Home Unknown facts దసరా కి 200 ఆలయాల్లో విగ్రహాలను ఒకే చోటుకి తీసుకువచ్చే అద్భుతం

దసరా కి 200 ఆలయాల్లో విగ్రహాలను ఒకే చోటుకి తీసుకువచ్చే అద్భుతం

0

ఒక లోయలో వెలసిన ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు అనేవి ఉన్నాయి. అయితే హిమాలయాల్లో నీరు గడ్డ కట్టే ప్రదేశంలో అతివేడి నీటి బుగ్గలు ఇక్కడ ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే దసరా అప్పుడు లోయలో ఉన్న రెందు వందల ఆలయాల్లోని విగ్రహమూర్తులని ఈ ప్రదేశానికి తీసుకువచ్చి పెద్ద ఉత్సవం చేస్తారు. మరి లోయలో వెలసిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ కొలువై ఉన్న ఆ అమ్మవారు ఎవరు? అక్కడ ఉన్న వేడి నీటి బుగ్గల విచిత్రం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Shiva Templeహిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, కులూ జిల్లా నుంచి 45 కి.మీ. దూరంలో కులూ లోయ దక్షిణ దిశలో మైదాన ప్రాంతాన్ని పార్వతి వ్యాలీగా పిలుస్తారు. ఈ ప్రదేశంలోనే పార్వతిదేవి కర్ణాభరణం పడిన స్థలంగా ప్రసిద్ధి చెందినది. అయితే ఈ దేవి కర్ణాభరణాన్ని సర్పరాజు తీసుకువెళితే మహాదేవుడు తిరిగి ఇవ్వమని అడిగాడు. అప్పుడు సర్పరాజు పాతాళం నుండి పైకి వచ్చి కర్ణాభరణాన్ని పరమేశ్వరునికి ఇచ్చాడు. అక్కడే ఒక జల ధార ఉంది. ఇక్కడే వేడినీటి బుగ్గ కూడా ఉంది.

బియ్యం ఒక పాత్రలో పోసి సరైన నీరు పోసి ఆ వేడి నీటి బుగ్గలో పెడితే 20 నిముషాల్లో అన్నం తయారువుతుంది. ప్రపంచంలో అనేక చోట్ల నీటి బుగ్గలు ఉన్నాయి కానీ అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన నీటి బుగ్గలు ఇక్కడే ఉన్నాయి. అయితే నీరు గడ్డ కట్టే ఈ ప్రదేశంలో పొగలు కక్కే అతి వేడి నీటి బుగ్గలు ఉండటం సృష్టి విచిత్రం అనే చెప్పాలి.

ఈ ప్రదేశంలో శివుడు దాదాపుగా రెండువేల సంవత్సరాలు తపస్సు చేసాడని ఇక్కడ  ప్రాంతంలోని స్థానికులు చెబుతారు. ఇక్కడ ఉన్న మరో విశేషం ఏంటంటే, పార్వతిలోయలో దసరా ఉత్సవాలు అనేవి గొప్పగా నిర్వహిస్తారు. అయితే దసరా ఉత్సవాలలో ఈ లోయల్లో ఉన్న సుమారు రెండువందల ఆలయాలలో ఉన్న విగ్రహాలన్నీ ఈ ధాల్ పూర్ మైదానానికి తీసుకురావడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో ముఖ్యంగా మనాలి నుంచి హిడింబా విగ్రహం తీసుకువచ్చిన మరుక్షణమే దసరా ఉత్సవాలు ప్రారంభిస్తారు.

ఇలా ఉత్సవం చేయడానికి కారణం ఏంటంటే, పూర్వం ఒక జంట కలసి ఒక బుట్టలో కొన్ని దేవతామూర్తుల విగ్రహాలతో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సందర్భంలో హఠాత్తుగా వారి చేతిలో ఉన్న బుట్టలో విగ్రహాలన్నీ గాలికి ఎగిరిపోయి కులూ, పార్వతి లోయలోని ఇతర ప్రదేశాలలో పడిపోయాయంటా. అందుకే దేవతలందరినీ దసరా పండుగ సందర్భంగా ఒకే చోటుకి చేర్చి ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు.

ఇలా ఎన్నో ప్రత్యేకతలు, వింతలు కలిగిన ఈ పార్వతి లోయని దర్శించుకోవడానికి భక్తులు  దసరా ఉత్సవాల సమయంలో అధికంగా తరలి వస్తుంటారు.

Exit mobile version