This Guy’s Musings On Meeting His Lost Love After 3 Years Is A Lovely Read

Contributed By: Harsha Vardhan Sadhanala

చాలా రోజుల తరువాత Vizag వచ్చాను..Friend పెళ్ళి,బాగా బలవంత పెట్టేసరికి రాక
తప్పలేదు. పెళ్ళి అవుతుండగానే బయటకి వచ్చేసాను..ఉండాలి అనిపించలేదు Car లో అలా
drive చేస్తూ వెలుతుండగా అప్పుడే అమ్మ call చేసి, ప్రతీ సంవత్సరం భద్రాచలం
లోని రాములవారి కళ్యాణానికి వెళ్ళేవాళ్ళం కొన్ని ఏళ్ళ నుంచి కుదరట్లేదు, రేపే
కళ్యాణం వెళ్తే అంతా మంచే జరుగుతుంది వెళ్ళమని ఎన్నిసార్లు
చెప్పానురా…చూస్తాలే అమ్మ అన్నా…అయినా మీ friend బలవంతం మీద పెళ్ళికి
వెళ్ళావ్, నేను చెప్తే గుడికి వెళ్ళవా! సరేలేరా నీ ఇష్టం అయినా
రాసిపెట్టివుంటే ఆ దేవుడే రప్పించుకుంటాడులే అని phone పెట్టేసింది అమ్మ. అది
నేను సరిగ్గా విననేలేదు ఎందుకంటే నేను ఇంకేదో ఆలోచిస్తున్నాను..Vizag ని The
City of Destiny అంటారు..నిజమే ఈ place కి ఆ tag చాలా apt అనిపిస్తుంది నాకు.

Drive చేస్తూ అలా Rushikonda Beach road మీద వెళుతున్నా..Sunset కనిపిస్తుంది
ఈరోజు పౌర్ణమి అనుకుంటా దూరంనుంచి చూడడానికి ప్రశాంతంగా ఉన్నా సముద్రంలో
కెరటాల హోరు మాత్రం గట్టిగానే వినిపిస్తుంది అచ్చం నాలాగే బయటకి బాగానే ఉన్నా
లోపల ఎదో తెలియని అలజడి..వాటిని చూస్తూ అలా ముందుకు వెళ్తూ…ఇక్కడ చాలా
గుర్తులున్నాయి కానీ గుర్తుచేసుకోవాలి అని అనుకోవడంలేదంతే…ఆగాలని ఉంది కానీ
ఆగదలచుకోలేదు అని నాలో నేనే అనుకుంటుండగానే నా car ఎందుకో అక్కడే ఆగిపోయింది
నేను ఇక్కడ దిగేవరకూ కదలను అన్నట్టు Car దిగగానే sudden గా నాపైన ఎక్కడి నుంచి
వచ్చిందో ఒక చున్నీ నా మొహం మీద వచ్చిపడింది అక్కడ ఎవరూ కనిపించలేదు ఎదో
గాలికి వచ్చి ఉంటుంది అని అలానే వదిలేసాను కానీ ఏవో memories అలా flash
అవుతున్నాయి car deck open చేసి చూసా ఏమీ తెలియలేదు beach వైపు చూసా ఇంక
ఆగాలి అనిపించలేదు నడుచుకుంటూ beach కి వెళ్ళాను అలా నడుస్తూ ముందుకు
వెళ్తుంటే చిన్న పిల్లలు ఇసుక మీద ఎదో రాస్తూ కనిపించారు…అది చూడగానే నా
మొహం మీద చిన్న చిరునవ్వు.ఇంకా ముందుకొచ్చి తీరం వెంబడి అలా నడుస్తూ…కొన్ని
places చాలా special ఉంటాయి ఎందుకంటే వాటితో మన Memories చాలా attach అయి
ఉంటాయి నాకు ఈ place అలాంటిదే.

