ఢిల్లీకి చేరినాము.దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే భావిపౌరులం బ్రదర్.

15) సినిమా: ఆకలి రాజ్యం
పాట: సాపాటు ఎటు లేదు బ్రదర్

బంగారు పంట మనది.మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుతామురా. ఇంట్లో. ఈగల్ని తోలుతామురా!!
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా??
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా??
ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా.ఆ ఆ.
ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా??
గంగలో మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్.

SHARE