లివర్ హెల్దీగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలి

కాలేయం అనేది మన శరీరంలో ముఖ్య అవయవం. అనేక కారణాల వల్ల కాలేయ సమస్యలు చుట్టు ముడతాయి. కొన్ని సార్లు ప్రమాదకర సమస్యలు కూడా వస్తాయి. వీటన్నింటిని ట్రీట్‌మెంట్‌తో సరిచేసుకోవచ్చు. కొన్ని ఆహార పదార్థాలను తినడం వల్ల లివర్ ఆరోగ్యం బాగుంటుంది.

Tips for Fatty Liver Preventionమన శరీరంలో అతి పెద్ద అవయవం కాలేయం. దీన్ని ఆరోగ్యంగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని అలవాట్ల కారణంగా త్వరగా కాలేయం దెబ్బతింటుంది. అలా కాకుండా లివర్ హెల్దీగా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మద్యపానానికి దూరంగా ఉండాలి:

Tips for Fatty Liver Preventionమద్యపానానికి దూరంగా ఉంటే ఫ్యాటీ లివర్ బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మితంగా మద్యపానం చేస్తే అంతగా ఇబ్బందులుండవు.

షుగర్ పెరగకూడదు:

Tips for Fatty Liver Preventionబ్లడ్ లో షుగర్ స్థాయి పెరగకుండా చూసుకోవాలి. తీసుకునే ఫుడ్ లో షుగర్, కొలెస్ట్రాల్ మోతాదు తక్కువ ఉండేలా చూసుకోండి. అలాగే అధిక బరువు అదుపులో ఉంచుకోవాలి.

ఎక్సర్ సైజ్ లు చేయాలి:

Tips for Fatty Liver Preventionతరుచూ ఎక్సర్ సైజ్ లు చేయాలి. తాజాగా ఉండేవాటిని ఆహారంగా తీసుకోవాలి. కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలనే తినాలి. మధుమేహం అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే కూడా ఫ్యాటీ లివర్ తగ్గుతుంది.

ఆపిల్ సైడ‌ర్:

Tips for Fatty Liver Preventionకాస్త వేడి నీళ్లలో ఆపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ కలుపునికుని తాగితే ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడొచ్చు.

గ్రీన్ టీ:

Tips for Fatty Liver Preventionగ్రీన్ టీ ద్వారా ఫ్యాటీ లివర్ ను తగ్గించుకోవొచ్చు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయాన్ని ఆరోగ్యాంగా ఉంచగలవు. తరుచూ గ్రీన్ టీ తాగే వారు ఈ వ్యాధి బారిన పడరు.

పాలలో పసుపు:

Tips for Fatty Liver Preventionపాలలో పసుపు కలుపుకుని తాగితే కూడా చాలా మంచిది. ఇలా రోజూ చేస్తే ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది.

బొప్పాయి:

Tips for Fatty Liver Preventionబొప్పాయి పండు కూడా కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించగలదు. రెగ్యులర్ గా బొప్పాయిని తింటూ ఉంటే ఫ్యాటీ లివర్ నుంచి బయటపడొచ్చు.

ఉసిరి:

Tips for Fatty Liver Preventionతరచూ ఉసిరికాయ ర‌సాన్ని తాగినా మంచి ఫలితం ఉంటుంది. ఇలా రెగ్యులర్ గా చేస్తే ఫ్యాటీ లివర్ సమస్య నుంచి తప్పించుకోవొచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR