నోటి దుర్వాసన నివారణకు ఈ చిట్కాలు తప్పనిసరి

కొంతమంది ఎంత నీట్ గా తయారైనా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వీరి నోటినుండి దుర్వాసన వస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు మాట్లాడుతుంటూ దూరంగా జరిగిపోతాం. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

tips are essential for the prevention of bad breathకొన్ని రకాల ఆహారం తీసుకున్నప్పుడు నోటి దుర్వాసన ఎక్కువవుతుంది. దీనికి కారణం ఆ ఆహారపదార్థాలు బాక్టీరియా పెరగడానికి బాగా దోహదం చేస్తాయన్నట్టు. అందుకే ఏ ఫుడ్ తిన్న తరువాత నోరు ఎక్కువ వాసన వస్తుంది అనేది గమనించి, అలాంటి ఆహారపదార్థాలను దూరంగా పెట్టడం మంచిది.

tips are essential for the prevention of bad breathనోట్లో తడిలేకపోవడాన్ని డ్రై మౌత్ అంటారు. ఈ సమస్యనుండి బైటపడాలంటే సింపుల్ చిట్కా రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి.

tips are essential for the prevention of bad breathపాలు, పాల ఉత్పత్తులు, మాసం, చేపలు, ఉల్లిపాయలు లాంటి వాటిని ఆహారంలో తగ్గించడం బెటర్. కాఫీ, సిట్రస్‌ జ్యూస్‌లు, షుగరీ డ్రింక్ లకు ఎంత దూరం ఉంటే అంత మంచిది.

tips are essential for the prevention of bad breathస్మోకింగ్‌ మానేయాలి. ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. దీంతోపాటు దంత సమస్యలు లేకుండా చూసుకోవాలి. క్రమంతప్పకుండా దంతవైద్యుణ్ణి కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి ఆరు నెలలకొకసారి డెంటల్‌ చెకప్‌, క్లీనింగ్‌ చేయించుకోవాలి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR