మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని తప్పకుండ పాటించాల్సిన ఆచారాలు ఉంటాయి. అయితే అందులో చాలా మంది తీర్థం సేవించాక చేతిని తలకి రాసుకుంటారు. మరి ఇది ఆచారంలో భాగమేనా? అసలు ఇలా చేయాలనీ శాస్ర్తాల్లో ఉందా? దీనికి వెనుక ఉన్న అసలు కారణం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మనం గుడి బయట చెప్పులు బయట పెట్టి కాళ్ళని నీటితో శుభ్రం చేసుకొని గుడిలోకి ప్రవేశిస్తాము. ఇక గర్భగుడిలోని దేవుడి దర్శనానికి ముందు ప్రదిక్షణలు చేసి ఆ తరువాత మనసులోని కోరికలు కోరుకుంటూ గర్భగుడిలోని దేవుడిని మొక్కుకుంటాము.ఇక దైవ దర్శనం అనంతరం పూజారి హారతి ఇచ్చాక స్వామివారి తీర్థం ప్రసాదం ఇస్తాడు. మనం తీర్థం తీసుకోవటానికి చేతిని గోకర్ణ భంగిమలో ఉంచి తీసుకుంటాము. ఆ తరువాత మనకి తెలియకుండానే మనం ఆ చేతిని తలపై రాసుకుంటాము. ఇలా చేయడం సరికాదని చెబుతున్నారు.ఇలా చేయవద్దని ఎందుకు అంటున్నారు అంటే, తీర్థం అనేది పంచామృతం తో చేస్తారు. అందులో ఉండే తేనే, పంచదార వంటివి జుట్టుకి మంచివి కావు. అంతేకాకుండా తులసి తీర్థం తులసి తీర్థం తీసుకున్నా కూడా తలపై రాసుకోకూడదు. ఎందుకంటే తీర్థం తీసుకోవడం వల్ల చేయి ఎంగిలవుతుంది. ఎంగిలి చేతిని తలపైన రాసుకోకూడదు.వైష్ణవ సంప్రదాయంలో మాత్రం గంగా జలంతో అభిషేకం చేసిన తీర్దాన్ని మాత్రమే తల వెనుక రాసుకోవాలి ఉంది. ఇక వేరే ఏ తీర్థం తీసుకున్న కూడా చేతిని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు.