Home Health నిల్వ ఉంచిన బియ్యంలో పురుగులు పట్టకుండా ఈ చిట్కాలు పాటించండి!

నిల్వ ఉంచిన బియ్యంలో పురుగులు పట్టకుండా ఈ చిట్కాలు పాటించండి!

0

ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం స్టాక్ ఉండనే ఉంటాయి. సంవత్సరానికి సరిపడా బియ్యం ఒకేసారి కొని నిల్వ చేసుకుంటున్నారు. అలా బియ్యం ఎక్కువ రోజులు ఉండడం వల్ల బాగా అన్నం ఉడుకుతుందనీ ఒక నమ్మకం. అయితే వాటిని ఎలా నిల్వ చేయాలో అందరికీ తెలీదు. కొత్తలో అవి బాగా ఉన్నకాని తర్వాత కొన్నాళ్లకు వాటిలో పురుగు పట్టి పాడవుతాయి.

stored riceపురుగు పట్టిన బియ్యం వాడాలంటే అస్సలు మన్సస్సు ఒప్పుకోదు. అంతే కాదు వాటిని శుభ్రం చేయడం కూడా తల ప్రాణం తొక్కస్తుంది. పల్లెటూళ్లలో అయితే చేటతో చెరిగి లేదా ఎండలో పెట్టి బియ్యాన్ని శుభ్రం చేసుకుంటారు. కానీ విధులతో బిజీగా ఉండే పట్టణవాసులకు అంత తీరిక ఉండదు.

కాబట్టి బియ్యం పురుగు పట్టకుండా ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది. బియ్యం బస్తాలు ఎక్కువ సంఖ్యలో నిల్వ చేసేటప్పుడు బియ్యానికి తేమ తగలకుండా జాగ్రత్త పడాలి. బియ్యానికి తేమ చేరితే రంగు మారి త్వరగా పాడవుతాయి.బియ్యం బస్తాలు వేసేటప్పుడు ఆ ప్రదేశంలో చీమల మందు చల్లి పెట్టుకోవాలి.

వాడుకోవడానికి బియ్యం డబ్బాలో పోసుకునేటప్పుడు డబ్బా శుభ్రం చేసి బియ్యంలో ఎండుమిరపకాయలు వేస్తే పురుగు పట్టకుండా ఉంటాయి. కొంచెం మోతాదులో బెల్లం కానీ, పొగాకు కానీ బియ్యంతో పాటు ఉంచిన పురుగులు దరిచేరవు. రాతి ఉప్పును శుభ్రమైన బట్టలో చిన్న మూట కట్టి బియ్యం డబ్బాలో ఉంచిన బియ్యం పాడవకుండా ఉంటాయి.

వేపాకులను బియ్యం ఆడించిన తర్వాత అందులోకి కలిపితే ఆ బియ్యానికి పురుగు పట్టే అవకాశం ఉండదు. ఇందులో క్రిమిసంహారక లక్షణం వల్ల ఆ పురుగులు చనిపోతాయి. అంతే కాకుండా వేపాకును బాగా ఎండబెట్టి, వాటిని పొడిగా చేసి, ఏదైనా చిన్న క్లాత్ లో పొడిని పోసి కట్టి, బియ్యపు సంచులు మధ్య ఉంచినా, బియ్యంలో తెల్లపురుగులతో పాటు, ముక్క పురుగులు కూడా చేరకుండా ఉంటాయి.

వంటకాల్లో విరివిగా ఉపయోగించే ఇంగువ కూడా బియ్యంలో పురుగులు చేరకుండా కాపాడుతుంది. దీనికి కారణం ఇంగువ వెదజల్లే ఘాటైన వాసనే. దీన్ని కొద్దిగా తీసుకొని బియ్యంలో కలిపితే సరిపోతుంది. దీని నుంచి వెలువడే ఘాటైన వాసన వల్ల బియ్యంలో పురుగులతో పాటు, తేమ వల్ల పెరిగే బ్యాక్టీరియాను సైతం సంహరిస్తుంది. ఇవే కాదు..బిర్యానీ ఆకులను ఉపయోగించినా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది.

ఇక కాకరకాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి, ఆ ముక్కలను ఎండబెట్టి బియ్యపు సంచులు మధ్య ఉంచడం వల్ల, ఎటువంటి పురుగులు దరిచేరవు. లవంగాలను లేదా లవంగాల పొడిని బియ్యపు సంచుల లోపల మూటకట్టి వేయడం వల్ల పురుగుల బారి నుంచి తప్పించుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు కూడా బియ్యం సంచుల లోపల పొట్టు తీయకుండా అలాగే ఉంచడం వల్ల అందులోకి పురుగులు రావు.

బియ్యంలో పురుగులు పడటానికి తేమ కూడా ఒక కారణమే. బియ్యంలో తేమ వల్ల పురుగులు పట్టవచ్చు. అందుకే బియ్యంలో తడిచేరకుండా చూసుకోవాలి. దీనికోసం బియ్యంలో కొద్దిగా బోరిక్ పౌడర్ ని మిక్స్ చేయాలి. ఇది బియ్యంలోని తేమను పీల్చుకుని, పురుగులు పడకుండా ఉంటుంది.

మరొకటి కర్పూరం. ఇందులో ఘాటైన సువాసన ఉండడంవల్ల. ఈ వాసనకి బియ్యంలో పురుగులు పడవు. వీటిని అలాగైనా బియ్యం సంచుల మధ్య ఉంచవచ్చు లేదా బాగా పొడి చేసి ఒక క్లాత్ లో ఆ పొడిని వేసి బియ్యం బాక్స్ లో ఉంచవచ్చు.

డిసికాన్ ప్యాకెట్లను బియ్యం సంచుల మధ్య ఉంచడం వల్ల బియ్యం లోపల ఉండేటువంటి తేమను ఇవి పీల్చి వేస్తాయి. తద్వారా పురుగులు పట్టకుండా ఉంటాయి. లేకపోతే ఆయుర్వేద దుకాణాల్లో దొరికే బైద్యనాద్, పారద్ గుళికలు బియ్యంలో కలిపితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అందరికీ అందుబాటులో ఉన్న ఇలాంటి వాటిని ఉపయోగించి బియ్యాన్ని నిల్వ చేసుకోవచ్చు.

Exit mobile version