చల్లగా నాపై వీస్తున్న ఆ గాలి నాకు తన స్పర్శని.. నా పక్కనే ఉన్న సముద్రం తన
మనసులో ఉన్న లోతైన భావాలని గుర్తుచేసింది..ఒక్కో అల నా కాళ్ళను అలా తాకుతూ
నాకు ఒక్కో జ్ఞాపకాన్ని గుర్తుచేస్తున్నాయి..మూడేళ్ళ క్రితం నేను మొదటిసారి
Vizag వచ్చాను ఇక్కడ job వచ్చింది నాకు beach నచ్చింది,ఒక్కడినే
వస్తుండేవాడిని… అలా ఒకరోజు ఎప్పటిలాగానే beach లో ఒక చోట కూర్చుని ఎదో
ఆలోచిస్తున్న… ఒక్కసారే నా మొహం మీద ఒక చున్నీ పడింది దాన్ని తీసి ఎవరిదా
అని చూసేలోపే నీళ్ళ దగ్గర పిల్లలతో ఆడుతూ ఒక అమ్మాయి కనిపించింది తనదే అని
అర్థమై ఇద్దాం అని నేను లేచేలోపు తనే వచ్చింది,నిజంగా చెప్పాలంటే genuine గా
ఉండే happy faces చాలా తక్కువ కనిపిస్తాయి మనకి, తను మాత్రం full of life లా
అనిపించింది. పేరు అడుగుదాం అనుకునేలోపే thanks చెప్పి ఒక చిన్న smile ఇచ్చి
వెళ్ళిపోయింది.

నేను అక్కడే నిలుచున్నా తను ఆ పిల్లలతో కలిసి ఆడుతు వెళ్ళేముందు ఇసుక మీద
ఏదో రాసి వెళింది నీళ్ళకి దగ్గరే ఉండడంతో అది ఇంకో అల వచ్చి చెరిగిపోయేలోపే
నేను వెళ్లి చూసేసరికి అక్కడ తను జానకి అని రాసింది, అదే తన పేరు అని
అర్థమైంది..తను beach లో ఎక్కువ కనిపించేది తరువాత కొన్ని రోజులకే అనుకోకుండా
మాట్లాడాను..ముందు మాట్లాడడానికి పట్టిన సమయం అర్ధం చేసుకోవడానికి పట్టలేదు
ఎందుకంటే తనకి అచ్చం నాలాంటి ఆలోచనలే ఉన్నాయి అని అర్థమైంది నాకు అలా అని
ఒక్కసారే కలిగిన feeling కాదు ఇలానే సాయంత్రం తనతో ఇక్కడే అలా తనని చూస్తూ
చూస్తూ…తనతో మాట్లాడుతూ…మాట్లాడుతూ… ఇలానే నడుస్తూ నడుస్తూ… అలా చాలా
సాయంత్రాలు, ఇంకెన్నో ఉదయాలు… గంటలు నిముషాల్లా రోజులు గంటల్లా గడిచిపోయాయి,
అదేంటో తను వెళ్ళేప్పుడు వెళ్ళొస్తా అని లేదా ఇంక వెళ్దాం అని కానీ అనాలి
అనిపించేది కాదు మళ్ళీ రేపు కలుస్తాము అని తెలిసినా కూడా..! కొంతమందితో
ఎక్కువసేపు గడపలేము కానీ మనకి అనిపిస్తుంది కదా జీవితాంతం ఎవరితో అయినా ఉండాలి
అంటే అది ఎవరు అని అది ఖచ్చితంగా తనే అనిపించింది నాకు.! మేము propose
చేసుకోలేదు కానీ మా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికున్న ఆ feeling తెలుసు.

Marriage కి proposal మాత్రం ఒక రోజు అలా beach లో అనుకోకుండా చేసుకున్నాం,
తను నేను మా ఇంట్లో చెప్తాను ఎలా అయినా ఒప్పుకున్నాకే మనం పెళ్ళి చేసుకుందాం
ఎంత time పడుతుందో చెప్పలేను, నువ్వు నాకోసం wait చేస్తావ్ కదా చెప్పు అని
అడిగింది. నేను ఎంతకాలం అయినా నీకోసం ఎదురుచూస్తాను, నీ మీద నాకు నమ్మకం ఉంది
మా ఇంట్లో కూడా చెప్తాను అని చెప్పాను. జానకితో నేను చివరిసారి మాట్లాడింది
అప్పుడే.

ఇంక తరువాత అసలు కలవలేదు తనూ కనిపించలేదు రోజూ అదే beach కి వెళ్ళి ఒక్కడినే
అలా ఆలోచిస్తూ ఉండేవాడిని… అసలేమైందో అర్ధమయ్యేది కాదు
కొన్ని రోజులకి తను U.S వెళ్ళింది అని, అక్కడే ఉన్న వాళ్ళ బావతో పెళ్ళి fix
అవ్వొచ్చు అని తెలిసింది. అయినా ఎందుకో నాకు తన మీద నమ్మకం మాత్రం పోలేదు కానీ
నాకు తనే ఆలోచనైపోయింది నాలోనే ఏవో ప్రశ్నలు, నాతో నాకే..ఇక్కడే ఉంటే అవే
ఆలోచనలు అని job వదిలేసాను Vizag నుంచి Hyderabad వచ్చేసాను కాని ఎంత
దూరం వెళ్ళినా కొన్ని ప్రశ్నలు సమాధానం దొరికే వరకు మనతోనే వుంటాయి…
కుదిరినపుడల్లా గుర్తుచేస్తూ… వీలైనపుడల్లా మనల్ని ప్రశ్నిస్తూ నాకు
అలానే వుంది … అమ్మా నాన్నలకి

విషయం చెప్పాను… సరే కానీ మళ్ళీ తిరిగొస్తుందా ఈరోజుల్లో ఇట్టే
మారిపోతున్నారు వాళ్ళ బావ నీకన్నా better stage లో ఉంటే..ఆలోచించరా అన్నారు..
!! తను అలా కాదు నాకు నమ్మకం ఉంది అంతకుమించి ప్రేమ ఉంది అది నన్ను
ఎన్నిరోజులైనా వేచిచూసేలా చేస్తుంది అని వాళ్ళదగ్గర అన్నాను.

ఏమో అయినా అక్కడ తను ఏ situation లో ఉందో అనుకుని నాకు నేనే
సర్దిచెప్పుకునేవాడిని… ఏ పని చేయలేకపోతున్న… తన ఆలోచనలనుంచే కాదు నా room
నుంచి బయటకి రావడం కూడా మానేసాను… సమయం నాకు మాత్రం అస్సలు కదలనట్టు
ఆగిపోయినా నిజానికి చాలా తొందరగా గడిచిపోతుంది. నన్నిలా చూసి నేను ఏమైపోతానో,
నా career ఏమైపోతుందో అని అమ్మా నాన్న బాధపడటం చూసాక నేను ఇలా ఉండటం correct
కాదు అని అనిపించింది..ఇదే ఆలోచనలలో ఉంటే ఇంకేం చేయలేను కానీ కష్టం అయినా
నన్ను నేనే control చేసుకుంటూ నా బాధని, ఆలోచనలనీ నాలోనే దాచేసాను. వేరే job
లో join అయ్యాను, పెళ్ళి ఎవరిదైనాకానీ వెళ్ళడం మానేసా…బయటకి చూడడానికి బానే
ఉన్నా లోపల మాత్రం నేను పడే బాధ నా ఒక్కడికే తెలుసు అయినా తను తిరిగొస్తుంది
అన్న ఆశే నన్ను ముందుకు నడిపిస్తుందంతే. సరిగ్గా అప్పుడే పడుతున్న వర్షం
చినుకులు నన్ను మళ్ళీ గతంలోనుంచి బయటకు తీసుకొచ్చాయి… చీకటిపడింది…
నడుస్తూ చాలానే దూరం వచ్చేసాను అలానే తడుస్తూ తిరిగి car దగ్గరకీ వచ్చి deck
close చేసి car లో కూర్చోగానే…నా phone ring అయ్యింది ఎత్తగానే..

“Hello రామ్…ఎలా ఉన్నావ్!” అని ఒక voice బయట వర్షం తో పాటు నా గుండెలో వేగం
కుడా ఎక్కువైంది,అవును అది తనే మళ్ళీ ఇంత కాలం తరవాత నా పేరు తన నోట వినగానే
ఒక్కసారే నా మనసులో ఉన్న బాధంతా కళ్ళలోనుంచి బయటకు వచ్చినట్టు నా కళ్ళల్లో
నీళ్ళు తిరిగాయి, కానీ నోటివెంట మాట మాత్రం రాలేదు…కొంచెంసేపు నిశ్శబ్దం ఆ
చిన్న gap లోనే నాకు తను చెపుదామనుకున్న చాలా విషయాలు అర్థమవుతున్నాయి i can
feel it…తరవాత నువ్వెలా ఉన్నావ్ జానకి అని అడగగానే అడ్డంకులు చాలానే వచ్చాయి
కానీ వాటన్నిటినీ దాటాకే నీ దగ్గరకి వద్దాం అనుకున్నా, ఆరోజు మన గురించి
చెప్పగానే మా నాన్న నన్ను మా బావకిచ్చి చేయాలి అని చిన్నప్పుడే అనుకున్నారనీ,
నిన్ను మర్చిపోమని చెప్పి చాల పెద్ద గొడవ చేశారు. నన్ను ఇక్కడ ఉంచొద్దని..MS
చేస్తా అన్నావ్ కదా మీ మామయ్య వాళ్ళున్న U.S కి పంపిస్తాను అని చెప్పి నన్ను
అక్కడికి పంపించారు,అక్కడికి వెళ్ళాక కొన్ని రోజులకి మా బావకి జరిగిందంతా
చెప్పాను తనకి నా మీద ఎలాంటి feelings లేవు నన్ను అర్థంచేసుకున్నాడు ఈ పెళ్ళి
కచ్చితంగా జరగదు కొంచెం time తీస్కోని మా parents కి కూడా అర్థమయ్యేలా నేను
చెప్తాను అన్నాడు…మా బావ కూడా నన్ను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు అని
చెప్పినా కానీ నాన్న మన ప్రేమను ఒప్పుకోలేదు, నేను ఓపిక తో wait చేస్తూనే
ఉన్నాను..నేను తిరిగొచ్చాక చివరికి నన్ను అర్థంచేసుకున్నారు. నేను ఎప్పుడో
ఇచ్చిన మాట కోసమే చూసాను కానీ ఇప్పటి నీ సంతోషం గురించి ఆలోచించనేలేదు నీ
ఇష్టం తెలుసుకోలేదు అని బాధపడి..Finally మన ప్రేమని అర్థంచేసుకుని పెళ్ళికి
ఒప్పుకున్నారు,నిన్ను Vizag వచ్చాక కలవమన్నారు అంది తను ..!! అది వినగానే
నిజంగా నా ఆనందానికి అవధుల్లేవు..వర్షం ఇంకా ఎక్కువై Car glass wipers ON
అయ్యాయి… నువ్వు మనకోసం మీవాళ్ళతో ఓపిగ్గా యుద్ధం చేస్తే ఇక్కడ నాతో నేనే
యుద్ధం చేశాను చివరికి గెలుపు మన మధ్య ఉన్న ప్రేమదే…!! నిజంగా మన ప్రేమలో
నిజాయితీ ఉంటే అది ఎన్ని సముద్రాలవతల ఉన్నా ఏదో రోజు నీ చెంతకి చేరుతుందనే
నమ్మాను అదే నిజమైంది..!! నువెక్కడున్నావ్ ఇప్పుడు అని అడిగితే…భద్రాచలం
వచ్చాం రాములవారి కళ్యాణానికి అంది తను…నీ మాట విన్నాక నాకు మన మధ్య ఇంక
ఒక్క అడుగు దూరం కూడా నేను భరించలేను ఇప్పుడే భద్రాచలం బయల్దేరుతున్నా అని Car
start చేశాను వెంటనే start అయ్యింది… అప్పుడెందుకు ఆగిందో అర్థంకాలేదు,
ఇప్పుడు మళ్ళీ వెంటనే ఎలా start అయ్యిందో తెలియలేదు బహుశా ఈక్షణం
కోసమేనేమో…!!

ఈ విశాఖనగరం… సముద్రతీరం… ఎప్పటికీ మర్చిపోను…The City of Destiny అని
ఊరికే అనరుగా… మళ్ళీ ఇక్కడికి వస్తాను కానీ ఈసారి వట్టి రామ్ లా కాదు
“జానకీరామ్” లా తిరిగొస్తా అనుకుంటూ నా ప్రయాణం మొదలుపెట్టాను..!!

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,680,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR