వివాహ సమయంలో ఈ పొరపాట్లు జాగరకుండా చూసుకోవాలి ఎందుకో తెలుసా ?

హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైంది. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్లి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా విభేదాలు తలెత్తినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది. ఇక హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహానంతరం స్త్రీ పురుషులకు అనేక సాంప్రదాయక విధులు నిర్వహించే అర్హత కలుగుతుంది.

These Mistakes Should Be Avoided During The Wedding?ఏడడుగుల బంధం ఎంత పవిత్రమైనదో మన సనాతన ధర్మాలు, ఋషులు మనకు తెలియజేసారు. ఆధునికత అనే పేరుతో పరదేశపు విష సంస్కృతీ మోజులో పడి అగోచర గమ్యంలో కొట్టు మిట్టాడుతూ మన శాస్త్ర విలువలను మరచి అదోగతి పాలై తను సుఖంగా ఉండలేక, తలిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ప్రశాంతత లేని జీవనం సాగించడానికి గల కారణాలు వివాహ సమయంలో చేసే కొన్ని పొరపాట్లు. ఏడడుగుల బంధానికి ఏడు సూత్రాలు తెలియజేయడం జరుగుతుంది ఆ ఏడు సూత్రాల్లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి.

These Mistakes Should Be Avoided During The Wedding?మొదటిది మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం..

ఫలితం:- దీనివల్ల వచ్చే నష్టం మనోవైకల్యం, చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం, మంచి సంతానం పొందకపోవటం.

These Mistakes Should Be Avoided During The Wedding?జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో ఒకరు చూపులు నిలపకపోవటం.

ఫలితం:- దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం. వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం, ఫోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి.

These Mistakes Should Be Avoided During The Wedding?ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం.

ఫలితం:- దీనివల్ల కలిగే నష్టం సంస్కారం లోపించటం.

తలంబ్రాలకు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం.

ఫలితం:- దీనివల్ల బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బందులు.

These Mistakes Should Be Avoided During The Wedding?బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి రావటం వధూవరులని ఆశీర్వదించటం.

ఫలితం:- దీనివల్ల మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొవటం.

బఫే భోజనాలు.

ఫలితం:- దీని వల్ల అన్నదాన ఫలితం పొందక పోవటం.

వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం.

ఫలితం:- దీనివల్ల దైవ కటాక్షం దూరమవ్వటం.

These Mistakes Should Be Avoided During The Wedding?ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి. అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి. శాస్త్రీయమైన ఒక మంచి విషయం అందరికి తెలియజేయండి, చెప్పకపోతే తప్పు మనది అవుతుంది, చెప్పినా వారు పాటించక పోతే వాల్ల కర్మ. ఇవన్ని శాస్త్రంలో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,690,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR