శ్రీ కృష్ణాష్టమి అంటే ఏంటి? ఈ రోజుకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఎనిమిదొవ అవతారం శ్రీ కృష్ణావతారం. జగత్తులో ధర్మ క్షీణత కలిగినపుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు. ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణదశకు చేరుకోవడంతో శ్రీమహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడనీ పురాణాలు చెబుతున్నాయి. మరి శ్రీ కృష్ణాష్టమి అంటే ఏంటి? ఈ రోజుకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఈ పండుగ ఎలా జరుపుకుంటారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

krishnashtamiశ్రీకృష్ణావతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం. శ్రీముఖనామ సంవత్సర దక్షిణాయన వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాల్గవపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల పుత్రునిగా శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా కంసుడు వారిని బంధించిన చెరసాలలో జన్మించాడు.

 

krishnashtamiకృష్ణ జన్మాష్టమి అనగానే మనకు చిన్ని చిన్ని ముద్దుల మొహము కల యశోదనందనుడు కృష్ణుడు గుర్తు వచ్చేస్తాడు. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని అంటారు. శ్రీకృష్ణుడికి ఎనిమిది సంఖ్యకు దగ్గరి సంబంధం ఉంది. ఆయన పుట్టిన తిథి అష్టమి. దశావతారాల్లో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు. దేవకీ వసుదేవులకు అష్టమ గర్భం. ఆయనకు భార్యలు ఎనిమిదిమంది. కృష్ణుని జన్మనక్షత్రమైన రోహిణి నక్షత్ర క్రమంలో నాలుగవది. అంటే అష్టమ సంఖ్యలో సగం. పదహారు వేలమంది గోపికలు. పదహారు సంఖ్యను, ఎనిమిది సంఖ్యతో భాగించవచ్చును.

krishnashtamiఈ పండుగ రోజున ఆ చిన్ని క్రిష్ణయ్య బాల్య చేష్టలను తలచుకొని ప్రతి తల్లి మురిసిపోతుంది. పాపపుణ్యాలకి అతీతులైన బాలల్లో కనిపించే దివ్యత్వాన్ని వెల్లడి చేసే ఒక అరుదైన సందర్భం కృష్ణాష్టమి. ఈ పండుగ రోజున ఒంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్దలతో శ్రీ కృష్ణ నామ స్మరణ చేసినవారికి మోక్షం లభిస్తుందని పురాణాలూ చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ పండుగ రోజు ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలముతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజ పుస్తకాలను అందజేస్తే సకల సిద్దులు సిద్ధస్తాయని, ప్రతి ఒక్కరు భక్తి శ్రద్దలతో శ్రీకృష్ణా జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం ఇంకా కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది.

krishnashtamiకృష్ణాష్టమి రోజున కృష్ణుడు ఇంటికి వస్తున్నట్లుగా కృష్ణ పాదాలు చిత్రిస్తారు. ఇంకా ఆ చిన్ని క్రిష్ణయ్య బాల్య సంబంధం అయినా పర్వం కాబట్టి ఉట్ల మీద వెన్న, పెరుగు, పాలు దొంగిలించుట అనుకరించే, జ్జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతారు. అయితే గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి, ఆ చిన్ని క్రిష్ణయ్యకు పొన్న పూలంటే ఇష్టమని ఆ పూలతో పూజలు చేస్తారు. దీనినే పొంనమాను సేవ అని అంటారు.

krishnashtamiఇక చిన్న తనము నుండే అనేకమంది రాక్షసులను సంహరిస్తూ దుష్టశిక్షణ శిష్టరక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామములో అర్జునునకు రథసారధియై అర్జునిలో ఏర్పడిన అజ్నానందకారాన్ని తొలగించుటకు విశ్వరూపాన్నిచూపించి గీతను బోధించి, తద్వారా మానవాళికి జ్నానామృతాన్ని ప్రసాదించిన ఆ శ్రీకృష్ణభగవానుడి జన్మదినమైన శ్రీ కృష్ణాష్టమి పండుగ పర్వదినాన భక్తి శ్రద్దలతో పూజలు చేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR