ఈ సూప్ తో చలికాలంలో ఎదురయ్యే సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

చలికాలం వస్తే సహజంగానే కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సీజన్‌లో జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గొంతునొప్పి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలకు సహజంగా లభించే పదార్థాలతో తయారుచేసే సూప్‌లతో మంచి పరిష్కారం లభిస్తుంది. వీటిని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు.

zingerబీట్‌రూట్, అల్లం సూప్‌తో శీతాకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు. శరీరంలో రక్తం, హిమోగ్లోబిన్ వృద్ధి చెందడానికి బీట్‌రూట్ తోడ్పడుతుంది. అల్లంలో సహజమైన యాంటీబయాటిక్‌ గుణాలు ఉంటాయి. అందుకే ఈ సీజన్‌లో చాలామంది అల్లం టీ తాగడానికి ఇష్టపడతారు. అల్లం టీ తాగేందుకు ఇష్టపడనివారు బీట్‌రూట్, అల్లం, ఇతర పదార్థాలు కలిపి చేసే సూప్ తీసుకోవచ్చు.

అల్లం సూప్ఈ సూప్‌ గుండెజబ్బుల ప్రమాదాలను దూరం చేస్తుంది. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరుస్తూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ నేచురల్ హెల్త్ డ్రింక్ అజీర్తిని దూరం చేసి, శరీరంలో పేరుకుపోయిన మలినాలు బయటకు పోయేలా చేస్తుంది. శీతాకాలంలో దీన్ని క్రమంతప్పకుండా తీసుకోవడంవల్ల సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా.

అల్లం సూప్ఒక కడాయి తీసుకొని దాంట్లో కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలను వేసి కాసేపు వేడి చేయాలి. ఉల్లిపాయ రంగు మారేంత వరకు వేయించవద్దు. ఆ తరువాత బీట్‌రూట్ ముక్కలు, అల్లం వేసి కలపాలి. దీంట్లో కాస్త ఉప్పు, మిరియాల పొడి వేసుకోవచ్చు. వీటిని మీడియం ఫ్లేమ్‌పై ఐదు నిమిషాల వరకు ఉడికించాలి. తరువాత వెజిటబుల్ స్టాక్‌ కూడా వేసి బాగా కలపాలి. దీనికి మూతపెట్టి, స్టవ్ సిమ్‌లో ఉంచి అరగంటసేపు మరగనివ్వాలి. బీట్‌రూట్ ముక్కలు మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి.

అల్లం సూప్ఆ తరువాత జీడిపప్పు వేసుకొని 15 నిమిషాలు వేడి చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. దీంట్లో నిమ్మరసం, పుదీనా వేసి కలపాలి. దీన్ని వేడిగా ఉన్నప్పుడే తీసుకుంటే రుచిగా ఉండటంతో పాటు అనారోగ్యాలను కూడా దూరం చేస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR