పులిపిర్లు వాటంతటవే రాలిపోవాలంటే ఇలా చేయండి!

శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు కొన్ని రకాల వైరస్‌లు శరీరంపై దాడి చేస్తాయి. ఈ నేపథ్యంలో కొందరికి పులిపిర్లు ఏర్పడతాయి. ప్రతీ వందమందిలో కనీసం ఇరవై మందికి ఈ సమస్య ఉంటుంది. శరీరంలో ఎక్కడో ఒకచోట వస్తూ ఉంటాయి. పులిపిర్లను కత్తిరించటం, కాల్చటం వంటివి చేయకూడదు. ఇవి ఎక్కువగా రాపిడిగా ఉండే ప్రాంతాల్లోనే ఏర్పడతాయి.
  • వీటిని తగ్గించుకోవడానికి ఎక్కువగా సర్జరీలుచేయించుకుంటారు. సర్జరీ అంటే భయం ఉన్నవారు ఇంట్లోనే కొన్ని చిట్కాలు వాడితే సరిపోతుంది పులిపిర్లు వాటికవే రాలిపోతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం… చర్మ వ్యాధుల నివారణకు వెల్లులి మంచి ఔషదం. ఇందులో ఉండే ఎల్లిసిన్.. ఫంగస్, వైరస్ వంటి బ్యాక్టీరియాలతో పోరాడుతుంది. అలాగే పులిపిర్లను తొలగించడంలోనూ ఇది అత్యుత్తమంగా పనిచేస్తుంది. ఇందుకు వెల్లులి ముద్దగా చేసుకుని పులిపిర్లు ఉన్నచోట రాస్తే చాలు. ఇలా కనీసం రెండు మూడు వారాలపాటు చేయాలి.
  • అరటి పండు తొక్కలో ఉండే ఎంజైమ్‌లు చర్మానికి మేలు చేస్తాయి. అరటి పండు తొక్కతో రోజు పులిపిర్లపై రుద్దితే అది క్రమేనా కనుమరుగు అవుతుంది. కలబందలో ఉండే మేలిక్ యాసిడ్ పులిపిర్లలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఇందుకు మీరు కలబంద ఆకు మధ్యలో ఉండే జిగురును తీసుకుని పులిపిర్లపై రాస్తే చాలు. ఉల్లిపాయను సగానికి కోసి మధ్యభాగాన్ని చెంచాతో తొలగించి సముద్రపు ఉప్పుతో నింపాలి. కొంతసేపటికి ఉప్పు, ఉల్లిరసం కలిసిపోయి ఒక ద్రవ పదార్థంగా తయారవుతుంది. దీనిని తీసి జాగ్రత్త చేసుకుని 30 రోజులపాటు పులిపిరులపైన ప్రయోగిస్తుంటే గుణం కనిపిస్తుంది. ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మొండి మొటిమలు, పులిపిర్లు నయం చేస్తుంది.
  • లేదా ఉల్లిపాయ ముక్కలును మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ వడకట్టి ఆ ఉల్లిరసాన్ని తీసుకోవాలి. ఇందులో అరటేబుల్ స్పూన్ కొబ్బరినూనె కలపండి. బాగా కలిపండి. కొబ్బరినూనె జుట్టుకు మాత్రమే కాకుండా చర్మసమస్యలకు చాలా బాగా పనిచేస్తుంది. ఒక దూది ఉండ లేదా కాడన్ బడ్ తో  ఈ ద్రవాన్ని తీసుకుని పులిపిరిపై రాయండి. ఇలా రెండు మూడు సార్లు రాయాలి. దానిపైన ప్లాస్టర్ లేదా బ్యాండేజ్ వేసి రాత్రంతా వదిలేయాలి. మూడు లేదా వారంరోజుల వలకూ ఇలా రాస్తే పులిపిర్లు వాటంతట అవే పోతాయి.
  • పులిపిరులకు ఔషధంగా ఆముదం చక్కగా పనిచేస్తుంది. ఒక చుక్క ఆముదాన్ని పులిపిరి పైన వేసి స్టికింగ్ టేప్ అతికించాలి. ఇలా రెండు పూటలా మూడు వారాలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఉత్తరేణి మొక్కను కాల్చగా వచ్చిన బూడిదను తులసి ఆకులతోగానీ లేదా మణిశిల అనే ఆయుర్వేద ఖనిజ పదార్థంతో గానీ కలిపి నూరి ఆవనూనె చేర్చి పులిపిరులపైన ప్రయోగించాలి.
  • కొత్త సున్నాన్ని పులిపిరులపైన ప్రయోగిస్తే రాలి పడిపోతాయి. అల్లం ముక్కను వాడిగా చెక్కి కొత్త సున్నంలో ముంచి పులిపిరికాయలపైన రాయాలి. అయితే ఇది చేసేటప్పుడు సున్నం చుట్టుప్రక్కల చర్మానికి తగలకుండా జాగ్రత్త పడాలి. సున్నం మామూలు చర్మానికి తగిలితే బొబ్బలు తయారవుతాయి.
  • పులిపిర్ల చికిత్సలో విటమిన్ల పాత్ర కూడా ముఖ్యమైనదే. విటమిన్-ఎ, విటమిన్-సిలను పైపూతగా ప్రయోగిస్తే పులిపిరికాయలు తగ్గే అవకాశం ఉంది. చేప నూనె, క్యారెట్ మొదలైన వాటిలో విటమిన్ -ఎకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉసిరికాయలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటిని నలగ్గొట్టి గుజ్జుగా చేసి ఒకటి రెండు నెలలపాటు ప్రతిరోజూ పులిపిర్ల మీద పూతగా లేపనం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
  • యాపిల్ సిడర్ వెనిగర్లో అధిక యాసిడ్ కంటెంట్ ఉంటుంది. దీనివల్ల పులిపిర్లు మరింత పెరగకుండా సహజ సిద్ధంగా తగ్గిపోతాయి. దూదిని యాపిల్ సిడర్ వెనిగర్‌లో ముంచి పులిపుర్లు ఉన్నచోట అద్దితే చాలు. వారంలో కనీసం ఐదు రోజులు ఇలా పూర్తిగా మాయమవుతాయి.తాజాగా ఉండే పైనాపిల్ ముక్కలను పులిపిరికాయల మీద అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోజులో రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల త్వరగా ఫలితం ఉంటుంది

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,600,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR