Written By: Dinakar
We’re the middle children of history, man. No purpose or place. We have no Great War. No Great Depression. Our great war is a spiritual war, Our great depression is our lives.
~David Fincher(Fight club).
తెల్లవాడు నాడు నిన్ను భగతసింగ్ అన్నాడు, నల్లవాడు నిన్ను నేడు నక్సలైట్ అన్నాడు.
~శ్రీరంగం శ్రీనివాస్ రావ్.
చంపనిదే బతకవని, బతికేందుకు చంపమని నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారేటని?
~సిరివెన్నెల.
రష్యన్ బోల్షివిక్ విప్లవం, క్యూబా తిరుగుబాటు, ఉత్తర-దక్షిణ వియత్నా యుద్ధాలు వీటికున్నంత ప్రచారం ఫాల్ ఆఫ్ ది సోవియట్ యూనియన్, పోలాండ్ కోల్డ్ వార్, బెంగాల్ నకల్స్బరి కాల్పులకి ఉన్నాయా..? గెలుపుకి సంబరాలు జరిపినపుడు ఓటమికి సంఘీభావం తెలపాల్సిన అవసరం లేదా? అంతటి విషాదానికి త్యాగం అనే ముసుగు కప్పి జెండాలు ఎగరవేయొచ్చా? శ్రీకాకుళం, ఆదిలాబాద్ అడవుల్లో ఎప్పుడో చచ్చిపోయిన కుర్రాళ్లు ఈ పండగకైనా ఇంటికొస్తారని ఎదురుచూసే గడపలు ఇంకా ఉన్నాయా? ఉంటే వాటికి లెనిన్ కి, స్టాలిన్ కి, మావోకి, సంబంధం ఏంటి? వీటన్నిటికీ కార్లమర్క్స్ “క్యాపిటల్” లో సమాధానాలు దొరుకుతాయా..? దేశకాల పరిస్థితులను బట్టి ఏ సిద్ధాంతాలైన రూపాలు మారుతూఉంటాయి కదా..? ప్రస్తుతం దేశంలో రెడ్ కారిడార్ నినాదం ఏంటి..? పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి మాట్లాడేవాళ్ళు కెన్నడి చావు గురించి ఎం చెప్తారు..? చేగువేరా, ఫిడల్ కాస్ట్రో, భగత్ సింగ్ లను సైద్ధాంతిక కోణంలో కాకుండా వ్యక్తిత్వకోణంలో చూడగలిగితే, తిరుగుబాటుకి తీవ్రవాదానికి ఉన్న అతిసూక్ష్మ బేధం తెలుసుకోవచ్చా..?
నాగరికత పాదం కదిపిన ప్రతీసారి శ్రమదోపిడికి నిర్వచనం మారుతూ ఉంటుంది.