This Brief Write Up About Best Friend Characters In Telugu Cinema Is A Must Read For Every Cinephile

Written By: చింతపల్లి శివ సంతోష్

శంకరాభరణం – శంకరశాస్త్రి, మాధవా(సోమయాజులు, అల్లు రామలింగయ్య)

1శంకరాభరణం శాస్త్రి గారు, వకీలు మాధవా ఇద్దరు మంచి స్నేహితులు. ఎవరూ కూడా శాస్త్రి గారిని నోరు తెరిచి మీరు అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పే ధైర్యం చేయలేరు.కానీ స్నేహితుడు అయిన మాధవా ఆ ధైర్యం చేయగలడు అంతే కాదు ఒప్పించగలడు కూడా. అందుకే తన స్నేహితుడు మాధవా అడగానే కన్నడ వారి సన్మాన కార్యక్రమానికి వెళ్ళాడు, పూటా గడవని రోజులు నడుస్తున్న సమయంలో మాధవా, తన కూతురికి తెచ్చిన పెళ్లి సంబంధాన్నీ కూడా కాదనలేకపోయాడు. మాధవ కూడా స్నేహితుడు అయిన శాస్త్రి అంటే నమ్మకం.అందుకే శాస్త్రి ఎవరో వైశ్యాతో సంబంధం పెట్టుకున్నాడు అని సమాజం నింద మోపిన తన స్నేహితుడు అలాంటి వాడు కాదని,దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందని నమ్మాడు,ఆర్ధం చేసుకున్నాడు, అంతే కాక తన స్నేహితుడి కోరిక మేరకు జైలు నుండి వైశ్యను విడుపిస్తాడు కూడా.

చలనచిత్రలాలో స్నేహితుల చిత్రాలు – చింతపల్లి శివ సంతోష్ స్నేహితులు ఇద్దరు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలో చెప్పే పాత్రలు అవి.

సాగర సంగమం – రఘు, బాలు(కమలహాసన్, శరత్ బాబు)

Sagara Sngamamఇద్దరు స్నేహితులు కళాకారులే. ఒకరికి సాహిత్యం అంటే,మరొకరికి నాట్యం అంటే ఇష్టం.కానీ ఇద్దరివి వేరువేరు కధలు.తనకి తెలిసిన వాళ్ళ కాలు పట్టుకుని బాలు కి ఉద్యోగం చూపిస్తూఉంటాడు రఘు.బాలు కి ఉద్యోగం చేయటం ఇష్టం లేకపోయినా తన స్నేహితుడ్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఉద్యోగం లో జాయిన్ అయ్యి వెంటనే మానేస్తూ ఉంటాడు.అయిన వాళ్లిద్దరి స్నేహం మాత్రం మారదు. బాలు తాను ప్రేమించిన అమ్మాయి కి ఇంతకు మునుపే పెళ్లి అయితే ఆ అమ్మాయిని తన భర్త తో పాటు పంపించేసిన తర్వాత తాగుడుకు అలవాటు పడితే, రఘు తన స్నేహితుడ్ని వేదిలేయలేదు గాక కన్న కొడుకుగా సాకడం లో ఒక తండ్రి ప్రేమ కన్పిస్తుంది. అందుకే కాబోలు చివరిలో బాలు,తన మిత్రుడు రఘు చేతిలోనే తన ప్రాణాన్ని వదులుతాడు. స్నేహితుడు అంటే ఒక స్నేహితుడిగానే కాదు,

చలనచిత్రలాలో స్నేహితుల చిత్రాలు – ఒక తండ్రి గా కూడా ఉండచ్చు అని, మనం పొందిన స్నేహానికి ఏమి ఇచ్చిన రుణం తిరుచుకోలేనిదను చెప్పే పాత్రలు అవి.

రాయలసీమ రామన్న చౌదరి – రామన్న – వెంకన్న(మోహన్ బాబు,చంద్రమోహన్)

Rayalaseemaరామన్న,వెంకన్న మంచి స్నేహితులు. రామన్న కు దేవుడు అంటే భయం గాని నమ్మకం గాని లేదు.వెంకన్న ఒక బ్రాహ్మణుడు. ఇద్దరివి వేరు వేరు సిద్దాంతాలు. అయిన ఇద్దరి స్నేహం ఎప్పుడు చెడలేదు. రామన్న దేవుడు ని ఎగతాళి చేస్తుంటే అడ్డుపడుతూ వద్దని వారిస్తూ తన స్నేహితుడు చేసే తప్పులను తప్పు అని చెప్పి అడ్డుపడుతూ ఉంటాడు.కానీ రామన్న వెంకన్న మాటను ఎప్పుడు వినలేదు.రామన్న చేసే తప్పులకు శిక్షను తన వేయమని దేవుని కోరుకుంటాడు గాని,రామన్న ను విడిచిపెట్టలేదు. రామన్న కు వెంకన్న అంటే ఎంత అభిమానం అంటే ,
తన కష్ట,దుఖః సుఖాలలో తోడు వున్నావు,ని మాట నేనె ఎప్పుడు వినలేదు అయిన నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు నువ్వు నాకు దేవుడి వి అని వెంకన్న ను అభిమానించాడు.

చలనచిత్రలాలో స్నేహితుల చిత్రాలు – స్నేహితుడు తప్పు చేస్తూ తప్పును సరి దిద్దాడానికి ప్రయత్నించాలి,లేదా తప్పు అని చెప్పాలి గాని స్నేహాన్ని వదులుకోకూడదని, అన్ని వేళలా తోడు ఉండే స్నేహితుడు దేవుడు కంటే గొప్ప వాడు అని చెప్పే పాత్రలు అవి.

స్నేహం కోసం – పెద్దయ్య,సింహాద్రి(చిరంజీవి, విజయకుమార్)

Sneham Kosamపెద్దయ్య,సింహాద్రి చిన్నప్పటి నుండి స్నేహితులు.పెద్దయ్య ధన వంతుల కుటుంబం, సింహాద్రి పేదరిక కుటుంబం.వాళ్లిద్దరి మధ్య యాజమాని, పనివాడు కన్న స్నేహ బంధమే ఎక్కువుగా ఉంటుంది. సింహాద్రి తన స్నేహితుడు కూతురు సంతోషంగా ఉండాలని ,చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తాడు గాను, స్నేహితుడు కూతురు కోసం నిజం చెప్పాడు. తన స్నేహితుడు సింహాద్రి,తన కోసం చేసిన ఉపకారానికి, పెద్దయ్య బదులుగా సింహాద్రి కొడుకు ను తన కొడుకుగా పెంచుతాడు. కానీ చివరికి సింహాద్రి చనిపోయిన మారుక్షణమే పెద్దయ్య కూడా తన ప్రాణాన్ని విడుస్తాడు.

చలనచిత్రలాలో స్నేహితుల చిత్రాలు – స్నేహం కోసం జీవితాన్ని, ప్రాణాన్ని వదులుకున్న పాత్రలు అవి.

మహర్షి – రిషి,రవి(మహేష్,నరేశ్)

Whatsapp Image 2020 11 13 At 12.27.55 Pmరిషి,రవి కాలేజ్ ఫ్రెండ్స్. ఇద్దరివి వేరు వేరు కలలు.ఇద్దరు వారి వారి కెరియర్ కోసం చదువుతారు. రవి కి రిషి పై నమ్మకం వాడు ఎలాగైనా వాడు అనుకున్నది సాధిస్తాడు అని. వాడి నమ్మకం ఎంత అంటే, exam paper లికేజ్ లో రిషిని కొంతమంది ఇరికిస్తే, రిషి కెరియర్ పాడు అవుతుంది అని,తన కెరియర్ ఏమి అవుతుంది అని ఆలోచించకుండా ఆ నింద తన పై వేసుకుని తన తండ్రి చావు కు తానే కారణం అవుతాడు అతి పెద్ద కంపెనీకి, ప్రపంచం లొనే ఎక్కువ జీతగాడి గా ఎదిగిన రిషికి తన స్నేహితులడు చేసిన సాయం వల్లే తాను ఈరోజు ఎలా వున్నా అని తెలుసుకుని, తన స్నేహితుడి వద్దకు వచ్చి తన స్నేహితుడి ఆశయాన్ని తన ఆశయం గా మార్చుకుని తన స్నేహితుడి ఆశయాన్ని తాను నెరవేర్చాడు. తన స్నేహితుడి పై నమ్మకం ఎలా ఉంటుందో,

చలనచిత్రలాలో స్నేహితుల చిత్రాలు – తనకు సాయం చేసిన స్నేహితుడి కోసం ఎంతవరకైన పోరాడాచ్చు అని చెప్పే పాత్రలు.

కలర్ ఫోటో – కృష్ణ,బాలా ఏసు(సుహాస్,హర్ష)

Color Photoఇద్దరి మతాలు వేరే, కానీ చిన్నప్పటి నుండి స్నేహితులు. కృష్ణ కి ఏసు పైన ఎంత నమ్మకం అంటే , తన ప్రేమకు పెట్టుకున్న నియమాన్ని దాటి తన ప్రేమ విషయాన్ని తన స్నేహితుడు అయిన ఏసు కు చెపుతాడు. తన స్నేహితుడు తన పై పెట్టిన నమ్మకాన్ని పోగొట్టొకోకుండా,తన స్నేహితుడు ప్రేమించిన అమ్మాయి కుటుంబం చాలా ప్రమాదకరమైన డి అయిన కృష్ణ ప్రేమకి సాయం చేస్తడు ఏసు. కాని తన స్నేహితుసు విషం తాగి చనిపోతే, శవాన్ని చూస్తే వచ్చే తన బలహీనతను బలంగా మార్చుకుని తన స్నేహితుడి శవాన్ని ఇంటి వరకు తీసుకువెళ్లి, అక్కడ నుండి అంతిమ సంష్కారాలకు తీసుకుపోతుండుగా అడ్డుపడిన వరుణ దేవుడ్ని సైతం తిడతాడు బాలాయేసు.

చలనచిత్రలాలో స్నేహితుల చిత్రాలు – చిన్నప్పుడు మొదలైన కాటి వరకు స్నేహాన్ని సాగించిన పాత్రలు అవి.

జీవితం లో స్నేహం దొరికినవాళ్ళు చాలా మంది ఉంటారు, స్నేహాన్ని జీవితంగా మలుచుకున్నా వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారిస్తూ……

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR