This Guy’s Musings On Various Aspects Of Society Is A Chill & Thrill Read

1) Monochrome

క్రిమి మనుషులు

క్రిమినల్ సర్కారులు

Condom తొడిగిన మనసులు

Conditioned మెదడులు

కంపు మాటలు

Virtual మొహాలు

డొక్కు సిద్దాంతలు

Intellectual సన్నాసులు

మెట్రోపాలిటన్ నీరసపు కవిత్వాలు

Jesus లా శిలువైన కళ

2) Thus Never Spoke Zarathustra

దేహం అన్నాడు వాడు – దేశం అన్నాడు వీడు

ఆకలిన్నాడు వాడు – ఆజీర్తిన్నాడు వీడు

కరువు అన్నాడు వాడు – కరువే కదా అన్నాడు వీడు

అమ్మ అన్నాడు వాడు – అమ్మేద్దాం అన్నాడు వీడు

నాన్న అన్నాడు వాడు – నాకిపోని అన్నాడు వీడు

బిడ్డలు అన్నాడు వాడు – వలసపోండి అన్నాడు వీడు

భూమి అన్నాడు వాడు – ధనం అన్నాడు వీడు

భుజాలు అన్నాడు వాడు – మోయడానికే గా అన్నాడు వీడు

కిరాయి అన్నాడు వాడు – దొంగ లంబిడికోడకా అన్నాడు వీడు

దేవుడే దిక్కు అన్నాడు వాడు – దేవుడే దిక్కు అన్నాడు వీడు

అంతా పై వాడి దయే అన్నాడు వాడు – అంతా పై వాడి దయే అన్నాడు వీడు

ఇంతకీ వాడేవాడో – వీడేవాడో – ఆ పై వాడేవాడో…..

3) Don’t Spill The Beans

నలుపెక్కిన రాత్రి

మూసుకుపోయిన కిటికీలు

మాయమైపోయిన మనసులు

శిధిల శవాల శరీరాలు

చలనం లేని ఆకులు

ఆకలి శునకాలు

ఆనాధ నక్షత్రాలు

గంభీరమైన గోపురాలు

వీటన్నిటికి తోడు…………………

……………………………………..

4) The Democracy Hoax

ఏది స్వేచ్చ

ఏది బానిసత్వం

నీ స్వేచ్చ అగ్గిపుల్లంత

నీ బానిసత్వం అగ్గిపెట్టంత

కానీ మంట పెట్టేది మాత్రం సర్కార్ గాడే

5) చలం, ఇదే నా సవాలు కాస్కో

గంభీరమైన మెడ

గాజు సీసా లాంటి జాడ

యెర్రటి మట్టి చర్మం

Solar Eclipse పెదాలు

Rabindranath Tagore కావ్యాలని పోగు చేసుకున్నా నడుము

ఇదేంటి, ఇంకా చాలా – తనని వర్ణించడానికి చలం కూడా సరిపోడు

6) కి…కి…కి…కి…కి…కి…కి…కి…కి…కి…కి

ఎగిరివచ్చిన పావురాన్ని వద్దన్నాను

కదలలేని కాకిని హద్దుకున్నాను

తను రేయికి రమ్మంది

రాన్నాను. పొమ్మన్నాను.

మనసూర్యుడు రేపే సెగలు ఆపుకోలేకపోయా

వెళ్ళాను.

తన పై పావురం

కత్తి అందుకున్నాను

కాకి వద్దంది – నేన్నున్నాను అంది – హద్దుకుంది

తన నుంచి కిలోమీటర్ దూరం వచ్చిన, కానీ తన మంచం చేసే

“కి…కి…కి…కి…కి…కి…కి…కి…కి…కి…కి”

అనే శబ్దం వినిపిస్తూనే వుంది

7) Ideologies C/o గుమ్మం

గుమ్మం అవతల తను – గుమ్మం ఇవతల నేను

గుమ్మం అవతల తను – గుమ్మం ఇవతల నేను

గుమ్మం అవతల తను – గుమ్మం ఇవతల నేను

గుమ్మం అవతల తను – గుమ్మం ఇవతల నేను

గుమ్మం అవతల తను – గుమ్మం ఇవతల నేను

గుమ్మం అవతల తను – గుమ్మం ఇవతల నేను

గుమ్మం అవతల తను – గుమ్మం ఇవతల నేను

మరి గుమ్మంలో Capitalism, Communism, Fascism, Socialism, Jingoism, కులం, మతం నా బొంగు భోషాణం

8) The Great Rape Trick

చీకటంత తన చీరలో చిమ్ముకుంది

కొంగు అందుకున్నాను

వద్దంది…

మొగుడు అన్నాను నేను

మళ్ళా అంది…

మొగుడు అన్నాను నేను

మనసు అంది…

మొగుడు అన్నాను నేను

మనషివేనా అంది

ఇక బలాత్కారం షురూ…

9) Imbeciles గారడీ

మూర మల్లెపూలు దూరం ఆ ఇంటి గడపల మధ్య…

లక్ష్మీ ఆకాలంది – జాస్మీన్ ఆకాలంది

రాము లేచాడు – అక్బర్ లేచాడు

జిలేబి తెస్తా – కబాబ్ తెస్తా

బయలుదేరాడు – బయలుదేరాడు

“ప్రకృతి కాషాయం రంగు పూసుకునే సమయమైంది”

రాము తిరిగి రాలేదు – అక్బర్ తిరిగి రాలేదు

లక్ష్మీ కంగారూ పడింది – జాస్మీన్ కంగారూ పడింది

గుమ్మం దాటింది – గుమ్మం దాటింది

“లక్ష్మీ జాస్మీన్ కలిశారు”

కాస్త దూరంలో రెండు శరీరాలు గొడవపడుతునై – ఒకడు కన్ను సొట్టబోయిన రాము – ఇంకొకడు ముక్కు వంకరైన అక్బర్

లక్ష్మీ జాస్మీన్ వైపు చూసింది – జాస్మీన్ లక్ష్మీ వైపు చూసింది

ఎందుకు గొడవపడుతున్నారు?

తెలీదు – రాము మరియు అక్బర్

మరి ఎందుకు రక్తలు వచ్చేలా కొట్టుకుంటున్నారు?

కొట్టుకోమన్నారు కాబట్టి – అక్బర్ మరియు రాము

లక్ష్మీ కడుపుని తడిమింది – జాస్మీన్ కడుపుని తడిమింది

“ఎక్కడో ఆకలి కంపు కొడుతుంది”

మరి నా ఆకలి – లక్ష్మీ

మరి నా ఆకలి – జాస్మీన్

మరి మన ఆకలి – లక్ష్మీ మరియు జాస్మీన్

జై శ్రీ రామ్ – రాము

Allāhu ʾakbar – అక్బర్

ఆకాశం గంభీరంగా ఉరిమింది

భూమి వైరాగ్యంతో కదిలింది

10) She Is A Pain In The Ass, I Mean Was

There she is…

I don’t know how many years have passed between us…

Her cheeks gained fat, the nose lost its charm, she is no longer the woman I used to love…

But still she smells like the same, nothing has changed…

She smells like dry earth that has just been sprinkled with water…

Oh, man I miss those days – When I used to lay on her lap & write vulgar poems on her odour…

She hated it & then kicks me right in the chest…

But who cares, man…

We are there for each other cuddled up in the tiny spaces left by the books…

And then she used to tell me about all the men she loved, & desired… Then she stares at me and laughs like a monkey…

Oh, man the sound of her laugh, I miss it…

I goddamn miss it…

And here comes my favourite part, at nights she used to narrate erotic ghost stories, she narrates them like tragedies…

Oh, man she used to cry like hell while narrating them…

Then I take a look at her & think who on earth will narrate erotic ghost stories and cries over them all night…

Oh, man I miss those foolish nights…

I miss those tears, man…

So, There she is, I don’t know how many years have passed between us

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR