This Fan Note About Nolan Movies Explain The Actual Philosophy In His Movies

Contributed by: Swaroop Thotada

Christopher Nolan చిత్రాల్లోని loops గురించీ loopholes గురించీ చర్చ విస్తారంగానే జరిగింది. బుర్రపెట్టి ఆలోచిస్తూ సినిమా చూడటంలో ఎంత మజా ఉందో అనేక blockbuster సినిమాలతో నిరూపించిన ప్రతిభ ఆయనది. ఐతే అదే మరో సారి ప్రస్తావించే ఉద్దేశం నాకు లేదు కానీ, నాకు దానికంటే ఎక్కువ ఆసక్తి కలిగించిన విషయం ఆయన అన్ని సినిమాల్లో ఒకటుంది. Pessimistic world building.

1 Christopher Nolanనోలన్ కథలు ఎప్పుడూ ఒక bleak ప్రపంచంలోనే చోటు చేసుకుంటాయి. ప్రతిసారీ ఏదో ఒక looming threat ఉంటుంది.
Insomnia లో Al Pacino పొగ మంచులో ఒక నేరస్తుణ్ణి తరుముతూ అనుకోకుండా మరో police ఆఫీసర్ ని కాల్చి చంపేస్తాడు. ఆ హత్య తాలూకు ఇన్వెస్టిగేషన్ మొదలై క్రమక్రమంగా అతనికి ఉరిలా బిగుసుకుంటుంది. అతని ప్రపంచం రోజురోజుకీ ఇరుగ్గా మారిపోతూ నిద్ర కరువైపోతుంటే నిరంతరం కిటికీల్లోంచి చొచ్చుకొచ్చే పగటి వెలుగు (అలస్కాలో రోజుల తరబడి పగలే ఉంటుంది) అతన్ని అసలు నిద్రపోనీయకుండా చేస్తుంది.

2 Christopher NolanMemento లో Guy Pearce పాత్రకైతే సినిమా మొదలయ్యే సరికే ప్రపంచం విచ్చిన్నం అయిపోయి ఉంటుంది. అతను అప్పటికే తన ప్రేయసిని, గతాన్ని, జీవితాన్ని పోగొట్టుకొని ఉంటాడు. నిమిషాల వ్యవధిలో అన్నీ మర్చిపోయే పరిస్థితి లో అతను ముక్కలుగా పగిలిపోయిన గతాన్ని అతికించేందుకు వ్యర్ధ ప్రయత్నం చేస్తాడు.

3 Christopher NolanInception లో డికాప్రియో పాత్ర తన భార్యను హత్య చేశాడన్న అభియోగంతో fugitive గా జీవిస్తూ ఎప్పటికీ తన పిల్లల్ని చూడలేని పరిస్థితిలో ఉండగా అతని జీవితాన్ని కాపాడుకునే ఒకే ఒక్క ఆఖరి అవకాశం అతని తలుపు తడుతుంది. Interstellar లో భూమి మీద వనరులన్నీ అయిపోయి మనుషులందరూ ఆకలిచావు చచ్చే దుస్థితిలో ప్రపంచం కనబడుతుంది. నిరంతరం దూళి తుఫానులు ప్రజల జీవనాన్ని ఆటంకపరుస్తూ ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తుచేస్తూ ఉంటాయి.

4 Christopher Nolanఅతను తీసిన Batman సిరీస్ లో Gotham నగరం ఒక నేరాల పుట్ట. ఎప్పుడు చూసిన ఏదో ఒక అసాంఘిక శక్తి అలజడులు సృష్టించే ఒక chaotic wasteland. మూడు సినిమాల్లోనూ ప్రతినాయకుల చేతిలో దాదాపు తుడిచిపెట్టబడే ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది Gotham.

5 Christopher Nolanఎప్పుడూ కూలిపోయే అంచులో పగుళ్లు తీసిన ప్రపంచంలోనే Nolan తన కథల్ని ఎందుకు చెప్తున్నాడా అన్న ప్రశ్న నాకు ఎప్పుడూ కలుగుతుంది. సెకండ్ యాక్ట్ లో conflict వచ్చాక ఏ సినిమా అయినా crisis లోనే పడుతుంది. ఇక్కడ pessimistic ప్రపంచం అన్నది అందుక్కాదు. జీవితాన్ని, ప్రపంచాన్ని, నోలన్ ఎలా చూస్తున్నాడో అతని చిత్రాలు మనకు చెబుతాయి.

