గ్రహణం ముందు, గ్రహణం తరువాత చేయాల్సిన పనులు

మన భారతదేశం ఎన్నో వందల సంస్కృతులు సంప్రదాయాల సమ్మేళనం. భారతీయులు ఎన్నో నమ్మకాలను విశ్వసిస్తారు, పాటిస్తారు. ఇది జగమెరిగిన సత్యం. అందుకే ఈ ప్రపంచంలో భారత దేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సంప్రదాయాలు అనేటివి నమ్మకాల ఆధారంగా ఏర్పడతాయి. ఈ నమ్మకాల లో కొన్నింటికి ఖచ్చితమైన కారణాలు ఉంటాయి, అందుకు తగ్గ రుజువులు కూడా ఉంటాయి. అవి పాటించడం వల్ల మనిషి యొక్క ఆరోగ్యం మరియు జీవన విధానం చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకొన్ని నమ్మకాలు అర్థరహితంగా నమ్మలేని విధంగా, ఆచరణ యోగ్యంకాని విధంగా ఉంటాయి.

గ్రహణంమన భారతీయ సంస్కృతిలో గ్రహణాలపై అపర నమ్మకం ఉంటుంది. గ్రహాల పరంగా కూడా వీటిని మనం నమ్ముతాం. సూర్య గ్రహణం రోజు ఆహరం ఏమి తీసుకోకూడదని చాలా మంది ప్రజలు చెబుతారు. అసలు ఎందుకు చాలామంది భారతీయులు ఇలా చెబుతారు ? అలా ఆహరం తీసుకోకూడదు అనే నియమాన్ని ఎందుకు పాటిస్తారు? దాని వెనుక దాగిఉన్న అసలు నిజాలేంటి ? అంటే… గ్రహణం పట్టే సమయంలో వెలువడే సూర్య కిరణాల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

గ్రహణంగ్రహణ సమయంలో కొన్ని రకాల కిరణాలు వాతావరణంలోకి ప్రవేశించి భూమిని చేరుతాయంట. ఈ కిరణాలు ఆహారంలో ఉండే సూక్ష్మ క్రిములు అధికంగా వృద్ధి చెందడానికి దోహదపడతాయట. ఈ విషయాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు మరియు శాస్త్రవేత్తలు దృవీకరించారు. మన ఆచారం ప్రకారం గ్రహణం మంచిది కాదని అర్థం. ఈ గ్రహణ వేళల్లో అన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకుంటారు. అయితే, ఈ ఏడాది ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉన్నాయి. ఆ గ్రహణం పట్టిన సమయంలో కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. గ్రహణం తరువాత ప్రక్షాళన చేయాలనీ మరికొందరు చెబుతారు.

గ్రహణంఇంతకీ గ్రహణం పట్టే సమయంలో చేయాల్సిన పనులేంటి? చేయకూడని పనులేంటి? గ్రహణం వదిలిన తరువాత చేయాల్సిన పనులేంటి ఇప్పుడు తెలుసుకుందాం..

గ్ర‌హ‌ణం రోజు చేయాల్సిన ప‌నులు:

గ్రహణం సమయంలో ఏదైనా మంత్రాన్ని పఠిస్తే అది శీఘ్రంగా ఫలిస్తుందంటున్నారు జ్యోతిష్యులు. ప్రధానంగా మహా మృత్యంజయ మంత్రాన్ని జపిస్తే కష్టాలు తొలగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఏదైనా కార్యం సిద్ధించేందుకు మంత్రాన్ని జపించాలనుకునేవారు ఇలాంటి సమయంలో జపిస్తే ఉత్తమమం అంటున్నారు జ్యోతిష్యులు. దైవానికి సంబంధించి మంత్రాలు రాక‌పోతే క‌నీసం దేవుళ్ల నామ‌స్మ‌ర‌ణ చేయాల‌ని పండితులు చెబుతున్నారు. గ్రహణం పట్టిన సమయంలో వండిన అన్నం, తరిగిన కూరగాయలు, పండ్లు కలుషితమౌతాయి. వీటిని భుజించకూడదు.

గ్రహణంసూర్య‌గ్ర‌హ‌ణానికి ముందే ఆహారం తీనేయాలి. కాని నూనె, నెయ్యితో చేసిన వంటకాలు ఉదాహరణకు అన్నం, నెయ్యి, నూనె, పాలు, పెరుగు, లస్సీ, వెన్న, పన్నీరు, ఊరగాయలు, చట్నీ, మురబ్బాలో నువ్వులు లేదా దర్బలు ఉంచితే ఆ పదార్థాలు కలుషితం కావంటున్నారు జ్యోతిష్యులు. డ్రై ఫుడ్‌లపై నువ్వులు లేదా దర్బలు ఉంచాల్సిన అవసరం లేదు.

 • గ‌ర్భ‌వ‌తులు సూర్య‌గ్ర‌హ‌ణం స‌మ‌యంలో బ‌య‌ట‌కు రాకూడ‌దు. గ్ర‌హ‌ణ నీడ ఎట్టి ప‌రిస్థితుల్లో గ‌ర్భం ప‌డ‌కుండా చూసుకోవాలి.
 • అలాగే ఇంట్లో పూజ గ‌ది ఉంటే దానిపై కూడా సూర్య‌గ్ర‌హ‌ణం నీడ ప‌డ‌కుండా ఇంటి త‌లుపులు, కిటికీలు మూసివేయాలి.
 • ఏవైనా విరాళాలు, దానాలు చేయాల‌నుకుంటే గ్ర‌హ‌ణం ముందే ఇంట్లోంచి బ‌య‌ట పెట్టి, గ్ర‌హ‌ణం త‌ర్వాత దానాలు చేయాల‌ని వేద పండితులు సూచిస్తున్నారు.

గ్రహణం
గ్ర‌హ‌ణం రోజు చేయ‌కూడ‌నివి:

గ్రహణ సూతక సమయంలో అన్ని రకాల ఆహార పదార్థాలను ఘన రూపంగా లేదా ద్రవం రూపంగా తినడం నిషేధించబడింది. అయితే, పిల్లలు, జబ్బుపడిన మరియు వృద్ధులు అవసరమైతే ఈ సమయంలో తినవచ్చు అని చెబుతారు.

 • సూర్య‌గ్ర‌హ‌ణం స‌మ‌యంలో బ‌య‌ట‌కు వెళ్ల‌రాదు. ముఖ్యంగా విశాల‌మైన‌, ఎవ‌రూ లేని ప్ర‌దేశాల‌కు వెళ్ల‌రాదు. గ్ర‌హ‌ణ స‌మ‌యంలో నెగెటివ్ ఎన‌ర్జీ, చెడు శ‌క్తులు అత్యంత బ‌లంగా ఉంటాయి. అందుకే బ‌య‌ట‌కు వెళ్ల‌రాద‌ని సూచిస్తున్నారు.
 • ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లవద్దని ఖచ్చితంగా సలహా ఇస్తారు. గ్రహణం సమయంలో కలుషితమైన వాతావరణానికి గురికావడం శిశువు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అలాగే, గర్భస్రావం సంభావ్యత పెరుగుతుందని నమ్ముతారు.
 • సూర్య‌గ్ర‌హ‌ణం రోజు గర్భిణీ స్త్రీలు ఎట్టి ప‌రిస్థితుల్లో కూరగాయలు తరగడం.. ఇత్యాది వంట పనులు చేయకూడదు.. సూది, దారం వాడ‌కూడ‌దు. గ్రహణం పట్టే సమయంలో సూర్య కాంతికి కూర్చోకూడదు.
 • మన ఆచారాల ప్రకారం గహ్రణ సమయంలో చమురు మసాజ్ చేసుకోవడం, మంచినీరు తాగడం, మలమూత్ర విసర్జన, జుట్టు దువ్వుకోవడం, పళ్ళు తోముకోవడం అదేవిధంగా లైంగిక చర్యలలో పాల్గొనడం మంచిది కాదని చెబుతారు. ఈపనులను చేయడం వల్ల ఇబ్బందులు పడతారని పండితులు చెబుతున్నారు.
 • గ్ర‌హ‌ణం ప్రారంభ‌మ‌య్యాక నిద్ర‌పోకూడ‌దు. ఐదు చిన్న పిల్ల‌లు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న‌వారు మాత్రం ప‌డుకోవ‌చ్చు.
 • మామూలు క‌ళ్ల‌ద్దాల‌తో గ్ర‌హ‌ణాన్ని చూస్తే కంటి స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.
 • గ్ర‌హ‌ణ స‌మ‌యంలో తుల‌సి ఆకులు తెంప‌కూడ‌దు.
 • గ్ర‌హ‌ణ స‌మ‌యంలో ఇంట్లో ఉన్న దేవుళ్ల‌ను, విగ్ర‌హాలు, ప‌టాల‌ను ముట్టుకోకూడ‌దు.
 • సూర్య‌గ్ర‌హ‌ణం స‌మ‌యంలో మాసం తిన‌డం, మ‌ద్యం తాగ‌డం లాంటివి చేస్తే అనేక స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు.

గ్రహణం తరువాత ఏమి చేయాలి?

 • గ్రహణం కంటె ముందు సమయంలో తయారుచేసిన ఆహారాన్ని పూర్తిగా పారవేయాలి. గ్రహణ సమయంలో ఇంట్లో మిగిలిన ఆహార పదార్ధాలను తినడం ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని పండితులు చెబుతారు.
 • సూర్య‌గ్ర‌హ‌ణం త‌ర్వాత మీ ఇంట్లో ఉండే తాగునీరును మార్చేసి కొత్త‌గా మ‌ళ్లీ తాగునీరు తెచ్చుకోవాలి.
 • గ్ర‌హ‌ణం ముగిశాక వెంటనే త‌ల‌స్నానం చేయాలి. గ్రహణం పట్టే ముందు స్నానం కూడా చేయాలి అని పండితులు చెబుతున్నారు.
 • ఇంటిని శుభ్రం చేయాలి. తరువాత తాజా ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి.
 • దర్భ గడ్డి లేదా తులసి ఆకులను గోధుమలు, బియ్యం, ఇతర తృణధాన్యాలు అలాగే కూరగాయలు వంటి ఆహార పదార్థాల కంటైనర్లలో ఉంచాలి. అలాగే, గ్రహణం తర్వాత దానాలు చేయడం చాలా ప్రయోజనకరంగా పండితులు చెబుతారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR