లో బీపీని సాధార‌ణ స్థాయికి తీసుకువచ్చే ఇంటి చిట్కాలు

పొద్దున్నే లేస్తూనే ఏదో అస‌హ‌నంగా, బ‌ద్ద‌కంగా అనిపిస్తోంది. అదే అల‌స‌ట కుర్చీలోంచి లేచిన‌ప్పుడు కూడా అనిపిస్తుంది. శ‌రీరంలోని ర‌క్త‌మంతా మెదడుకు వెళ్లిపోయి, ఇంకెక్క‌డా లేని భావ‌న క‌లుగుతుంది. ఇలాంటి ల‌క్ష‌ణాలు శ‌రీరంలో అనిపిస్తుంటే మీ బీపీ సాధార‌ణ స్థాయి క‌న్నా త‌క్కువున్న‌ట్టే. దీనికి స‌త్వ‌ర చికిత్స అవ‌స‌రం. ఇందుకోసం కొన్ని మంచి మంచి గృహ చిట్కాలు చూద్దాం.

లో బీపీలో బీపీ నే హైపో టెన్ష‌న్ అని అంటారు. శ‌రీరంలోని అన్ని అవ‌యవాల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా ఒక్క‌సారిగా ప‌డిపోయి బాడీ షాక్‌కు గురైన‌ట్టుగా అవుతుంది.

లో బీపీకి కార‌ణాలు అనేకం వీటిలో ముఖ్య‌మైన‌విః

  • డీహైడ్రేష‌న్‌- త‌ద్వారా వాంతి, విరేచ‌నాలు
  • బ్లీడింగ్‌- మంద్ర‌స్థాయి నుంచి తీవ్ర స్థాయి దాకా
  • అవ‌యవాల వాపు, నొప్పి
  • గుండె రుగ్మ‌త‌లు- గుండె కొట్టుకునే వేగం త‌గ్గ‌డం, గుండెలో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం లాంటివి
  • హై బీపీ కోసం మందులు వేసుకోవ‌డం మూలాన‌
  • బీ 12 విట‌మిన్ లోపం వ‌ల్ల‌
  • అడ్రిన‌లైన్ హార్మోన్ స‌రైన మోతాదులో లేనందు వ‌ల్ల‌
  • సెప్టిసీమియా
  • వేసో వ్యాగ‌ల్ రియాక్ష‌న్ల వ‌ల్ల‌
  • పోస్టుర‌ల్ హైపోటెన్ష‌న్ వ‌ల్ల‌
  • మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల‌
  • మాద‌క‌ద్ర‌వ్యాల‌ను అతిగా సేవించ‌డం వ‌ల్ల‌

సాధార‌ణ బీపీ అంటే 120/80 గా ఉంటే చాలు. 130/80 బీపీ ఉంటే ఎక్కువ‌గా ఉన్న‌ట్టు అర్థం. లో బీపీలో ఈ సంఖ్య‌ల క‌న్నా ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టే నిర్ధారిస్తారు. అయితే 100/60 క‌న్నా త‌క్కువ ఉంటే లో బీపీగా వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చు.

లో బీపీబీపీని ఎప్పుడు సాధార‌ణ స్థాయిలో ఉండేలా చేసుకోవ‌డం అన్ని విధాలా శ్రేయ‌స్క‌రం. లో బీపీ స‌మ‌స్య త‌ర‌చు ఎదుర్కోంటుంటే దాన్ని సాధార‌ణ స్థాయికి తీసుకురావ‌డం అనివార్యం. కొన్ని స‌హ‌జ‌మైన చిట్కాల‌తో బీపీని సాధార‌ణ స్థాయికి తీసుకురావ‌డం చాలా సుల‌భం.

విట‌మిన్లు:

విట‌మిన్లువిట‌మిన్ బీ12, మ‌రియు ఇ – లో బీపీని సాధార‌ణ స్థాయికి తీసుకురావ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తాయి. హై బీపీ ఉన్న‌వారు ఎట్టిప‌రిస్థితుల్లోనూ విట‌మిన్ ఇ తీసుకోకూడ‌దు. విట‌మిన్ బి 12 అనీమియా చికిత్స‌లో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇక ఇదే బీపీని పెంచ‌డంలోనూ స‌హ‌క‌రిస్తుంది.
ఈ విట‌మిన్ల‌ను బాదంప‌ప్పు, పాల‌కూర‌, స్వీట్ పొటాటో, గుడ్లు, పాలు, చీజ్‌, చేప‌ల్లో పుష్కలంగా ఉంటాయి. దీనికి అద‌నంగా వైద్యుడి స‌లహాతో విట‌మిన్ ట్యాబ్లెట్ల‌ను కూడా తీసుకోవచ్చు.

కాఫీ:

కాఫీరోజుకు రెండు క‌ప్పుల కాఫీ తాగాలి. కాఫీలో కెఫీన్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది బీపీని తాత్కాలికంగ పెంచ‌డంలో స‌హ‌క‌రిస్తుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీకాస్తంత తేనె క‌లుపుకొని గ్రీన్ టీ తాగాలి. గ్రీన్ టీ రోజుకు 2 లేదా 3 సార్లు తాగితే చాలు. కాఫీ త‌ర‌హాలోనే గ్రీన్ టీ లోనూ కెఫీన్ స‌మృద్ధిగా ఉంటుంది. కెఫీన్ లో బీపీని ఎలా త‌గ్గిస్తుందో క‌చ్చితంగా తెలియ‌దు కానీ ఇది ఒక ధ‌మ‌నుల‌ను వెడ‌ల్పు చేసే ఒక హార్మోన్‌ను ఉత్తేజ‌ప‌రుస్తుంద‌న్న విష‌యం మాత్రం అర్థ‌మ‌వుతుంది.

రోజ్‌మేరీ నూనె:

రోజ్‌మేరీ నూనె6 చుక్క‌ల రోజ్‌మేరీ నూనెను ఒక టేబుల్ స్పూన్ కొబ్బ‌రి లేదా ఆలివ్ నూనెలో క‌ల‌పాలి. దీంతో ఒళ్లంతా మ‌సాజ్ చేసుకోవాలి. లేదా స్నానం చేసే నీటిలో రోజ్‌మేరీ నూనెను క‌లుపుకోవాలి. ఇలా రోజుకు ఒక‌సారి చేస్తే మంచి ఫ‌లిత‌ముంటుంది. శ్వాస వ్య‌వ‌స్థ‌ను ఉత్తేజ‌ప‌రుస్తుంది. దీని వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా స‌జావుగా సాగుతుంది. అందుకే రోజ్ మేరీ నూనె బీపీని త‌గ్గించ‌డంలో స‌హ‌క‌రిస్తుంది.

ఉప్పు నీళ్లు:

Saltఒక గ్లాసు నీటిలో అర టీ స్పూన్ ఉప్పు క‌ల‌పాలి. దీన్ని సెలైన్ సొల్యూష‌న్ అంటారు. దీన్ని తాగాలి.
బీపీ ప‌డిపోయిన‌ట్టు అనిపించిన‌ప్పుడ‌ల్లా ఇది తాగండి. ఉప్పులో ఉండే సోడియం బీపీని పెంచ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంది. అయితే ఎక్కువ మొత్తంలో ఉప్పు నీరు తాగ‌కూడ‌దు. ఎక్కువ ఉప్పు శ‌రీర ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR