మారేడు దళం కోసేటప్పుడు ఈ నియమాలు తప్పక పాటించాలి

హిందువులకు మారేడు వృక్షం చాలా పవిత్రమైనది. దీని గురించి వేదకాలంనాటి నుంచీ తెలుసు. దేవాలయాలలో ఇది ప్రముఖంగా కన్పిస్తుంది. శివునికి ఇదంటే బహుప్రీతి. మారేడు దళాలు లేకుండా శివార్చన లేదు. మారేడు అకులు మూడు కలిపి శివుని మూడు కళ్ళలా ఉంటాయి. అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం! త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!! అని తలుస్తాము.

Indian baelఅంతేకాదు శివుడు ఈ మారేడు చెట్టు క్రింద నివాసం ఉంటాడని ప్రతీతి. మారేడు చెట్టుకు ఓ గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. పుష్పాలతో పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళంతో పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. మారేడు ఆయుర్వేదంలో ప్రధానంగా ఉపయోగ పడుతుంది. పూర్వం మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు.

Indian baelమనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళం ఒకటి. మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె శివలింగానికి తగలడం ఐశ్వర్యప్రదం అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం వంటి ఇబ్బందులు ఉంటే మూడు ఆకులు ఉన్న దళాలతో శివునికి పూజ చేసేవారు. అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది. ‘మా-రేడు’ తెలుగులో రాజు ప్రకృతి, రేడు వికృతి. మారేడు అంటే మా రాజు. అయితే అంత పవిత్రమైన మారేడు చెట్టుని ఇంట్లో పెంచుకోవచ్చా అనే అనుమానం చాలామందిలో ఉంది.

బిల్వ వృక్షంనిజానికి ఎలాంటి సందేహం లేకుండా బిల్వవృక్షం ఇంట్లో పెంచుకోవచ్చు. తగిన స్థలం ఉండి, చక్కగా వృద్ధిపొందే అవకాశం ఉన్నప్పుడు బిల్వాన్ని వేయవచ్చు. ఈశాన్య, తూర్పు, ఉత్తర దిశలలో బిల్వవృక్షాన్ని వేయవచ్చు. అయితే బుధ, శని వారాల్లో మారేడు దళాలు కోయాలి. చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ, చతుర్ధి, అష్టమి తిథుల్లో కూడా బిల్వాలను కోయకూడదు. సోమవారము, మంగళ వారము, ఆరుద్రానక్షత్రము, సంధ్యాసమయము, రాత్రి వేళలందు, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు. అందుకే ఈ దళాలను ముందు రోజు కోసి, భద్రపరచిన దళాలతో పరమశివుని పూజిస్తారు. నిన్న పూజించిన బిల్వాన్ని కడిగి ఇవాళ మళ్ళీ పూజించవచ్చు. అలా ముప్పది రోజుల వరకు పూజించవచ్చు. వాటికి ముందే కోసి దాచి వాడుకోవాలి.

బిల్వ వృక్షంమారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా అపారమయిన సిద్ధి కలుగుతుంది. యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టుకింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటిమందికి భోజనం పెట్టినంత ఫలితం వస్తుందని శాస్త్రోక్తి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR