Home Health సిజేరియన్ తరువాత త్వరగా కోలుకోవాలి అంటే ఈ జాగ్రత్తలు తప్పన సరి ?

సిజేరియన్ తరువాత త్వరగా కోలుకోవాలి అంటే ఈ జాగ్రత్తలు తప్పన సరి ?

0

ప్రస్తుత రోజుల్లో నార్మల్ డెలివరీల కంటే సిజేరియన్లే ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సమయంలో వైద్యులు కొన్ని జాగ్రత్తలు చెబుతారు అవి తప్పక పాటించాలి. వాటితో పాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వెంటనే రికవరీ అవుతారు. సాధారణంగా సిజేరియన్ జరిగితే కోలుకోవడానికి ఆరు వారాలు పడుతుంది.

precautions after a cesareanకానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే తొందరగా కోలుకుంటారు. అతిగా నీటిలో తడవకూడదు, చల్లనీరు ముట్టుకోవద్దు, చెవులలోకి గాలి వెళ్లకుండా చూసుకోవాలి, అలాగే మసాలా దినుసులు ఆహరం తినవద్దు. ఆపరేషన్ చేసిన చోట తడిగా ఉంచవద్దు పొడిగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆపరేషన్ చేసిన మూడో వారం నుంచి ఆ నొప్పి కాస్త తగ్గుముఖం పడుతుంది. డాక్టర్ చెప్పిన తర్వాత నడక మొదలు పెట్టండి. ఇది రికవరీకి చాలా మంచిది.

ఇన్పెక్షన్ సోకినట్లు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి, వేడి, జ్వరం ఉన్నా అశ్రద్ద చేయవద్దు. బిడ్డ పడుకున్న సమయంలో మీరు పడుకుంటే మంచిది. రాత్రి నిద్రలేకపోవడం వల్ల మరింత నీరసం ఉంటుంది. వీటితో పాటు పాలిచ్చే తల్లులకు పాల ఉత్పత్తికి అవసరమైన అదనపు శక్తి కలిగిన ఆహారం అవసరం ఉంటుంది.

సులభంగా జీర్ణమయ్యే, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే రైస్, అటుకులు , సేమ్యా మరియు బంగాళాదుంపలు చాలా అవసరం. కొంత కాలం తరువాత ఓట్స్, రాగి, గోధుమ నూక, సజ్జలు మొదలైన తృణధాన్యాలను కూడా తీసుకోవచ్చు. ఇవి ఫైబర్ తో పాటు క్యాల్షియం, ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్లు వంటి అదనపు పోషకాలను కలిగి ఉంటాయి.

 

Exit mobile version