Home Health బ్రెడ్ తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తప్పవు

బ్రెడ్ తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తప్పవు

0

ఇది వ‌ర‌కు ఏదో జ్వ‌రం వ‌చ్చిన‌పుడు పాలు, బ్రేడ్ తినిపించేవాళ్ళు కానీ ఇప్పుడు చాలా ఇళ్ల‌లో బ్రేడ్ టిఫిన్ ప్లేస్‌ని భ‌ర్తీ చేస్తోంది. కొంతమంది బ్రెడ్‌ని ఎన్నిరకాలుగానైనా చేసుకుని తినదానికి సంతోషపడతారు. వాస్తవానికి త్వరగా తయారయ్యే రెసిపీస్‌లో బ్రెడ్ వంటకాలు ముందుంటాయి. అందుకే క్షణం తీరిక లేని మహిళలు ఉదయాన్నే దీంతో బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. స్కూల్‌కి వెళ్లేటప్పుడు టిఫిన్ వద్దంటూ మారాం చేసే పిల్లలకు రెండు బ్రెడ్ ముక్కలు పాలల్లో వేసి ఇచ్చేస్తున్నారు. లేదంటే బ్రెడ్ ఆమ్లెట్. చాలామంది ఉద‌యాన్నే బ్రెడ్, జామ్‌తో ఉపాహారం అయింద‌నిపిస్తున్నారు. ఇంట్లో పెద్ద వాళ్లు ఉంటే వాళ్లుకూడా ఉదయాన్నే తాగే టీలోనో, పాలల్లోనో బ్రేడ్ వేసుకుని తింటూ ఉంటారు.

problems are not to blame for bread intakeఅయితే ఎప్పుడో ఒక‌సారి ఇలా చేస్తే ఫ‌ర‌వాలేదు కానీ, అదేప‌నిగా బ్రెడ్‌ని తిన‌డం అంత‌మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వల్ల అసిడిటీ సమస్యలు రావడమే కాకుండా.. డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని చెబుతున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. బ్రెడ్‌లో గ్లూటెన్ అనే ఆమ్లం ఉంటుంది. ఇది మెదడు‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. కాబట్టి ఉదయాన్నే బ్రెడ్ తీసుకోవడం వల్ల మెదడు పనితీరు తగ్గుతుందని.. ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు.

కొన్ని సందర్భాల్లో తప్పని సరి తీసుకోవాలంటే మాత్రం.. బ్రెడ్ తిన్న వెంటనే ఏదైనా పండు తీసుకుంటే సరిపోతుంది అని అంటున్నారు. అయితే.. అది కూడా రెగ్యులర్ గా తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు. వైట్ బ్రేడ్ తీసుకోవడం కంటే కూడా గోధుమ బ్రెడ్‌ తీసుకుంటే ఎక్కువ మొత్తంలో కాకపోయినా కొన్ని పోషకాలను అందిస్తుంది. తృణ‌ధాన్యాల‌తో త‌యారుచేసిన బ్రెడ్ మ‌రికాస్త బెట‌ర్‌. బ్రెడ్‌లో అధిక రక్తపోటుకు కారణమయ్యే సోడియం లెవల్స్ ఎక్కువ స్థాయిలో ఉంటాయి. దీంట్లో ఉప్పు ఎక్కువగా ఉండడం వలన బ్రెడ్‌ని వివిధ రూపాల్లో తీసుకుంటే గుండెకు సంబంధించిన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. బ్రెడ్ సంబంధిత పదార్థాలైన కేకులు, బర్గర్లు వంటివి తీసుకుంటే కూడా చక్కెర స్థాయిలు అధికంగా ఉండి బరువు పెరగడానికి కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బ్రెడ్ చేయడానికి కావాల్సిన పిండిని త‌యారుచేసుకునే ప్రాసెస్‌లో వినియోగించే ర‌సాయ‌నాలు, జ‌న్యుప‌రంగా రూపాంత‌రం చెందించిన సోయా లెసిథిన్, కార్న్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, సోయాపిండి లాంటివి, కృత్రిమ‌మైన ఫ్లేవ‌ర్లు, నిల‌వ ఉంచే ర‌సాయ‌నాలు, మితిమీరిన చెక్కెర ఇవ‌న్నీ బ్రెడ్ ‌లో ఉంటాయి. ఇవ‌న్నీ మ‌న ఆరోగ్యానికి మేలు చేసేవి కావు. క‌నుక బ్రెడ్‌ని ఎంత త‌క్కువ తింటే అంత మంచిది.

Exit mobile version