అన్నదానం చేసేటప్పుడు ఈ నియమాలు తప్పక తెలుసుకోవాలి!

అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే మాట చాలాసార్లు వినే ఉంటారు. అంటే అన్నం భగవంతుడితో సమానం అని. అయితే మనలో చాలా మందికి అన్నము అంటే అసలైన అర్థం తెలియదు . బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్ధాన్నే అన్నము అంటారని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ప్రతి మనిషికి పంచ కోశములు అని అయిదు కోశములు ఉంటాయి.
  • అవి అన్నమయ , ప్రాణమయ , మనోమయ , విజ్ఞానమయ , ఆనందమయ కోశములు . అన్నమయ కోశము స్థూల శరీరానికి సంబందించినది. ఈ అన్నమయ కోశములో ప్రవేశించే అన్నము ప్రాణ శక్తిగా మారుతున్నది. కనుక అన్నమయ కోశాములోనికి వెళ్ళే ఆహారమే అన్నము అని అర్ధం. అన్నమే అన్నకోశములో ప్రవేశించి ప్రాణంగా మారుతున్నందువలన అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడమే.
  • అంతే కాదు ఒక ప్రాణం నిలవడానికి కావలసినవన్ని అన్నమే. కనుక అన్నదానం చేయడం శ్రేష్టం అని శాస్త్రాలు చెప్తున్నాయి. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెబుతున్నాయి. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా… ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కాని అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు.
  • అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా చూడవచ్చు.  ఆలయాలలో మరియు ఆశ్రమాలలో అన్నదానం చేయడం అనేది ఒక  ఆచారం గా  ఉంది. అన్నదాన కార్యక్రమం ద్వారానే  భగవంతుడు ఎక్కువగా ప్రసన్నుడౌతాడని శాస్త్రాలలో చెప్పడం జరిగింది. అన్నదానంలో పాల్గోంటే పుణ్యమస్తుందని ధనం ఉన్నవాడు  కూడా తినడానికి అన్నదాన  కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే అన్నదానం చేసే వారు, అన్నదానాన్ని గ్రహించే వారు కూడా కొన్ని నియమాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.
  • అన్నదానం లో అన్నాన్ని తిన్నవారు.. వారు నేలపై బడిన ఎంగిలి మెతుకులను మరియు అన్నంపెట్టబడిన ఆకును అతడే తీసిపారవేయాలి.. కానీ, అన్నం పెట్టిన వారితో ఆ పని చేయించకూడదు. అలాగే అన్నం పెట్టిన వారు కూడా అన్నం తిన్నవారి ఎంగిలి మెతుకులను  మరియు అన్నం తిన్న ఆకులు తీసివేయడం లాంటివి మంచిది కాదు. అలా చేస్తే తిన్నవారికీ  హానికరమని చెప్పడం జరిగింది.
  • ఇంటికి వచ్చిన  బంధుమిత్రులకు, సాధు సన్యాసులకు మరియు మహాత్మలకు అన్నం పెట్టిన తరువాత వారి పాత్రలను, మెతుకులను ఎత్తివేయటం, కంచాలను శుభ్రం చేయడం మాత్రం ఇంటివారు తప్పనిసరిగా చేయవలిసిన పనులు. అతిథి చేత అంట్లు తోమించకూడదు. కేవలం అతిథ్యం మాత్రమే ఇవ్వలి. అలా అతిథి చేత ఎంగిలి మెతుకులు ఏరిస్తే, వారి కంచాలను వారినే కడగమంటే అది విందు ఇచ్చిన వారికి హానికరం.
  • ఆకలితో  ఉన్న వారే  మన దేశంలో ఎక్కువగా ఉన్నరు కాబట్టి, అలాంటి వారికి అన్నాని దానం చేయడంలో వెనుకడుగు వేయరాదు . ఒకే రోజు ఎక్కువ మంది జనాన్ని పిలిచి అన్నం పెట్టాడమే అన్నదానమని భావించకూడదు. మన శక్తిమేర నిత్యం అన్నదానం చేయవచ్చు. మొదట మీ ఇంటి ముందుకు వచ్చిన బిక్షగాళ్ళకు ఒక వ్యక్తి తినేంతటి అన్నాన్ని మరియు కూరని  దానం చేయండి. అయితే అన్నదానం అనగానే కేవలం మనుషులకే భోజనం పెట్టడం కాదు, కుక్కలకు, కాకులకు,  చీమలు, పిల్లులకు ,పక్షులకు మొదలగు అనేక ప్రాణులకు కూడా ఆహారాన్ని ఇవ్వడం ఒక  యజ్ఞమే అవుతుంది అని  గుర్తుపెట్టుకోండి.
  • ఎందుకంటే త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో యజ్ఞయాగాదులు తపస్సుల ద్వారా మానవులు మోక్షం పొందారు. కలియుగంలో దాన ధర్మాలు, దైవారాధన, నామ పారాయణ, నామస్మరణ మొదలైన వాటి ద్వారా సులభతరమైన మోక్షమార్గాన్ని దైవం ప్రసాదించాడు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR