Home Health కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?

కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?

0

కరోనా మహమ్మారి బారిన పది ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది దానితో పోరాడి బయటపడుతున్నారు. ఇక కరోనా వైర‌స్ బారి నుంచి బయటపడినవారు ఇప్పుడిప్పుడే తమ పనులకు వెళుతున్నారు. కరోనా భయం నుంచి బయటపడి తమ రోజువారీ పనుల్లో పడి బిజీ అవుతున్నారు. అయితే కరోనాను తట్టుకొని బయటపడిన వారు కోలుకున్నామని నిర్లక్ష్యంగా ఉండొద్దు అంటున్నారు వైద్యులు. సాధారణంగా ఫ్లూ, జలుబు లాంటి వ్యాధుల నుంచి కోలుకున్నవారిలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుందని భావిస్తారు. అందుకే, ఫ్లూ నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ అంత తొందరగా ఆ వ్యాధి రాదు. కోవిడ్-19 మాత్రం తొందరగా మళ్లీ తిరగబడుతోందని పరిశోధనలు చెబుతున్నాయి.

tests must be performed after recovery from the coronaకరోనా నుంచి కోలుకున్న రోగుల్లో కనీసం 14 శాతం మందికి తర్వాత పరీక్షలు చేస్తే మళ్లీ పాజిటివ్ అని వస్తోందని స్పానిష్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (సీఎస్ఐసీ)కి చెందిన అంటువ్యాధుల నిపుణులు విస్తుపోయే నిజాలను వెల్లడించారు. వారికి రెండోసారి సోకిందని చెప్పలేం కానీ, వైరస్ తిరగబెట్టడం వల్ల వారు మళ్లీ అనారోగ్యానికి గురవుతున్నారని అంటున్నారు.

కరోనా వైరస్ ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆరోగ్యంతో ఉన్నవారు, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారు కరోనా నుండి స్వల్ప కాలంలో బయటపడే అవకాశం ఉంది. వైరస్ సోకినవారిలో కొందరు వారం రోజులకే కోవిడ్19 నుంచి కోలుకుంటే, మరికొందరికి రెండు వారాలు, ఇంకొందరు నెలకు పైగా రోజులు చికిత్స అనంతరం కోలుకుంటున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్న వారు సైతం భౌతికదూరం పాటించడం, ముఖానికి మాస్కులు ధరించాలి, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం చేయాలి.

చాలావరకు కరోనా కుటుంబానికి చెందిన వైరస్‌ల బారిన పడి కోలుకున్నవారిలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. కానీ, కొందరిలో అది బలహీనంగా ఉంటుంది. అలాంటి వారి శరీరంలో ఎక్కడో ఒకచోట దాగి ఉన్న వైరస్ మళ్లీ తిరగబడే ప్రమాదం ఉంటుంది. కొన్ని వైరస్‌లు మానవ శరీరంలో మూడు నెలలు, అంతకంటే ఎక్కువ కాలం జీవించగలవు. వైరస్ సోకిన వారికి చికిత్స చేసిన తర్వాత నెగెటివ్ వస్తే, వారి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగినట్లుగా భావిస్తారు. అయితే, పరీక్షల్లో నెగెటివ్ అని వచ్చినా మన శరీరంలోని కణజాలంలో ఎక్కడో ఒక చోట వైరస్‌ ఇంకా దాక్కునే అవకాశం ఉంది. అలాంటి వైరస్ మన శరీర రక్షణ వ్యవస్థకు చిక్కకపోవచ్చు. అలా దాక్కున్న వైరస్ కొన్నాళ్లకు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది.

కోవిడ్ -19 విషయంలో చూస్తే, దీని నుంచి కోలుకున్న తర్వాత స్వల్ప కాలంలోనే మళ్ళీ పాజిటివ్‌ అని వస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనావైరస్ నుంచి కోలుకున్న తర్వాత ఇప్పుడు చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. వారికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, కళ్లు తిరగడం, అలసట, తేలికపాటి జ్వరం, కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు ఉంటున్నాయి. ఒక రోగిలో కరోనా ఇన్ఫెక్షన్ ఎంత ఎక్కువగా ఉంటే, కోలుకున్న తర్వాత వారిలో అన్ని ఎక్కువ లక్షణాలు కనిపిస్తాయి. అయితే తేలికపాటి కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి కూడా తర్వాత బలహీనంగా అనిపించవచ్చు

వీరిలో చాలామందికి బెడ్ మీద నుంచి లేచి బాత్రూంకు కూడా వెళ్లలేనంత బలహీనంగా ఉన్నట్లు అనిపించవచ్చు. అయితే, ప్రతి రోగిలో ఇలాంటి లక్షణాలు కనిపించాల్సిన అవసరం లేదు అని డాక్టర్లు చెప్పారు. అందుకే కరోనా నుంచి కోలుకున్న తరువాత సైతం రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహారం తీసుకోవాలి. ఊపిరితిత్తులు, గుండె, ఛాతి సంబంధిత అవయవాల పనితీరుతో పాటు ఇంకా ఏమైనా అనారోగ్య సమస్య ఉంటే తెలుసుకునేందుకు కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తేలికపాటి లక్షణాలున్న 30 శాతం రోగుల్లో బలహీనత ఉంది. కొంతమంది రోగుల ఎక్స్-రే బాగానే ఉంటుంది. కానీ, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేయించిన తర్వాత వారి ఊపిరితిత్తుల సామర్థ్యం 50 శాతం తగ్గిపోయినట్లు తెలుస్తోంది. డిశ్చార్జి అయిన 110 మంది రోగుల్లో 81 శాతం మందికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, తరచూ స్పృహతప్పడం, కీళ్ల నొప్పులు లాంటివి ఉన్నాయని ఓ సర్వేలో తేలింది.

కరోనా వైరస్ సోకిన వారిలో ఇన్‌ఫెక్షన్ సోకే అవయవం ఊపిరితిత్తులు, ఛాతి. అందుకే కరోనా నుండి కోలుకున్న తరువాత నలతగా అనిపిస్తే స్కాన్ చేయించుకోవాలి. కరోనాను జయించిన వారిలో వైరస్‌పై పోరాడుతున్న సమయంలో కలిగే అనారోగ్యం, అసౌకర్యం కారణంగా గుండె నొప్పి, ఛాతీలో మంట లాంటివి వస్తాయి. పూర్తి స్థాయిలో ఛాతీని పరీక్షించుకునేందుకు హెచ్‌ఆర్‌టీసీ స్కాన్ చేయించుకుని, ఏదైనా సమస్య ఉంటే దాని నుంచి కోలుకునేందుకు చికిత్స చేయించుకోవాలి.

కరోనా సోకిన వారిలో విటమిన్ డి లోపాలు ఉన్నట్లు గుర్తించారు. కనుక కరోనా నుండి కోలుకున్న తరువాత వీరికి విటమిన్ డి టెస్ట్ చేయించి, ఏమైనా లోపం ఉంటే అందుకు తగ్గట్లుగా మెడిసిన్ తీసుకోవాలి. రోగనిరోధక శక్తికి విటమిన్ డి కీలకమని తెలిసిందే.

కరోనాను జయించిన వారిలో యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయి. కోవిడ్19 నుంచి కోలుకున్నాక IgG యాంటీబాడీ టెస్ట్ చేయించుకుంటే యాంటీ బాడీలు ఏ మేర ఉత్పత్తి అయ్యాయో తెలుస్తుంది. తద్వారా మీకు ప్లాస్మా దానం చేయవచ్చా లేదా అనే దానిపై అవగాహన వస్తుంది. కరోనా నుంచి కోలుకున్న అనంతరం నెల రోజుల్లోగా యాంటీబాడి టెస్టు చేపించుకోవాలి.

శరీరంలో తెల్లరక్తకణాలు, ఎర్రరక్త కణాలు మొత్తాన్ని తెలుసుకునేందుకు నిర్వహించే పరీక్ష కంప్లీట్ బ్లడ్ కౌంట్. రక్తకణాలతో పాటు ప్లేట్‌లెట్స్ సంఖ్యను సీబీసీ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. రక్తంలో ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లేకపోతే కోవిడ్19ను జయించిన అనంతరం మీరు వేగంగా కోలుకుని నార్మల్ అవుతారు.

రక్తం గడ్డకట్టడం, రక్తంలో గ్లూకోజ్ మరియు రక్తప్రవాం లాంటి విషయాలను తెలుసుకునేందుకు గ్లూకోజ్, కోలెస్ట్రాట్ టెస్ట్ నిర్వహిస్తారు. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి ఈ పరీక్షలు చేయించి, ఏదైనా సమస్య ఉంటే మెడిసిన్ తీసుకుంటే మరింత త్వరగా అన్ని ఇన్‌ఫెక్షన్ల నుంచి బయటపడతారు. కొవ్వు సమస్య ద్వారా కరోనా నుంచి కోలుకున్నప్పటికీ , పూర్తిగా రికవరీ అయ్యేలోగా గుండెపోటు, ఛాతీలో నొప్పి లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి.

 

Exit mobile version