చలికాలంలో పెదాలు పగలడం లాంటి సమస్యలకు చెక్ పెట్టే చిట్కాలు

అందం అనగానే అందరూ ఎక్కువగా ముఖం, కళ్లు, చిరునవ్వు, అదరసౌందర్యం వంటివాటిని చూస్తారు. అలాంటివే నలుగురిలో మనల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి కూడా. అయితే చలికాలంలో మీ మోములో చిరునవ్వు అందంగా కనబడాలంటే పెదాలను పదిలంగా కాపాడుకోవాలి. ఇవి కేవలం అందానికే కాదు ఆరోగ్యానికి కూడా అవసరం.

protect the lips from cracking in winterఅందంగా కనిపించేందుకు ఎంత మేకప్ వేసుకున్నా పెదాలు ఆకర్షణీయంగా లేకపోతే నలుగురిలో మీరు అందంగా కనబడరు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే చలికాలంలో పెదాలు పగలడం అనేది చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది.

protect the lips from cracking in winterఅయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకొని చలికాలంలో చక్కని మోముతో నలుగురిలో మీరు స్పెషల్ గా కనిపించండి.

తేనే:

protect the lips from cracking in winterచలికాలంలో పెదాలు పొడిబారకుండా ఉండేందుకు మీ రెండు పెదవులపై స్వచ్ఛమైన తేనేను రాయండి. ఆపైన ఒక లేయర్(కొద్దిగా) వ్యాసిలీన్ ను కూడా రాయండి. అలా చేసిన 15 నిమిషాల తర్వాత తడిబట్టతో వాటిని తుడిచేయండి. ఇలా ఏడురోజుల పాటు చేస్తే మంచి ఫలితాలొస్తాయి.

గులాబీ రేకులు:

protect the lips from cracking in winterముందుగా పావు కప్పు పచ్చి పాలను తీసుకోండి. అందులో ఐదు లేదా ఆరు గులాబీ రేకులను రెండు లేదా మూడు గంటల పాటు ఉంచండి. ఆ తర్వాత ఆ రేకుల్ని మీ చేతులతోనే మెత్తటి పేస్టులా తయారు చేయండి. ఈ పేస్టుని మీ పెదాలకు రాసిన 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోండి. ఇలా ఒక వారంలో రెండు రోజుల పాటు చేసేయండి చాలు. మీ పెదాలు చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

కొన్ని రకాల నూనెలు:

protect the lips from cracking in winterమీ పెదాలు అందరి కంటే అందంగా కనబడాలంటే కొబ్బరి నూనె లేదా బాదం నూనె, ఆలివ్ ఆయిల్ లాంటి క్యారియర్ ఆయిల్ లో ఒకట్రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా గ్రేప్ సీడ్ ఆయిల్, నీం ఆయిల్ వంటి వాటిని కలిపి మీ పెదాలపై రాయండి. ఒకరోజులో రెండు లేదా మూడుసార్లు ఇలా చేయాలి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చలికాలమంతా మీ పెదాలు అందంగా మారిపోతాయి.

అలోవెరా జెల్:

protect the lips from cracking in winterమీ పెదాలు రోజంతా తాజాగా కనబడాలంటే ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది. ముందుగా తాజాగా తీసిన అలోవెరా జెల్ ని గాలి దూరని ఒక డబ్బాలోకి తీసుకోండి. రాత్రి పడుకునే ముందు మీ పెదాలకు ఈ జెల్ ని రాయండి. అవసరాన్ని బట్టి ఈ డబ్బాను ఎక్కువ రిఫ్రిజరేటర్లో ఉంచండి. అప్పుడు మీ పెదాలకు మంచి ఫలితం ఉంటుంది.

బటర్:

protect the lips from cracking in winterమీ పెదాలు చలికాలంలో చక్కని రూపంలో కనిపించేందుకు కొన్నిరోజుల పాటు రాత్రి వేళ ముఖ్యంగా నిద్రలోకి జారుకునే ముందు షియా బటర్ కానీ, కోకోవా బటర్ కానీ లిప్స్ కి పట్టించి రాత్రంతా అలా వదిలేయాలి. అప్పుడు మీ పెదవులు మంచి రూపాన్ని కలిగిఉంటాయి.

పెరుగు:

protect the lips from cracking in winterచలికాలంలో మీ పెదవులు చక్కని రూపును కలిగి ఉండాలంటే రాత్రి వేళలో పీనట్ బటర్, పెరుగును రాత్రి వేళ నిద్రపోయే ముందు మీ పెదాలకు రాయాలి. అలా పది నిమిషాల పాటు ఉంచి, తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడిగేయాలి. కొన్నిరోజుల పాటు తరచుగా ఇలా చేస్తే మీరు ఊహించిన పలితాలొచ్చేస్తాయి.

గ్రీన్ టీ బ్యాగ్:

protect the lips from cracking in winterముందుగా ఒక కప్పు వేడి నీటిలో ఒక గ్రీన్ టీ బ్యాగుని కొన్ని నిమిషాల పాటు ముంచాలి. ఆ తర్వాత ఆ బ్యాగుని మీ పెదాల మీద కొన్ని నిమిషాల పాటు ఉంచితే కూడా మీ పెదాలు అందంగా మారిపోతాయి. రోజులో ఒకసారి ఇలా చేస్తే చాలు.

దోసకాయ:

protect the lips from cracking in winterఒక దోసకాయ ముక్క తీసుకుని పెదాల మీద రబ్ చేయండి. అప్పుడే వచ్చే జ్యూస్ ను పది నిమిషాల పాటు మీ పెదాలపై అలాగే వదిలేయండి. ఆ తర్వాత మంచి నీటితో శుభ్రంగా కడిగేయండి. ఇలా రెండు సార్లు చేస్తే మీరు ఊహించిన ఫలితాలు రావడమే కాదు మీ పెదాలు మరింత ఆకర్షణీయంగా తయరవుతాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR