గర్భవతిగా ఉన్నప్పుడు ఏడిస్తే ఆ ప్రభావం పిల్లలపై పడుతుందా?
- అమ్మవడం ప్రతీ మహిళ జీవితంలోనూ ఒక అపూర్వమైన ఘట్టం. అసలు, అమ్మ అని పిలిపించుకున్నప్పుడే మహిళజన్మ సార్థకం అవుతుంది. అమ్మ అనిపించుకునే ఆ క్షణం కోసం ఎన్నో ఆపసోపాలకు ఓర్చి బిడ్డకు జన్మనిస్తారు. ఓ బిడ్డకి జన్మనివ్వాలంటే ఆ తల్లి పడే బాధ మాటల్లో వర్ణించలేనిది. నవ మాసాలు ఎన్నో కష్టాలు, నొప్పులు అనుభవించి చివరికి చావు అంచుల్ని చవి చూసినా… బిడ్డని చూసిన మరు క్షణమే అన్ని బాధలు మరచిపోతుంది ఆ తల్లి.
- అంతలా బిడ్డకోసం ఆరాటపడే తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. గర్భవతి అని తెలిసిన నాటి నుండే ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌస్టికాహారము అంటే పాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు వగైరా వంటివి తీసుకుంటారు. అయితే కేవలం పోషకాహారాలు తీసుకుంటే మాత్రం సరిపోదు. గర్భం ధరించిన స్త్రీ ముఖ్యంగా ఎల్లవేళలూ ప్రశాంతముగా వుండాలి. కుటుంబ ఆప్యాయత అనురాగం కలిగి వుండాలి. నీతి కథలను చదువుతూ వుండాలి. గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. గర్భిణులు కంటినిండా నిద్రపోవటం ఎంతో అవసరం. అప్పుడే పుట్టబోయే శిశువు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
- గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తనకు ఎవరు పుడతారు, సరిగ్గా ప్రసవం జరుగుతుందా, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగానే పుడతారు కదా.. ఇలా ప్రతి క్షణం కడుపులోని శిశువు గురించే ఆలోచన చేస్తూ తమలో తామే మధనపడుతూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో ప్రెగ్నన్సీ సమయంలో గర్భంతో ఉన్న మహిళ ఏడవటం వలన బిడ్డపై ఎలాంటి ప్రభావం చూపుతుందని అంటున్నారు వైద్య నిపుణులు.
- మహిళ గర్భంతో ఉన్నప్పుడు ఎప్పుడు నవ్వుతూ, సంతోషంగా ఉండాలని వైద్యులు, పెద్దలు చెబుతూనే ఉంటారు. కానీ ఎప్పుడు అందరూ ఒకేలా ఉండలేరు కదా. కొందరు చాలా సంతోషంగా ఉంటే, మరికొందరు విచారంగా ఉంటారు. ప్రెగ్నన్సీ సమయంలో విచారం ఉండటం, మూడీగా ఉండటం సహజమే కానీ ఎప్పుడు అలా ఉండకూడదు. ముఖ్యంగా ఏడవటం వలన అది పుట్టబోయే బిడ్డపై ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు అంటున్నారు.
- ఎందుకంటే ఆ టైమ్‌లో ప్రతి ఒక్కటీ కడుపులోని బిడ్డ ఎదుగుదలపై ఆధారపడి ఉంటాయి. ప్రెగ్నెన్సీ మహిళ కరెక్ట్‌గా పోషకాహారం తీసుకోవడం, సంతోషంగా ఉండడం, ఏవైనా శబ్దాలు విన్నప్పుడు బిడ్డ తన్నడం చేస్తుంటాడు. అలాగే ఎమోషన్స్ కూడా కడుపులోని శిశువుకు తెలుస్తాయని అంటున్నారు నిపుణులు. అంటే ప్రెగ్నెన్సీ మహిళ హ్యాపీగా, యాక్టీవ్‌గా ఉంటే బిడ్డ కూడా అలానే ఉంటారు.ఎప్పుడూ ఏడుస్తూ బాధపడటం చేస్తే కడుపులోని బిడ్డ కూడా అలానే బాధగా ఉంటారట.
- గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఇష్టంగా తినే ఆహార పదార్థాలను పెద్దయ్యాక పిల్లలు తినడం చేస్తుంటారు. అయితే తల్లికి ఇష్టమైన ఆటలు, గర్భంతో ఉన్నప్పుడు చేసిన ఇష్టమైన పనులు, అభిరుచులు, అలవాట్లు వారి పిల్లలకు వస్తాయని సర్వే ప్రకారం తేలిన విషయం. అంతేకాదు, ప్రెగ్నెన్సీ మహిళ ఎప్పుడూ బాధపడుతూ ఉంటే, పిల్లల పెరిగి పెద్దయ్యాక కూడా మూడీగా, విచారంగా ఉంటారట. అందుకే గర్భంతో ఉన్నప్పుడు ఎప్పుడు నవ్వుతూ, హ్యాపీగా ఉండాలని డాక్టర్లు, పెద్దలు చెబుతూనే ఉంటారు.
- వికారంగా ఉండడం , వాంతులు అవడం , ఉత్సాహం గా లేకపోవడం గర్భధారణ సమయంలో సహజంగా ఉండేవే. కాబట్టి ప్రతి చిన్న విషయానికి మదనపడకుండా ఎప్పటికప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే ప్రెగ్నెంట్ సమయంలో వ్యాయామాలు, ధ్యానం చేయడం చాలా అవసరం. దానివల్ల డెలివరీ సులభం అవడమే కాదు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.