ఆస్తమా వ్యాధి నుండి ఉపశమనం పొందాలిఅంటే ఈ చిట్కాలు పాటించండి

0
427

ఆస్థమా ప్రస్తుతం ప్రపంచంలో పలువురిని వేధిస్తున్న సమస్య. ఆధునిక జీవన శైలి,కాలుష్యం కారణంగా పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఆస్తమా వ్యాధి వచ్చిన వారికి ఊపిరితిత్తుల్లో గాలి ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడుతుంటాయి. దీంతో దగ్గు, గురక వంటి సమస్యలు వస్తుంటాయి. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ చిట్కాలను పాటిస్తే ఆస్తమా వ్యాధి నుండి సమర్థవంతంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Tips to keep asthmaగ్లాస్ పాలలో రెండు వెల్లుల్లి రెబ్బలను వేసుకుని వాటిని బాగా మరిగించుకోవాలి. ఈ పాలను తీసుకోవడం వలన ఆస్తమా వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది. నిత్యం తాగే టీలో కొద్దిగా అల్లం వెల్లుల్లి రసాలను వేసుకుని టీ రూపంలో తీసుకుంటే కూడా ఆస్తమా వ్యాధి నుండి విముక్తి చెందవచ్చును.

Tips to keep asthmaఆస్తమా వ్యాధులను తగ్గించే వాటిలో తేనె ముందుంటుంది. తేనె ఆస్తమా స్థాయిలకు పెరుగుటకు కారణమయ్యే మ్యూకస్ లేదా శ్లేష్మాన్ని స్థిరీకరణం చెందిస్తుంది. మీలో ఆస్తమా స్థాయిలు పెరిగినపుడు తేనెను ముక్కు దగ్గర పెట్టుకొని దాని వాసనను పీల్చుకోండి. అంతేకాకుండా, రోజు ఒక గ్లాసు వేడి నీటిలో తేనెను కలుపుకొని తాగటం వలన ఆస్తమా స్థాయిల నుండి ఉపశమనం పొందుతారు.

Tips to keep asthmaరోజు క్రమం తప్పకుండా కాఫీ తాగటం వలన ఆస్తమా స్థాయిలు తగ్గే ముఖం పడతాయి కారణం కాఫీలో ఉండే కెఫిన్ ‘బ్రాంకియోడైలెటర్’లుగా పనిచేస్తాయి. కాఫీ తాగటం వలన శ్వాస గొట్టాలను శుభ్రపరచి, శ్వాసను సులభతరం చేస్తాయి. గాడత ఎక్కువగా ఉన్న కాఫీ తాగటం వలన మంచి ఫలితాలను పొందుతారు. కానీ రోజు మొత్తంలో 3 కప్పుల కన్నా ఎక్కువ కాఫీ తాగకూడదు. ఎక్కువ తాగటం వలన దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది.

Tips to keep asthmaమెంతులు శరీరంలోని అలర్జీలను తగ్గించి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. రాత్రివేళ గిన్నె నీళ్లల్లో కొద్దిగా మెంతులను నానబెట్టుకోని వాటిని మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపును తీసుకుంటే ఇన్‌ఫెక్షన్స్ తగ్గుతాయి.

Tips to keep asthmaతులసి ఆకులను ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకుల నుండి తయారు చేసిన రసంను వేడి నీటిలో కలిపి, అందులో నుండి వచ్చే వేడి ఆవిరులను ముక్కు నుండి పీలుస్తూ, నోటి నుండి వదలాలి.

causes of mouth soresదీని వలన తులసి ఆకులలో ఉన్న యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు శ్వాస గోట్టలో కలిగే ఇన్ఫ్లమేషన్’లను తగ్గించి ఆస్తమా స్థాయిలను తగ్గిస్తాయి. తద్వారా ఆస్తమా స్థాయిలను నుండి ఉపశమనం పొందుతారు.

 

SHARE