Home People 22 Thought Provoking Quotes Of Ambedkar That Prove Why He Is One...

22 Thought Provoking Quotes Of Ambedkar That Prove Why He Is One Of The Greatest Visionaries That Shaped India

0

చిన్నప్పుడు బడికి వెళ్తే మిగతా పిల్లలు మైలు పడతారు అని అతనిని దూరంగా ఒక మూలన కూర్చోపెడితే కసిగా చదువుకున్నాడు బాగా చదువుకొని ఫారిన్ నుంచి ఇండియా కి తిరిగి వస్తే అతని మేధస్సు చూడకుండా ఒక జట్కా బండి నుంచి తోసేసారు అంటరానివాడివి నువ్వు అంటూ. ముంబై కి వెళ్తే వేరే కులం పెరు చెప్పుకొని అద్దెకి దిగవాల్సి వచ్చింది అతడి అసలీ కులం తెలుస్కోని అక్కడినుంచి కూడా మెడ పట్టి వీధుల్లోకి గెంటేశారు అతని చదువుకి జ్ఞానంకి విలువ ఇవ్వకుండా….

గాంధీ: దళితుడు గుడికి ఎందుకు పోకూడదు, గుడి యే ఒక్కడిది కాదు అందరిదీ.
అంబెడ్కర్: అసలికి దళితుడు గుడికి ఎందుకు పోవాలి, బడికి పోవాలి పుస్తకం పట్టాలి గాని.

ఒకరిని మహాత్ముడు అంటూ కీర్తించింది మరొకరిని కేవలం దళిత నాయకుడు అంటూ ఈ దేశం ముద్ర వేసింది.

అంబెడ్కర్ కేవలం ఒక దళిత నాయకుడు అంటూ అందరూ అనుకోడం ఈ దేశం చేసుకున్న దుస్థితి, అతడు ప్రకృతి, జ్ఞానం, అన్నం, ఆనందం యే ఒక్క కులానికి చెందింది కాదు అవి సాధించుకోవడం ప్రతి మనిషి జన్మ హక్కు అంటూ పోరాటం చేసిన వ్యక్తి.

ఇప్పటికైనా అంబేద్కర్ ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది.

“నా దేశంలో మతం కులం ప్రస్తావన రాని రోజున రిజర్వేషన్లు ఎత్తి వెయ్యండి” అని అన్నడు అంబేద్కర్

కానీ అది సాధ్యమా!

డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి కలం నుండి జాలువారిన కొన్ని ప్రముఖ సూక్తులు*

★“మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి, అందుకు దేవుడి మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు”

1 Dr Br Ambedhkar

★“దేశం అభివృద్ధి చెందడమంటే, అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి”

★“చట్టం మరియు ఆదేశాలు రాజకీయ శరీరానికి ఔషధాలు రాజకీయ శరీరం అనారోగ్యం చెందినప్పుడు, ఔషధం తప్పక ఉపయోగించాలి”

★“ఉపేక్ష లేని చోట కార్యం వృద్ధి చెందుతూ ఉంటుంది, ఉపేక్ష లేని చోట కార్యం క్షీణిస్తూ, క్షీణిస్తూ వచ్చి చివరకు ముగిసిపోతుంది”

★“నేను నా దేశం ఈ రెండింటిలో నా దేశమే ముఖ్యమైనది”

★“జీవించేందుకు మనిషి తినాలి, సమాజ సంక్షేమానికి జీవించాలి”

★“వినయం, శీలం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం”

★“నిలువెల్లా ధ్యేయం పట్ల అంకితభావం కలిగి ఉన్న వ్యక్తులు కార్యాన్ని ముందుకు నడిపిస్తారు”

★“ధర్మపాలితమైన సమాజం కోసం సంస్థాగతమైన వ్యవస్థలు సమాజంలో నిర్మాణం కావాలి”

★“ఒక వర్గాన్ని ఇంకొక వర్గం పైకి ఉసిగొల్పే ధోరణి చాలా ప్రమాదకరం”

★“కష్టాలు ఎక్కడ విధేయతముగిసి ప్రతిఘటన ప్రారంభమవుతుందో తెలిసి, న్యాయబద్ధంగా సాంఘీక, ఆర్ధిక స్మృతులను సవరించడానికి జంకనివారు అధికారంలో ఉండే ప్రభుత్వం మాకు కావాలి”

★“మూఢ విశ్వాసాలను, హేతువాదానికి నిలబడని వాదనలు విశ్వసించకూడదు, సమాజం చైతన్యవంతంగా రూపొందాలంటే కాలాన్ని అనుసరించి పురోగమించాలి”

★“ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యం”

★“కులం పునాదుల మీద దేనినీ సాధించలేం, ఒక జాతి నీతిని నిర్మించలేం”

★“ఒక గొప్ప వ్యక్తి ఒక ప్రముఖ వ్యక్తికి భిన్నంగా ఉంటాడు, అతను సమాజ సేవకుడుగా ఉండటానికి సిద్ధంగా ఉంటాడు”

★“కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది? చెదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి, అంతమాత్రాన జ్ఞానం వచ్చేసినట్టా?”

★“భవనాన్ని గట్టి పునాదులుతో నిలబెట్టినట్లే విద్యార్ధులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి”

★“నీకోసం జీవిస్తే …. నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే…. జన హృదయంలో నిలిచిపోతావు”

★“ఏ కారణం లేకుండా నిన్ను ఇతరులు విమర్శిస్తున్నారంటే… నీవు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావన్న మాట ఆకారణంగా ఎదురయ్యే విమర్శ విజయానికి నాంది”

★“నేను మీకు చెబుతున్నాను, మతం కోసం మనిషి అంతేగానీ మనిషి కోసం మతం కాదు”

★“ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహానీయుడౌతాడు”

★“మహిళలు సాధించిన పురోగతి పట్ల నేను ఒక సమాజం యొక్క పురోగతిని కొలుస్తాను”

Exit mobile version