డి విటమిన్ లోపం రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా ?

0
935

కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎక్కువగా వినిపించే అనారోగ్య సమస్య రోగ నిరోధక శక్తి లేకపోవటం… దానికి ముఖ్య కారణం విటమిన్ డి లోపం.విటమిన్ D లోపం లేదా హైపోవినోమినియోసిస్ D . విటమిన్ D సాధారణంగా ఉదయం పూట సూర్యకాంతిలో తగిన అతినీలలోహిత B కిరణాల నుండి లభిస్తుంది. కానీ చాలామంది ఈ సూర్యరశ్మిని చూడలేకపోతున్నారు. విటమిన్ D అనేది కాల్షియం మరియు ఫాస్ఫేట్ యొక్క సమూహం. ఇది మనుషుల శరీరానికి, ఆరోగ్యానికి చాలా అవసరం. కండరాలు, ఎముకలు ప్రతి ఒక్క భాగం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ D తప్పనిసరి. సూర్యకాంతికి గురైనప్పుడు మన శరీరం ఈ విటమిన్ ను తయారు చేసుకుంటుంది. విటమిన్ D కలిగిన పోషకాహార తీసుకోకపోవడం వలన ఈ లోపంకి చెక్ పెట్టవచ్చు.

Vitamin Dవిటమిన్ డి లోపం కూడా మనల్ని తరచుగా అనారోగ్యానికి గురిచేస్తుంటుంది. ఈ విటమిన్ రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది. ఈ రోగ నిరోధక వ్యవస్థ, అంటువ్యాధులతో పోరాడే కణాలను ఉత్పత్తి చేస్తుంది. మీరు తరచూ జలుబు లేదా ఫ్లూ సమస్యలను ఎదుర్కొంటున్నట్లైతే, మీరు మీ విటమిన్ డి స్థాయిలను ఒకసారి చెక్ చేసుకోవలసి ఉంటుంది. మీరు తరచుగా అలసిపోతున్నారా? దీనికి విటమిన్ డి లోపం కారణం కావచ్చు. ఇలా తరచుగా అలిసిపోవడమనేది మీ రోజూవారీ పనుల మీద కూడా ప్రభావం చూపుతుంది. డిప్రెషన్,జుట్టు రాలడం, చర్మసంబంధ వ్యాధులు కూడా విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధులే.

అయితే విటమిన్ డి లోపం రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

* శరీరం 45 నిమిషాల పాటు ఎండకు ఎక్స్‌‌‌పోజ్ అయితే మనకు కాలాల్సినంత విటమిన్-డి లభించినట్టే. సూర్యకాంతిని గ్రహించి శరీరమే ఈ విటమిన్‌‌ను తయారుచేసుకోగలదు.

*గుడ్డు పసుపు సొనలో విటమిన్-డి ఉంటుంది. కొందరు ఎగ్ వైట్ మాత్రమే తీసుకుంటారు. అలాకాకుండా పసుపు సొనను కూడా తీసుకోవడం మంచిది.

tips for vitamin d deficiency*నట్స్, ఆయిల్ సీడ్స్‌‌లో కూడా విటమిన్-డి లభిస్తుంది. వీటిని డైలీ డైట్‌‌లో తీసుకోవటం మంచిది.

tips for vitamin d deficiency*వారానికి కనీసం రెండుసార్లు ఆహారంలో చేపలు తీసుకుంటే మంచిది. అందులోనూ వైట్ ఫ్యాటీ ఫిష్ తీసుకోవడం మంచిది.

tips for vitamin d deficiency*విటమిన్-డి ఉన్న సెరెల్ బ్రేక్‌‌ఫాస్టులు, పాలు, పెరుగు, ఆయిల్స్ మార్కెట్లో ప్రత్యేకంగా లభిస్తాయి. వీటిని కూడా ఆహారంలో చేర్చుకోవాలి.

tips for vitamin d deficiency*పుట్టగొడుగుల్లో కూడా విటమిన్-డి ఉంటుంది. వీటిని కొంత సమయం ఎండబెట్టడం వల్ల కూడా విటమిన్-డి పెరుగుతుంది. పుట్టగొడుగులను ఇతర కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు.

SHARE