లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే చేయవలసినవి, చేయకూడనివి ఏంటో తెలుసా ?

0
3334

ఇంట్లోని ప్రతికూల శక్తులను పారద్రోలి లక్ష్మీ కటాక్షం పొందాలంటే కొన్ని నియమనిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వాటిని శ్రద్ధగా పాటిస్తే లక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. మరి లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే చేయవలసినవి ఏంటి, చేయకూడనివి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Lakshmi Deviఉదయం నిద్రలేవగానే రెండు అరచేతులు చూసి నాలుగైదు సార్లు ముఖంపై తిప్పడం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఇంట్లో డబ్బు భద్రపరిచే చోట కొన్ని అక్షితలు, నాలుగు లక్ష్మీ గవ్వలు, నాలుగు సురిడి కాయలు, నాలుగు చిన్న ఆకుపచ్చ గాజులు.. శ్రీ సూక్తం చదివి పెట్టడం చేస్తే శుభ ఫలితాలుంటాయి.

Lakshmi Devi చేతిలో డబ్బు నిలవట్లేదంటే.. వచ్చిన లాభంలో పదిశాతం దాన ధర్మాలకు కేటాయించండి. అవసరానికి మించి డబ్బు రానప్పుడు కుల దైవానికి మొక్కులు చెల్లించండి. వీలైనంత వరకు చిన్న పిల్లలకు స్వీట్లు, చాక్లెట్లు పంచండి. ఉదయం నిద్రలేవగానే పసుపు, ఆకుపచ్చ రంగును కలిగిన ఏదైనా వస్తువును చూస్తే ఐశ్వర్యం చేకూరుతుంది.

Lakshmi Devi రాజయోగం, అష్టైశ్వర్యాలు లభించాలంటే.. ప్రతి శనివారం ఇంట్లో వున్న పగిలిన, విరిగిన వస్తువులను పారేయాలి. శనివారం పూట బూజు దులపడం చేస్తే.. ఇంట్లోని ప్రతికూల శక్తి పారిపోతుంది. ధనప్రాప్తి కోసం ఏదైనా అమ్మవారి ఉపాసన చేస్తూ.. అమ్మవారి దగ్గర శుక్రవారం ఒక లవంగాన్ని ఉంచండి.

గృహిణీలు ఎప్పుడూ కంట తడి పెట్టకూడదు. ప్రతిరోజూ పూజలో శ్రీ సూక్తం తప్పకుండా చదవాలి. శుక్రవారం, శనివారం పూజల్లో శ్రీసూక్తం తప్పనిసరి. పూజగదిలో తప్పని సరి ఏకాక్షి కొబ్బరికాయను ఉంచడం ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది.

Lakshmi Devi ముత్తైదువులు ఎరుపు లేదా ఆకు పచ్చ గాజులు ధరించడం చేయాలి. ఇలా చేస్తే అంతా మంచే జరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

జేబులో రెండు లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, సురిడి కాయలు వుంచడం ద్వారా ధనాదాయానికి లోటుండదు. వాడే పర్సులు ఎరుపు రంగులో వుంటే మంచిది.