చెమట నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు చిన్నచిట్కాలు

0
13

సాధారణంగా ఎక్కువగా వర్క్ ఔట్స్ చేసేవారికి, శారీరకంగా శ్రమించే వారికి చెమట పట్టడం చూస్తూ ఉంటాం కానీ కొంత మందికి కాలాలతో సంబంధం లేకుండా చెమట పడుతూ ఉంటుంది. ఓ వైపు ఫ్యాన్ తిరుగుతున్నా, కూల‌ర్ ముందు కూర్చున్నా చెమ‌ట పడుతూనే ఉంటుంది.

Tips to get relief from sweatచివరకు ఏసీల్లో కూర్చొన్నా సరే చెమట పడుతుంది. దాని వల్ల చిరాకు చిరాకు గా ఉంటారు. ఏం చేయాలో తెలియ‌క చాలా మంది స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంటారు. అయితే ఎక్కువ‌గా విడుద‌ల‌య్యే చెమట నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు చిన్న చిన్నచిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాం.

Tips to get relief from sweatఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి ముందు రెండు టీస్పూన్ల వెనిగ‌ర్‌, ఒక టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ల‌ను క‌లిపి తాగితే చెమ‌ట ఎక్కువ‌గా రాకుండా ఉంటుంది.

Tips to get relief from sweatకొంతమంది ఉదయం స్నానం చేసేప్పుడు, రాత్రి పడుకునేటప్పుడే మాత్రమే ముఖం కడుగుతారు. అలా కాకుండా రోజులో మూడు నుంచి అయిదు సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం వల్ల చర్మరంధ్రాల్లోని వేడిని తగ్గించడమే కాకుండా ఎక్కువగా చెమట బయటికి రాదు. అంతేకాకుండా చర్మం తాజాగా అనిపిస్తుంది.

Tips to get relief from sweatరోజూ రాత్రి నిద్రపోవడానికి ముందు కీర దోసకాయల రసాన్ని ముఖానికి రాసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా ఇలా చేస్తే ముఖానికి చెమట పట్టడం తగ్గుతుంది.

Tips to get relief from sweatముఖం మీద చెమటను తగ్గించుకోవడానికి ఐస్‌ ముక్కలను ఒక వస్త్రంలో చుట్టి ముఖం మీద తరచూ అద్దుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చాలా హాయిగా ఉండడంతో పాటూ చెమట ఎక్కువగా రాకుండా కూడా ఉంటుంది.

పోటాషియం ఎక్కువగా ఉండే అరటి పండ్లు తదితర ఆహారాలను తినడం వలన చెమట ఎక్కువగా పట్టకుండా చూసుకోవచ్చు.

Tips to get relief from sweatకార్న్ స్టార్చ్‌, బేకింగ్ సోడాల‌ను కొద్ది కొద్దిగా తీసుకుని బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. చంకల్లో ఎలాంటి త‌డి లేకుండా చూసుకుని ఆ మిశ్ర‌మాన్ని రాయాలి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంత‌రం నీటితో క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చెమ‌ట ఎక్కువ‌గా రాకుండా ఉంటుంది.

గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల చెమట ఎక్కువగా పట్టదు.

Tips to get relief from sweatనిత్యం ఏదైనా ఒక స‌మ‌యంలో 1 గ్లాస్ ట‌మాటా జ్యూస్‌ను తాగినా అధికంగా చెమ‌ట ప‌ట్ట‌కుండా చూసుకోవ‌చ్చు. అలాగే, గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగితే చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది.

 

Contribute @ wirally

SHARE