పెద్దలకు చేసే శ్రాద్ధ కర్మలకు ఈ రోజు ఎందుకంత ప్రత్యేకం

భాద్రపదమాస శుద్ధ పూర్ణిమ పితృపక్షం మొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలకు పూజలకు నిర్వహిస్తారు. పితృ దోషం అంటే అది ఒక శాపం అని గమనించాలి. గత జన్మలో ఎవరైనా పెద్దవారికి కానీ, తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే అలాంటి వ్యక్తికి అనారోగ్య సమస్యలు, కష్టాలు కలుగుతూ ఉంటే అందుకు కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమని కూడా నమ్ముతారు. వారు చేసిన కొన్ని దోషాల వల్ల వారి తర్వాత తరాల వారు కష్టాలపాలవ్వడం, పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది.

1 Rahasyavaani 380పితృ పక్షం రోజుల్లో శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా తెలుసుకోవచ్చు.

->పాడ్యమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది.

->ద్వితీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల రాజయోగం, సంపద లభిస్తుంది.->తృతీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు.

->చతుర్దినాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది, అంతే కాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలరు.

->పంచమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వాళ్ళ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పుత్రకామన గలవారికి ఫలం లభిస్తుంది.

->షష్ఠి నాడు శ్రాద్ధ కర్మ వల్ల మన పూర్వికులు, దేవతలు ప్రసన్నులవుతారు, ఆ వ్యక్తికి సమాజంలో గౌరవం లభిస్తుంది.

శ్రాద్ధ కర్మల->సప్తమి నాడు శ్రాద్ధ కర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది.

->అష్టమి తిథినాడు శ్రాద్ధ కర్మ వల్ల చేస్తే సంపూర్ణ సమృద్ధి, బుద్ధి ప్రాప్తిస్తాయి.

->నవమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే విస్తారంగా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది.

->దశమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ది చెందుతుంది.

->ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే సర్వ శ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది, అన్ని పాపాలు నశిస్తాయి, వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది, కుటుంబం వృద్ది చెందుతుంది.

->ద్వాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. శ్రాద్ధ కర్తకు అన్నానికి లోటుండదు, అలాగే పుత్ర, పశు వృద్ధి, జయం కలుగుతుంది.

-> త్రయోదశి నాడు శ్రద్ధ కర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం, బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి.

-> చతుర్దశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది.

-> అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయని ప్రతీతి.

శ్రాద్ధ కర్మలపక్షం రోజుల్లో శ్రాద్ధకర్మ నిర్వర్తించటం వలన మన పూర్వికులకు తృప్తి కలుగుతుంది. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
591,000FollowersFollow
1,320,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR