ఎల్లప్పుడూ పనిచేసే వ్యక్తులు సహజంగానే ఒళ్ళు నొప్పులతో ఇబ్బందులు పడుతుంటారు. ఒళ్ళు నొప్పులు ఇబ్బందులు పెట్టె సమయంలో చిన్నమాత్ర వేసుకుంటారు. ఇది తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా, తరువాత మరలా ఇబ్బందులు పెడుతుంది. నిత్యం మెడిసిన్స్ వాడితే ఆరోగ్యం దెబ్బతింటుంది. అలా కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం పొందాలి అంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
యాపిల్ సైడర్ వెనిగర్ :
ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్‌ను వేసి బాగా కలపండి. దీనికి కాస్త తేనె కలిపి తాగండి. లేదా యాపిల్ సిడార్ వెనిగర్‌ను స్నానం చేసే నీళ్లలో వేసి స్నానం చేయండి. ఇలా రోజుకు 1 లేదా 2 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. యాపిల్ సిడార్ వెనిగర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పిని తగ్గిస్తాయి.
ఐస్ ప్యాక్ :
ఐస్ ముక్కలు తీసుకొని నొప్పి ఉన్న ప్రాంతంలో 10 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా 2-3 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రోజుకు 3 సార్లు ఈ ప్యాక్ వేస్తే చాలు. చల్లని ఐస్ ప్యాక్ బాడీకి పట్టిస్తే ఒళ్లు నొప్పులు నిదానంగా తగ్గుతాయి. ఆ ప్రాంతాల్లో నరాలు కాస్త కుదుటపడతాయి. టెంపరరీ రిలీఫ్ లభిస్తుంది.
అల్లం :
ఒక చిన్న అల్లం ముక్క కప్పు నీళ్లలో వేసి మరగబెట్టాలి. దీన్ని వడకట్టి తేనె కలుపుకొని టీ లా తాగాలి. ఇలా రోజుకు మూడు సార్లు తాగాలి. అల్లంలో ఆరోగ్యాన్ని పెంచే గుణాలుంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, అనాల్జెసిక్ గుణాలున్నాయి. ఇవి ఒళ్లు నొప్పులను తగ్గించడంలో సహకరిస్తాయి.
పసుపు :
ఒక గ్లాసు వేడి పాలలో ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. పాలు చల్లారక తేనె కలపాలి. పడుకునే ముందు ఈ పాలు తాగాలి. పసుపు ఒళ్లు నొప్పులు తగ్గేందుకు చాలా మంచిది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, అనాల్జసిక్, నొప్పి తగ్గించే గుణాలు పసుపులో మెండుగా ఉంటాయి.
దాల్చిన చెక్క :
ఒక గ్లాసు గోరువెచ్చిన నీటిలో పొడి చేసిన దాల్చిన చెక్క వేసి బాగా కలపాలి. దీనికి కొంచెం తేనె కలుపుకొని రోజుకోసారి తాగాలి. దాల్చిన చెక్క అనేక వంటల్లో సుగంధాన్ని వెదజల్లే పదార్థంగా వాడతారు. దీనికి యాంటీ ఇన్‌ప్లమేటరీ, అనాల్జసిక్, నొప్పి తగ్గించే గుణాలు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి, ఒళ్లు నొప్పులు తగ్గేందుకు సహకరిస్తుంది.
మిరియాలు :
ఒక గ్లాసు గోరువెచ్చిన నీటిలో మిరియాల పొడి వేసి బాగా కలపాలి. దీనికి కొంచెం తేనె కలుపుకొని రోజుకోసారి తాగాలి.మిరియాల్లో కెప్‌సాసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది నొప్పిని తగ్గించగలదు. రక్త ప్రసరణను మెరుగు పర్చి సహజమైన పెయిన్ రిలీవర్‌లా పనిచేస్తుంది.
రోజ్‌మేరీ :
ఒక గ్లాసు వేడి నీటిలో టీస్పూన్ రోజ్‌మేరీ టీ కలపి 5 -10 నిమిషాల పాటు ఉంచాలి. దీన్ని వడకట్టి కాస్తంత తేనె కలిపి వెంటనే తాగాలి. మరొ విధానంలో రోజ్ మేరీ నూనెను ఒళ్లంతా మసాజ్ చేసుకోవచ్చు. ఇలా రోజుకు మూడు సార్లు టీ తాగుతూ, ఒక సారి మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.రోజ్‌మేరీ ఒళ్లు నొప్పులను తగ్గించగలదు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, అనాల్జసిక్ గుణాలు ఉంటాయి. ఇది సహజంగానే నొప్పిని తగ్గించగలదు.
ఆవ నూనె :
కొంచెం ఆవ నూనె తీసుకొని ఒళ్లంతా మర్దన చేసుకోవాలి. 30-40 నిమిషాలపాటు వదిలేయాలి. ఆ తర్వాత షవర్ బాత్ చేసుకోవాలి. ఇలా రోజుకు ఒక సారి చేస్తే ఫలితముంటుంది. ఆవ నూనె మసాజ్ వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ నూనెలో అలైల్ ఐసో థైయోసయనేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది నొప్పి నివారిణిలా పనిచేస్తుంది.
అరటిపండు :
రోజుకు 3 లేదా 4 అరటి పండ్లు తినండి. చాలా సందర్భాల్లో పొటాషియం లోపం వల్ల కండరాల్లో నొప్పి కలుగుతుంది. అందుకని రోజు అరటి పండ్లు తింటే ఆలోపం పూడ్చి మునుపటిలా కొత్త ఎనర్జీ వస్తుంది.
చెర్రీలు :
ఒక గ్లాసు నిండా చక్కెర కలపని చెర్రీ జ్యూస్‌ను రోజుకు రెండుసార్లు తాగితే మంచి ఫలితాలు వస్తాయి.
చెర్రీ జ్యూస్‌లో పుష్కలంగా నొప్పిని తగ్గించే గుణాలున్నాయి. ఇది ఒళ్లు నొప్పులను తగ్గిస్తాయి.
లావెండర్ నూనె :
12 చుక్కల లావెండర్ నూనెను 30 చుక్కల కొబ్బరి నూనెలో వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని ఒళ్లంతా రాసి మర్దన చేయాలి. ఇలా రోజుకోసారి చేయాలి.లావెండర్ నూనెలో అనాల్జసిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయి. ఇవి ఒళ్లు నొప్పులను సమర్థవంతంగా తగ్గిస్తుంది.
పిప్పర్‌మెంట్ ఆయిల్ :
12 చుక్కల పిప్పర్‌మెంట్ నూనెను 30 చుక్కల కొబ్బరి నూనెలో వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని ఒళ్లంతా రాసి మర్దన చేయాలి. ఇలా రోజుకోసారి చేయాలి. పిప్పర్‌మెంట్ నూనెలో యాంటీ స్పాస్‌మెడిక్, అనాల్జసిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయి. ఇవి ఒళ్లు నొప్పులను సమర్థవంతంగా తగ్గిస్తుంది.