Home Health జుట్టు సమస్యలను నివారించుకోవడానికి ఈ చిట్కాలను తప్పక పాటించండి

జుట్టు సమస్యలను నివారించుకోవడానికి ఈ చిట్కాలను తప్పక పాటించండి

0

మగువలు ముఖారవిందానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో కేశాలంకరణకు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు. అందమైన కురుల కోసం ఆరాటపడతారు. కాని, ప్రస్తుతం అనేక జుట్టు స‌మ‌స్య‌లు వెంబ‌డిస్తుంటాయి. ఈ స‌మ‌స్య‌లు నివారించుకోవడానికి చాలామంది రకరకాల నూనెలు, షాంపూలను ఉపయోగిస్తుంటారు. అయితే ఈసారి జుట్టు సమస్యలను నివారించుకోవడానికి నూనెలు, షాంపూలు కాకుండా కేవలం క్యారెట్ మాస్కులు ట్రై చేయండి. త‌ప్ప‌కుండా మంచి ఫ‌లితం క‌నిపిస్తుంది.

జుట్టు సమస్యలనుఇప్పటివరకు క్యారెట్లు తింటే కంటి చూపుకు మంచిదని మాత్రమే తెలుసు. క్యారెట్‌లోని వివిధ పోషకాలు ఆరోగ్యానికి మంచివి. కానీ జుట్టు సంరక్షణను క్యారెట్ల నుండి తీసుకోవచ్చని చాలా మందికి తెలియదు. అవును, క్యారెట్ లోని కొన్ని పదార్థాలు జుట్టు పెరుగుదలలో చక్కగా ఉపయోగపడతాయి. మరి క్యారెట్ తో మాస్క్ ఎలా తయారు చేసుకోవాలి? ఏ మాస్క్ ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

అందుకు ముందుగా క్యారెట్‌ను పేస్ట్ చేసుకుని అందులో కొద్దిగా కొబ్బ‌రి నూనె కలిపి మరింత బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు, మాడుకు అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు చేతి వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయాలి. జుట్టు బాగా ఆరిన తరువాత చల్లని నీటితో జుట్టును శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య‌లు త‌గ్గి మృదుగా కూడా త‌యార‌వుతుంది.

క్యారెట్ పేస్ట్‌, నిమ్మ‌ర‌సం, ఆలీవ్ ఆయిల్ మూడు క‌లిపి జ‌ట్టుకు అప్లై చేయాలి. కొన్ని నిమిషాల పాటు మీ చేతి వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయండి. జుట్టు బాగా ఆరనిచ్చిన తరువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి ఒక‌సారి చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం, చండ్రు స‌మ‌స్య‌లు వంటివి త‌గ్గుతాయి.

క్యారెట్ పేస్ట్ మ‌రియు పెరుగు బాగా క‌లిపి జ‌ట్టుకు బాగా ప‌ట్టించుకోవాలి. ఒక అర‌గంట పాటు జ‌ట్టు ఆర‌నిచ్చి త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు మృదువుగా మారుతుంది. అదే విధంగా అనేక జుట్టు స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి.

క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ మరియు విటమిన్ సి జుట్టు ప్రసరణను ప్రోత్సహిస్తాయి మరియు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. ఇది జుట్టు రాలడాన్ని ఆపుతుంది. క్యారెట్‌లోని విటమిన్ ఇ, పొటాషియం మరియు భాస్వరం జుట్టును దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా రక్షణ పొరను నిర్మించడమే కాకుండా, ఆక్సిజన్‌ను అందించడం ద్వారా జుట్టుకు పోషకాలను సరిగా గ్రహించడానికి సహాయపడుతుంది.

క్యారెట్‌లో విటమిన్ ఎ, కె, సి బలంగా ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి, దెబ్బతిన్న జుట్టు కణాలను రిపేర్ చేయడంతో పాటు, కొత్త హెయిర్ సెల్స్ పెరగడానికి సహాయపడతాయి. ఇందులో విటమిన్ బి, బి 1, బి 2, బి 3 మరియు బి 6 ఉన్నాయి. ఇవన్నీ హెయిర్ మాయిశ్చరైజర్‌ను కాపాడుతాయి మరియు జుట్టుకు చైతన్యం ఇస్తాయి.

అలాగే క్యారెట్ ఆయిల్ జుట్టు వేగంగా మరియు మందంగా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టు పొడవుగా ఉంచడానికి, జుట్టు చివర్లో స్ప్లిట్స్ నివారించడానికి క్యారెట్ ఆయిల్ సహాయపడుతుంది. క్యారెట్ ఆయిల్‌తో జుట్టును కండిషన్ చేయడం వల్ల దాని ఆకృతి మెరుగుపడుతుంది, క్యారెట్ ఆయిల్ వాడటం వల్ల జుట్టు మెరుస్తూ, సున్నితంగా మరియు మృదువుగా ఉంటుంది.

క్యారెట్ మాస్క్ వేసుకోవడంతో పాటు క్యారెట్ ని ఆహారంలో భాగం చేసుకోవడం వలన కూడా జుట్టుకు మేలు కలుగుతుంది. క్యారెట్ ని నేరుగా తినడం ఇష్టం లేని వారు జ్యుస్ చేసుకొని కానీ లేదా ఇతర వంటకాల రూపంలో కానీ తీసుకోవచ్చు. అయితే ఆయిల్ లేకుండా పచ్చి క్యారెట్ తీసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.

 

Exit mobile version