6 Christopher NolanThe Dark Knight చిత్రంలో జోకర్ మనుషుల్లో లోపల దాగున్న మృగాల్ని విజయవంతంగా బైటికి తీసుకొస్తూ సమాజంలోని మనుషుల ముసుగులు తీసేస్తూ decency యొక్క మనుగడనే ప్రస్నార్ధకం చేసేస్తూ ఉంటే అతన్ని ఆపడానికి ఒక మోసపూరితమైన అబద్దం అవసరం అవుతుంది. “Sometimes the truth is not good enough” అని Batman నిందను తన మీద వేసుకుని ఒక scapegoat ఐతే తప్ప అగ్ని చల్లారదు. న్యాయాన్ని గెలిపించడానికి త్యాగాలు కావాలి కానీ రాక్షసత్వం తాండవించేందుకు ఎలాంటి ప్రయత్నమూ అవసరం లేదు, కేవలం సమాజం ఏ hipocrisy కిందైతే శతాబ్దాలుగా మూలుగుతుందో ఆ ముసుగును తొలగిస్తే చాలు. ఎందుకంటే పిడిగుద్దులతో ఒకదాన్ని ఒకటి చంపుకునే చింపాంజీల వారసులు నిర్మించిన నాగరికత ఇది. ఇక్కడ విచ్చిన్నం సాధారణం. Chaos వాస్తవం. న్యాయం ఒక fabrication. జీవితాన్ని పణంగా పెట్టేంత సంకల్పం, మొండితనం ఉంటే తప్ప పిడికెడంత న్యాయం కూడా జరగదని అర్ధం చేసుకున్న దర్శకుడి worldview మనకు కనబడుతుంది. “I am an extraordinary pessimist” అంటాడు Nolan ఒక ఇంటర్వ్యూ లో

7 Christopher Nolanఐతే ఈయనవి కేవలం pessimistic lamentations కావు. మంచిని గెలిపించడానికి మనిషి చేసే త్యాగాల్ని, చిందించే రక్తాన్ని కీర్తించే inspirational stories. ఇంత స్వచ్చమైన pessimistic ప్రపంచంలోనే “triumph of the human spirit” పురుడు పోసుకునేది మరి. The Dark Knight Rises లో Bruce Wayne ని వెన్ను విరిచి Bane ఒక నూతిలో పడేసినప్పుడు Wayne మళ్లీ అక్కడే తన శరీరాన్ని సరిచేసుకుని, ఆత్మను కట్టుకుని, చిత్తాన్ని మళ్లీ బ్రతికించుకొని ఆ భయంకరమైన చెరసాల నుండి బయటకు వచ్చి చెరపట్టబడ్డ తన నగరాన్ని కాపాడుకుంటాడు. ఆ చిత్రంలో Bane రాక్షసత్వంపై మనుషుల సంఘటిత ఐకమత్యం, అపూర్వమైన త్యాగం గెలుస్తాయి.

8 Christopher NolanInterstellar లో మానవ జాతి ఉనికే ప్రస్నార్ధకమైనప్పుడు వారిని కాపాడేది ప్రేమ మాత్రమే అంటాడు. “Love is the one thing we’re capable of perceiving that transcends time and space” అంటుంది ఒక పాత్ర. ఆ తండ్రీ కూతుళ్ళ ప్రేమ ఏర్పరచిన ఒక అనిర్వచనీయమైన connection మాత్రమే time and space పరిధుల్ని సైతం తోసిరాజని ప్రపంచాన్ని కాపాడుతుంది ఈ సినిమాలో.

9 Christopher NolanNolan కి ప్రపంచంపై ఎంత నిరాశావాద అభిప్రాయం ఉందో అదే స్థాయిలో మనిషి సంకల్పంపై నమ్మకం ఉంది. దాన్ని ఆయన చిత్రాల్లో రగిలిస్తాడు, కీర్తిస్తాడు. మానవ ప్రయత్నానికి ఉన్న redemptive power మీద తనకున్న విశ్వాసాన్ని ఆయన చిత్రాలన్నీ చూపిస్తాయి.

10 Christopher Nolan“Why do we fall Bruce? “
“So that we can learn to pick ourselves up”
ఆయన్ని ఆయనే పెస్సిమిస్ట్ అని అనుకోవచ్చు కానీ, his films beg to differ.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR