మద్యపాన అలవాటును మాన్పించే వంటింటి చిట్కాలు

మందు తాగడం అనేది ఈ జనరేషన్ కి ఫ్యాషన్ అయిపోయింది. కొంచెం సంతోషమైనా లేదా బాధ అనిపించినా మందు బాటిల్ చేతిలోకి రావాల్సిందే. అసలు ఎవరైనా తగట్లేదు అంటే అదో వింత అన్నట్లు తయారువుతున్నారు జనం. తాడుగుకి బానిస అయితే నష్టపోయేది కేవలం తాగిన ఆ ఒక్క వ్యక్తి మాత్రమే కాదు అతడిని నమ్ముకుని ఉన్న కుటుంబం కూడా తీవ్రంగా నష్టపోతుంది. ప్రతీ రోజు ఎదో ఒక మూల మద్యం బారిన పడి మరణించే వారు ఉంటూనే ఉంటారు. వారి కుటుంభాలు సైతం రోడ్డున పడుతూనే ఉంటాయి. అయినా తాగుబోతులు మారరు.

alcoholమందు తాగకండి ఆరోగ్యానికి మంచిది కాదు అని ఎంత మంది అన్నా ఆల్కహాల్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని మందు బాటిల్స్ మీద రాసినా చివరకు సినిమా థియేటర్,లో యాడ్ వేసినా చూపించినా మందు అలవాటును మాత్రం చాలా మంది మానడం లేదు. ముందుకి బానిస అయినవారిని మార్చడానికి ఇంట్లో వాళ్ళు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. తాగే వాళ్ళు లేకపోతే ఖజానా నిండేది ఎలా అనే కారణమో ఏమో కానీ మొత్తానికి తాగుడికి విరుగుడు మాత్రం కొన్నేళ్లుగా తెలియడంలేదు అనేది మాత్రం సత్యం.

mentuluమద్యం ప్రభవం మొట్టమొదటగా ఆరోగ్యం మీదే పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యవంతుడిని కూడా భయంకరమైన రోగాల బారిన పడేస్తుంది. మద్యం సేవించటం అనేది ఒక దీర్ఘకాలిక రోగం వంటిది. సాదారణంగా అది పెరుగుతూనే ఉంటుంది కాని తగ్గటం అంటూ జరగదు. కానీ, తాగుడుకు బానిస అయిన వారిని ఇంట్లో మనం నిత్యం ఉపయోగించే కొన్ని పదార్థాలతో మద్యపాన అలవాటును మాన్పించేలా చేయొచ్చు. అందులో ఒకటి మెంతులు.

శరీరంలోపలి టాక్సిన్లు బయటకు పంపించి, శరీరం నిత్యం ఆరోగ్యంగా ఉంచడంలో మెంతులు చాలా బాగా సహాయపడతాయి. బీపీ, షుగర్, స్థూలకాయం లాంటి అనారోగ్య సమస్యలకే కాక…మద్యపానానికి భానిసైన వారి ఆరోగ్యాన్ని కాపాడి, వారిని తాగుడు అలవాటు నుండి దూరం చేయడంలోనూ మెంతులు శక్తివంతంగా ఉపయోగపడతాయి. మద్యపానం అలవాటు ఉన్న వారికి, రెండు చెంచాల మెంతి గింజలను తీసుకొని, సుమారు 4 గంటల పాటు వాటిని నీటిలో నానబెట్టి వాటిని అదే నీటితో ఉడకబెట్టి, వడగట్టి తేనెతో కలిపి తినేలా చేయాలి.

ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల, మెంతుల్లో ఉండే చేదు, జిగురు తత్త్వాలు మద్యం అంటేనే ఓ రకమైన అసహ్యభావం కలిగించేలా చేస్తాయి. ఫలితంగా ఎంత మద్యపాన ప్రియులైన ఈ మిశ్రమం తిన్నాక మద్యం జోలికి వెళ్లరు. తాగుడుకు బానిస అయినా వారికి, మెంతు ఆకులతో తయారు చేసిన డికాషన్ పట్టించాలి. ఇలా మెంతులు, మెంతు ఆకులు కలిసి, తాగుడికి అలవాటైన వ్యక్తి ఆరోగ్యాన్ని మెరుగుపరిచడమే కాకుండా, వారిని తాగుడు అలవాటు నుండి బయట పడేలా చేస్తాయి.

ఈ కరక్కాయ యొక్క చూర్ణాన్ని నీటిలో కలిపి తాగడంవలన మద్యం అలవాటు మాన్పించవచ్చు. పది చెంచాల నీటిలో పావుచెంచా కరక్కాయ చూర్ణాన్ని కలిపి మద్యం అలవాటు ఉన్నవారికి పదిరోజులు ఇస్తే మద్యం మానేస్తారు. కాకరకాయ ఆల్కహాల్ అడిక్షన్ ను మరియు లక్షణాలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ప్రతి రోజూ ఉదయం కొద్దిగా కాకరకాయ రసాన్ని తీసుకోవడం అలవాటు చేసుకొన్నట్లైతే ఆల్కహాల్ అడిక్షన్ ను నివారించుకోవచ్చు.

menti leavesక్యారెట్ జ్యూస్ పొటాసియం, క్యాల్షియం, మరియు ఇతర పోషకాలు అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్కహాల్ తాగాలనే కోరికను తగ్గిస్తాయి. సెలరీ జ్యూస్ నేచురల్ క్లెన్సర్ గా పనిచేస్తుంది. కాబట్టి, శరీరంలోని టాక్సిన్స్ ను మరియు రక్తంలోని మలినాలను తొలగించడంలో ఇది సమాయపడుతుంది. ఆల్కలిజంతో పోరాడుతుంది. ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆల్కహాల్ తీసుకోవడం తగ్గిస్తారు.

carrot juiceఆల్కహాల్ తాగడం వల్ల సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ ను బలహీనపరుస్తుంది. కాబట్టి, బాదం ఆయిల్ ప్రధాన నాడీవ్యవస్థ మీద పనిచేసి, ఆల్కహాల్ తీసుకోకుండా కంట్రోల్ చేస్తుంది. బాదం నూనెలో ఉండే అమినో యాసిడ్స్, విటమిన్స్, మినిరల్స్, మొదలగునవి మానసిక క్రియల మీద ప్రభావం చూపి, ఆల్కహాల్ తీసుకోకుండా చేస్తుంది. ఇవన్నీ ప్రయత్నిస్తూనే ఆ వ్యక్తి యొక్క అవసరం కుటుంబానికి ఏ మేరకు ఉందో అతనికి వివరించాలి. ప్రయత్నించే చిట్కాల ప్రభావానికి తోడు, మాటలు అతడిని మానసికంగా కూడా మద్యం జోలికి పోకుండా చేస్తాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,730,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR