ఎప్పుడైనా రోజు బాగాలేకపోతే పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసామే అని అనుకుంటూ ఉంటాం. ఒక్కోసారి తెలియకుండానే రోజంతా మూడీగా బోరింగ్ గా అనిపిస్తుంటుంది. అలా అవడానికి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి? ఉదయం అసలు చేయకూడని పనులేంటి, వాటి వలన మనకు ఎదురయ్యే సమస్యలేంటి ఇప్పుడు తెలుసుకుందాం.
- కొంత మంది ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఆవలించి మళ్లీ పడుకునే అవలాటు ఉంటుంది. ఈ విధంగా మర్చిపోయి కూడా చేయవద్దు. ఎందుకంటే ఉదయపు ఆవలింతలు రోజంతా బోరింగ్ గా మారుస్తాయి. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే మొదట మన అరచేతులను చూసి అనంతరం రెండు చేతులను కలిపి రుద్ది ముఖం మీద పెట్టుకోవాలి. చేతుల్లో సరస్వతి, లక్ష్మీ దేవి నివసిస్తారని నమ్ముతారు. అంతేకాకుండా మనలో నూతన సానుకూల శక్తి ప్రసారం అవుతుంది. ఈ విధంగా చేసినట్లయితే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. బోర్ ఫీలవ్వరు.
- మనం పడుకున్నప్పుడు మన శరీరంలో జీవక్రియలు నెమ్మదిస్తాయి. ఉదయాన్నే లేచి హనప్పుడు అవి వేగం పుంజుకుంటాయి. గుండెపై ఒత్తిడి పడుతుంది. అందుకే లేచేటప్పుడు కుడివైపు తిరిగి లేవాలి. ఉదయం లేచిన వెంటనే గుడి గంటల ధ్వని, శంఖు ధ్వని, గాయత్రీ మంత్రాలు వినడం మంచిది. అనంతరం గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను వేసి తినండి.
- అలాగే కొంతమంది నిద్రలేచిన వెంటనే కాఫీలు, టీలు తాగుతూ ఉంటారు. దాని వలన శరీరంలో కెఫిన్ పెరిగిపోతుంది. ఇది గుండెల్లో మంట వంటి అనారోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది. అందుకే ఉదయాన్నే కాఫీ టీలు తాగకూడదు. ఒకవేళ తాగాల్సి వస్తే బ్రష్ చేసి లేదా నోటిని పుక్కిలించైనా తాగాలి. కాసిన్ని గోరువెచ్చని నీళ్లు తాగిన తరువాత తాగితే మరీ మంచిది.
- ఈ మధ్య కాలంలో అందరూ బరువు తగ్గి నాజూకుగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఎన్నో రకాల వర్కౌట్లు, ఎక్సర్సిస్ లు, డైట్ లు, చేస్తున్నారు. మరి కొందరేమో ఏకంగా సన్నబడడానికి ఉదయం అల్పాహారం మానేస్తున్నారు. అయితే ఉదయం అల్ఫాహారం మానేయడం అత్యంత ప్రమాదకరమని శరీరానికి కావలిసిన పోషణ సరిగ్గా అందదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే అల్ఫాహారంగా ఏది పడితే అది తినకూడదట. ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ సమపాళ్ళలో ఉదయం అల్ఫాహారంగా తీసుకోవాలట.
- ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ ని ఉదయం ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోకూడదట. సాఫ్ట్ డ్రింక్స్ ని ఉదయమే కాదు రోజు మొత్తంలో ఎప్పుడూ తీసుకోకుండా ఉంటేనే మంచిదట. ఇందులో ఉండే అధిక చెక్కర వలన బరువు పెరుగుతారు. కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారు వీటికి ఎంత దూరం గా ఉంటే అంత మంచిది.
- చాలా మందికి ఉదయం లేవగానే ముందుగా చల్లగా నీళ్లు తాగాలని అనిపిస్తుంది. కానీ ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. ఇందుకు భిన్నంగా ఉదయం లేవగానే నీటిని గోరు వెచ్చగా కాచుకుని తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయట. ఉదయం ఖాళీ కడుపుతో శీతల పానీయాలు సేవించడం వలన మన జీర్ణక్రియ మందగిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సిట్రస్ పండ్లలో అధిక ఆమ్లాలు ఉండడం వలన మన కడుపు పై అధిక భారం పడుతుందట.
- ఉదయం పరగడుపున అల్పాహారం లో ఎక్కువగా కారంతో తయారుచేసిన ఆహారాన్ని తీసుకోవడం వలన కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి. అందుకే పొద్దున పూట కారంతో తాయారు చేసిన ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనం చేసుకునే టిఫిన్స్, చట్నీలలో కూడా కారం తక్కువగా ఉండేలా చూసుకోవాలి.