మెదడు పనితీరు మెరుగు పడాలంటే ఈ పదార్ధాలు తినాల్సిందే

ఎప్పుడూ ఏదో పనిలో నిమగ్నమై ఉంటాం. ఏదో ఆలోచిస్తుంటాం. కానీ మనసుకు ఏదీ తట్టదు. కొన్నిసార్లు ఎంత ఆలోచించినా ఏ మాత్రం ఏకాగ్రత కుదరదు. ఎందుకిలా. మెదడు పనితీరు, సామర్థ్యం మందగిస్తుండడమే. మెదడు పూర్తి ఆరోగ్యంగా ఉండి, సమర్థవంతంగా పనిచేస్తే మన ఆలోచనా శక్తి, విశ్లేషణా సామర్థ్యం పెరుగుతాయి. ఏకాగ్రత కూడా సమకూరుతుంది. దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు మెదడు పనితీరు సమర్థవంతంగా ఉండడానికి తోడ్పడే అంశాల గురించి చెప్పారు.

మెదడుమెదడు చురుగ్గా ఉండడానికి శారీరక శ్రమకు, వ్యాయామానికి ఏమిటి సంబంధం అనుకోవద్దు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయమం లేదా శారీరక శ్రమ చేసేవారి మెదడు పనితీరు చురుగ్గా ఉంటుందని శారీరక శ్రమ వల్ల గుండె, ఊపిరితిత్తులు బాగా పనిచేసి శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, శారీరకంగా ఫిట్ గా ఉంటే మానసిక ఆరోగ్యం కూడా చేకూరుతుందని గుర్తించారు. శరీరంలో డిప్రెషన్, యాంగ్జైటీ వంటి వాటికి కారణమయ్యే హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయి మెదడుపై ఒత్తిడి తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మెదడుమెదడు చురుకుదనాన్ని పెంచి, మెదడును ఆరోగ్యంగా ఉంచి, మంచి జ్ఞాపకశక్తిని ఇచ్చే కొన్ని రకాల ఆహార పదార్థాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ఆలివ్ ఆయిల్ లో పాలిఫేనోల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆమ్లజనకాలు మెదడు సంబంధించిన వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతాయి. అందువల్ల ఎక్కువగా దీన్ని వినియోగిస్తే మెదడు చురుగ్గా పని చేస్తుంది. అలాగే మంచి మెమొరీ వస్తుంది. దీంట్లో ఉండే ఓలియోకెంథాల్ అనే రసాయనం మతిమరుపు వంటి సమస్యలను తొలగిస్తుంది. మెదడు కణాలు ఉత్తేజంగా పనిచేసేలా చూస్తుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెఇది మెదడులోని నాడీకణాల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇది కాపాడగలుతుంది. అంతేకాకుండా సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అందివ్వడానికి కూడా తోడ్పడుతుంధీ.

అవకాడో:

అవకాడోఅవకాడోలు మెదడులోని రక్తం గడ్డటాన్ని నివారించడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇందులో కే విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఫోలేట్ కూడా ఎక్కువగా ఉంటుది. ఇవన్నీ మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడుకు ఎలాంటి స్ట్రోక్ రాకుండా ఉండేందుకు అవకాడో బాగా ఉపయోగపడుతుంది.

వైల్డ్ సాల్మన్:

వైల్డ్ సాల్మన్ఇందులో ఒమేగా -3 డీహెచ్ ఏ ఎక్కువగా ఉంటుంది. డీఎచ్ ఏ మెదడు కణాల ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది. మీ మెదడు బాగా పని చేయాలంటే ఈ చేపల్ని బాగా తినండి. మెదడుకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్స్ లో ఇది ఒకటి.

బ్లూబెర్రీస్:

బ్లూబెర్రీస్వీటిలో చాలా పవర్ ఫుల్ ఆమ్లజనకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన మెదడుకు చాలా మేలు చేస్తాయి. మెదడుకు సంబంధించిన కణాల వాపు తగ్గించడానికి కూడా ఈ పండ్లు బాగా ఉపయోగపడతాయి. అందువల్ల బ్లూబెర్రీస్ ను ఎక్కువగా తింటూ ఉండాలి.

పసుపు:

పసుపుమెదడు కణాలకు సంబంధించిన వాపును తగ్గించడానికి పసుపు బాగా పని చేస్తుంది. ఇవి డీఎన్ ఏపై ప్రభావం చూపుతాయి. ఇందులో యాంటీ డిప్రెస్సెంట్లుగా పనిచేసే పలు ఔషధాలు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మెదడు కణాలు నాశనం కాకుండా చూస్తాయి. పసుపు మనం నిత్యం ఆహారాల్లో తీసుకుంటూనే ఉంటాం. దీని ఉపయోగం తెలుసుకుని మరింత ఎక్కువగా తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలుంటాయి.

గుడ్లు:

eggsవీటిలో కొలైన్ అధికంగా ఉంటుంది. ఇది న్యూరోట్రాన్స్మిటర్లకు చాలా అవసరం. పాస్పోలిపిడ్స్ గుడ్డులో అధికంగా ఉంటాయి. ఇవి మెదడుకు, నాడీ వ్యవస్థకు చాలా అవసరం. ఇందులోని పోషకాలు మెదడులోని కణాలను ఆరోగ్యంగా మారుస్తాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR